Satyabhama Today Episode విశ్వనాథం తన కూతురు సత్యభామతో నీ నవ్వులో జీవం లేదు. మా నవ్వులోనూ జీవం లేదు ఒకర్ని మరొకరం మోసం చేసుకుంటున్నాం అని అంటాడు. ఇప్పటికైనా మనసు మార్చుకోమని సత్యకు విశ్వనాథం చెప్తాడు. సత్య అన్నీ మర్చిపోయి అంతా మంచే జరగాలి అని తనని ధీవించమని చెప్పి వెళ్లిపోతుంది.


భైరవి: పంతుల్ని పిలిపించి.. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో అబద్ధం చెప్పాల్సి వస్తుంది కదా పంతులు.. నువ్వు ఎప్పుడైనా అబద్ధం చెప్పావా.. 
పంతులు: చాలా సార్లు చెప్పాను అమ్మ.
భైరవి: అంటే ఇంకో సారి చెప్పినా పెద్ద ఫరక్ ఏమీ పడదు కదా.. అంతే కదా పంతులు మా వాళ్లు అందర్ని పిలుస్తా అందరి ముందు నువ్వు ఒక చిన్న అబద్ధం చెప్పాలి.
పంతులు: ఏం చెప్పాలి అమ్మా..
భైరవి: రేపటి రెండు పెళ్లిళ్లు ఒకే ముహూర్తానికి జరగడానికి వీళ్లేదు. లెక్కలు తప్పి ముహూర్తాలు తప్పు పెట్టాను అని చెప్పాలి. అనుకున్న ముహూర్తానికి ముందు బాబు పెళ్లి జరగాలి.. తర్వాత గంటలో మరో ముహూర్తానికి అమ్మాయి పెళ్లి జరపాలి ఇలానే చెప్పాలి. 
నందిని: దాని వల్ల లాభం ఏంటి అమ్మా. గంట ముందు జరగాల్సిన పెళ్లి గంట తర్వాత జరుగుతుంది అంతే కదా..
భైరవి: అంత పాగల్‌ దానిలా కనిపిస్తున్నానా నీకు.. చిన్నా గాడి పెళ్లి ఆగితే వాడు ఆగం ఆగం చేస్తాడు. వాడి లొల్లి తట్టుకోలేం. అందుకే వాడి పెళ్లి అనుకున్న ముహూర్తానికి జరగాలి. తర్వాత నందిని పెళ్లికి గంట టైం ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి చేసి పెళ్లి ఆపేస్తే ఇక హర్ష గాడు ఏం చేయలేడు. 
నందిని: ఐడియా బాగుంది..
పంతులు: అమ్మా ఇంత పెద్ద అబద్ధం చెప్పలేను.. మహదేవయ్య గారికి నిజం తెలిస్తే నిలువునా నరికేస్తారు.
భైరవి: నామాట వినలేదు అనుకో అడ్డంగా నరికేస్తా. 


విశ్వనాథం: రఘు నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నా ఏమైంది రఘు.
రఘు: టెన్షన్ పడకండి మాస్టారు గుడ్ న్యూస్ చెప్పడానికే నేను కాల్ చేశాను. శీనయ్య భార్య జాడ తెలిసింది. తన భర్తను చంపింది ఆ మహదేవయ్య, రుద్ర అని ఫిర్యాదు చేయడానికి ఒప్పుకుంది. మహదేవయ్యకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాను అంది.
విశ్వనాథం: శుభవార్త చెప్పావ్. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. సత్య పెళ్లికి ఇంకా ఒక్క రోజే టైం ఉంది.
రఘు: తెలుసు మాస్టార్‌ ఆ టైంలో నేను వచ్చేస్తా మీరు మ్యానేజ్ చేయండి.


క్రిష్ తనకు పువ్వు ఇచ్చి ప్రపోజ్‌ చేసిన సీన్ తలచుకొని సత్య ఆలోచిస్తూ ఉంటుంది. ఇష్టం లేని వాడు తన ప్రేమను చెప్తుంటో విన్నావ్ ఎంత దురదృష్టవంతురాలివే నువ్వు అని తనలో తాను అనుకుంటుంది. ఇంతలో సత్య ఫ్యామిలీ వచ్చి ఏమీ చేయలేక నువ్వు చెప్పినట్లు వింటున్నామని అంటారు. ఇంతలో భైరవి వచ్చి పంతులు దగ్గర అందరూ ఉన్నారని రమ్మని చెప్తాడు. ఇక సత్య తనకు ఈ పెళ్లి జరగడం తనకు చాలా ముఖ్యమని అంటుంది. ఇక అందరూ భైరవి పిలిచిన చోటుకు వెళ్తారు. సత్య వాళ్లు మాట్లాడిన మాటలు మీన వింటుంది. తర్వాత తన భర్తకు పక్కకు పిలిచి సత్య పెళ్లి ఆపడం లేదు ఎందుకు అని అంటుంది.


