Oorvasivo Rakshasivo Today Episode శ్రవణ్ చెప్పిన అడ్రస్‌కు విజయేంద్ర వస్తాడు. అక్కడ పవిత్రను చూసి ఎమోషనల్ అవుతాడు. మరోవైపు దుర్గ కూడా అక్కడికి వస్తుంది. విజయేంద్ర ఫ్రెండ్‌ శ్రవణ్ దుర్గని చూసి దుర్గ ఇక్కడికి వచ్చిందేంటి అని షాక్ అవుతాడు. ఇక విజయేంద్ర పవిత్ర అని దగ్గరకు వెళ్తే పవిత్ర భయంతో వద్దు అని విజయేంద్రను ముట్టుకోనివ్వదు. విజయేంద్ర ఏమైంది పవిత్ర అని వైష్ణవి ఏది అని అడుగుతుంది. ఇక పవిత్ర వెళ్లిపో నన్ను వదిలిపెట్టు అని అక్క అక్కా అని ఏడుస్తుంది. ఇక అప్పుడే దుర్గ అక్కడికి వస్తుంది. 


విజయేంద్ర: పవిత్ర ఏమైంది నీకు.. వైష్ణవి ఏది.. నువ్వు ఇలా అవ్వడానికి కారణం ఎవరు. 
పవిత్ర: అక్కా.. అక్కా.. విజయేంద్ర దుర్గను చూసేస్తాడు. ఇక పవిత్ర దుర్గ డైరీ విసిరి విజయేంద్రను కొడుతుంది. దుర్గ పవిత్రను కూల్ చేయడానికి ట్రై చేస్తుంది.
విజయేంద్ర: దుర్గ పవిత్ర ఇక్కడుందేంటి. పవిత్ర ఇక్కడుంది అంటే నా వైష్ణవి కూడా ఇక్కడే ఉంటుంది. దుర్గ మాట్లాడండి.. 
దుర్గ: స్టాపిట్ విజయేంద్ర.. నువ్వు ఎన్ని అడిగినా నేను సమాధానం చెప్పను. వెళ్లిపో.. వెళ్లిపోమన్నానా.. గెట్ అవుట్ విజయేంద్ర. దుర్గ పవిత్రను కూల్ చేస్తుంది. తర్వాత విజయేంద్ర దగ్గరకు వస్తుంది.
దుర్గ: విజయేంద్ర నువ్వేంటి ఇక్కడ.. 
విజయేంద్ర:  ఆమాట అడగాల్సింది నువ్వు కాదు నేను.
దుర్గ: ఇది మా గెస్ట్ హౌస్. 
విజయేంద్ర: ఇంటి సంగతి పక్కన పెట్టు. పవిత్ర ఇక్కడుందేంటి. పవిత్రకు నీకు సంబంధం ఏంటి. నిన్ను తను అక్క అని ఎందుకు పిలుస్తుంది. అసలు పవిత్ర, వైష్ణవిలు ఎవరో నీకు తెలీదు అలాంటప్పుడు నీ దగ్గర పవిత్ర ఎందుకు ఉంది. నువ్వు నా దగ్గర ఏదో నిజాన్ని దాస్తున్నావ్ ఎందుకు. ఇన్ని రోజులుగా నేను వైష్ణవి పవిత్రల కోసం వెతుకుతున్నాను అని నీకు తెలుసు కానీ పవిత్ర నీ దగ్గర ఉంది అని చెప్పలేదు ఏంటి. నేను నిన్ను క్లోజ్ ఫ్రెండ్‌గా ఫీలయ్యాను. నీ గురించి తెలిసి నీ మంచి మనసుకు అంతా మంచే జరగాలి అని కోరుకుంటూ వచ్చాను. కానీ నువ్వు మాత్రం ఇప్పుడు నువ్వు నిజం చెప్తే ఎప్పటికీ మనం ఫ్రెండ్స్ లా ఉంటాం. నిజం దాస్తే శత్రువులా ట్రీట్ చేస్తా.. చెప్పు నీకు పవిత్రకు ఉన్న సంబంధం ఏంటి. చెప్పు..
దుర్గ: నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోకు విజయేంద్ర. పవిత్ర నాకు రెండు మూడు నెలలుగానే తెలుసు. డాడీ పనిమీద హాస్పిటల్‌కి వెళ్లినప్పుడు పవిత్రను చూశాను. తను అక్కడున్న పరిస్థితి చూసి నాకు జాలి వేసింది. తన గురించి తెలుసుకోవాలి అని ప్రయత్నించాను. కానీ ఏం తెలీలేదు. ఇంతలో నువ్వు నాకు ఈ మధ్యనే పరిచయం అయ్యావు. పవిత్రకు ప్రమాదం ఉందని నాకు అర్థమైంది. అందుకే నీ గురించి నాకు పూర్తిగా తెలీకుండా పవిత్ర గురించి నీకు చెప్పొద్దు అనుకున్నాను. 
విజయేంద్ర: నిజం చెప్పు నీకు నిజంగా వైష్ణవి ఎవరో తెలీదా.. 
దుర్గ: తెలీదు విజయేంద్ర. నువ్వు వైష్ణవిని ఎంతగా వెతుకుతున్నావో నాకు తెలుసు. పైగా మంచోడివి అలాంటప్పుడు తన గురించి తెలిస్తే నీకు చెప్పడానికి నాకు అభ్యంతరం ఏముంటుంది. 
విజయేంద్ర: పవిత్ర ఎక్కడుందో ఎన్ని రోజుల సమయం పట్టింది. ఇంక నా వైష్ణవి గురించి తెలియడానికి ఇంకా ఎంత టైం పడుతుందో. పవిత్ర అంటే వైష్ణవికి ప్రాణం అలాంటిది పవిత్రను వదిలి ఇన్ని రోజులు ఎలా ఉంటుంది. అది జరగని పని. ఇవన్నీ ఆలోచిస్తుంటే నా వైష్ణవికి ఏమైనా ప్రమాదం జరిగిందా అని భయం వేస్తుంది.
దుర్గ: మనసులో నిన్ను నా గురించి ఆలోచించకుండా చేయాలనే విజయేంద్ర. ఇదంతా.. తనకు ఏమైనా అయిందేమో..
విజయేంద్ర:  ఏమైనా సరే నా మనసు చెప్తుంది నా వైష్ణవి నాకు దగ్గరగానే ఉంది. కానీ ఎక్కడుందో నా కళ్లే తెలుసుకోలేక పోతున్నాయి. కానీ త్వరలోనే తెలుసుకుంటా.
దుర్గ: ఏడుస్తూ మనసులో.. నువ్వు ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నావో తెలీక నిన్ను అపార్థం చేసుకున్నాను నన్ను క్షమించు విజయేంద్ర.. 
విజయేంద్ర: దుర్గ ఈ డైరీ నా వైష్ణవిది. ఇందులో కొన్ని పేజీలు చింపేసున్నాయి. పవిత్ర నీకు వైష్ణవి గురించి ఏమైనా చెప్పిందా.. దుర్గ పవిత్ర నేను ప్రేమించిన వైష్ణవి చెల్లి. తను నీ కంటే నాకే ఇంపార్టెంట్. అసలు పవిత్రను నేను ఇలా చూడలేకపోతున్నా. పవిత్ర పరిస్థితే ఇలా ఉంది అంటే నా వైష్ణవి పరిస్థితి ఎలా ఉందో తలచుకుంటేనే భయంగా ఉంది. నా వైష్ణవి, పవిత్రలకు ఇలాంటి పరిస్థితికి తెచ్చిన వాళ్లని చంపేయాలి. అంటూ గట్టిగా కొట్టుకుంటాడు. దీంతో చేతికి రక్తం వస్తుంది. దుర్గ విజయేంద్ర చేతికి కట్టు కడుతుంది. 


తానే తప్పంతా చేశానని అమెరికా వెళ్లి తప్పు చేశానని విజయేంద్ర ఏడుస్తాడు. అది చూసి దుర్గ ఏడుస్తుంది. విజయేంద్రకు ధైర్యం చెప్తుంది. ఇక విజయేంద్ర పవిత్ర జాగ్రత్త అని దుర్గకు చెప్తుంది. ఇక విజయేంద్ర ప్రేమను పొందలేకపోతున్నాను అని దురదృష్టవంతురాలిని అని ఏడుస్తుంది. ఇక దుర్గ విజయేంద్ర గురించి తన తండ్రికి చెప్తుంది.


ఇక విజయేంద్ర ఇంటికి వస్తే రక్షిత చేతికి కట్టు చూసి షాక్ అవుతుంది. ఏమైందని ప్రశ్నిస్తుంది. విజయేంద్ర కవర్ చేస్తాడు. ఇక రక్షిత విజయేంద్రకు భోజనం పెడతాను అని తీసుకెళ్లి తన చేతితో తినిపిస్తుంది. ఇక విజయేంద్ర ఏదో ఆలోచనలో ఉంటే వైష్ణవి గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది రక్షిత. ఇక విజయేంద్ర రక్షితకు పవిత్ర గురించి చెప్పాలా వద్దా అని అనుకుంటాడు. తనకు ధీరు మీద అనుమానం ఉందని చెప్పను అనుకుంటాడు. ఇక విజయేంద్ర అన్నీ తెలుసుకుంటాను అనుకుంటాడు. ఇక రక్షిత విజయేంద్రను మంచితనంతో డైవర్ట్ చేయాలి అనుకుంటుంది. వైష్ణవి కేసు రీఓపెన్ చేయొద్దని అంటుంది. రక్షిత ఎన్ని చెప్పినా విజయేంద్ర వినడు. 


ఇక ఉదయం విజయేంద్ర మేడ మీద నుంచి రెయిన్‌బో చూస్తాడు. అది చూసి తాను వైష్ణవి సేమ్‌ కలర్ డ్రస్ వేసుకునే ప్రతి సారి రెయిన్‌బో వస్తుందని అనుకుంటాడు. ఇక రెడ్ కలర్ డ్రస్ విజయేంద్ర వేసుకోగా దుర్గ కూడా రెడ్ కలర్ లంగావోణి వేసుకుంటుంది. ఇక విజయేంద్ర దుర్గ ఇంటి దగ్గర దుర్గ కోసం ఎదురు చూస్తాడు. వైష్ణవి కనిపించినప్పుడు చూపించాలి అని రెయిన్‌బోతో సెల్ఫీ తీసుకుంటాడు. ఇంతలో అక్కడికి దుర్గ వస్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కుమారి ఆంటీ: కుమారి ఆంటీనా మజాకా - సీరియల్స్‌‌‌లో ఎంట్రీ, వైరల్ అవుతున్న ప్రోమో