మీన: ఈ పెళ్లి ఆపుతాను అని వెళ్లి దగ్గరుండి చేస్తా అంటున్నావ్. క్రిష్‌లో నీకు అంత ప్రేమికుడు కనిపించాడా..
బాలు: క్రిష్‌లోనే కాదు సత్యలోకూడా.. నువ్వు చెవులతో విని నిర్ణయం తీసుకున్నావ్. నేను కళ్లతో చూసి కన్ఫ్మమ్ చేసుకున్నా. మనిషికి అందం ఉంటే సరిపోదు కాస్త ఓపిక కూడా ఉంటేనే అందానికి అందం. నువ్వు ఏదో విని వచ్చి నన్ను పెళ్లి ఆపమని చెప్పావ్. నీ మాట విని పెళ్లి ఆపేసుంటే ఇద్దరు ప్రేమికుల్ని విడదీసిన పాపం నాకు చుట్టుకునేది. 
మీన: పొరపాటు పడుతున్నావ్.. వాళ్లు ప్రేమికులు కాదు.
బాలు: అవును ప్రేమ గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. నీకో సలహా ఇవ్వమంటావా.. ఈ పెళ్లి ఆపాలి అని పిచ్చి ఆలోచన మానేసి బుద్ధిగా పెళ్లిపనులు చేయ్. 


మహదేవయ్య: బావగారు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి అందర్ని పిలిపించాను ఏమీ అనుకోవద్దు. 
విశ్వనాథం: పర్వాలేదు చెప్పండి.
మహదేవయ్య: ముహూర్తాలు పెట్టడంలో చిన్న పొరపాటు జరిగింది. ఇప్పుడే పంతులు గారు చెప్పారు. తప్పు అంటే పెద్ద తప్పు  కాదు చిన్న అడ్జస్ట్‌మెంట్ అంతే.. అదేంటో చెప్పు పంతులు.
పంతులు: క్రిష్, సత్య జాతకాల ప్రకారం అనుకున్న ముహూర్తం ప్రకారం కుదిరింది. హర్ష, నందినిల పెళ్లికి మాత్రం గంట తర్వాత ముహూర్తం ఉంది.
విశ్వనాథం: అంతే కదా అలాగే కానివ్వండి..
హర్ష: నేను ఒప్పుకోను. తమాషా చేస్తున్నారా అంతా ఫిక్స్ అయ్యాక ఇప్పుడు ముహూర్తం మార్చడమేంటి. 
క్రిష్: బామ్మర్ది పంతులు చెప్తున్నాడు కదా ఏదో ఇబ్బంది ఉందని. 
భైరవి: పొరపాట్లు అనేవి ఎవరికైనా జరుగుతాయి. పంతులుకి కూడా కొంచెం లెక్కలు తప్పాయి. మంచిదే అయింది. పెళ్లికి ముందే చూసుకున్నాడు. గంటనే కదా తేడా.. ఏమంటారు.
రుద్ర: అనడానికి ఏముంది అమ్మ ఎవరైనా మంచి ముహూర్తమే కోరుకుంటారు కదా. 
విశ్వనాథం: మీ ఇష్టం ఏది మంచిది అయితే అదే చేయండి. మీరు ఎలా చెప్తే అలా. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. 
హర్ష: నాకు అభ్యంతరం ఉంది నాన్న. ఎట్టిపరిస్థితుల్లోనూ నా పెళ్లి సత్య పెళ్లి ఒకే ముహూర్తంలో జరగాలి. 
భైరవి: ఎందుకు అంత మొండికి పోతున్నావ్. ముహూర్తం గంటే కదా లేటు. 
హర్ష: మీరు మాట తప్పితే.. నా చెల్లి పెళ్లి తర్వాత మీరు నాకు మీ చెల్లిని ఇవ్వను అని మాట తప్పితే. 
సత్య: అన్నయ్య ఒక్కసారి మాట ఇచ్చాక వెనక్కి ఎందుకు తీసుకుంటారు.
భైరవి: అలా అడుగమ్మా. 
రుద్ర: మా బాపు మాట ఇచ్చాడు అంటే మాటే. తనకి ఇష్టంలేకపోతే ముందే వద్దు అనేవాడు. అయినా మేం కావాలి అనుకుంటే మీ చెల్లిని ఎత్తు కొచ్చి మా చిన్నాతో పెళ్లి చేసేవాళ్లం ఆపే దమ్ము ఉందా నీకు. 
క్రిష్: అండ కొంచెం ఆగు. బామ్మర్ది భయపడే దానిలో కూడా అర్థం ఉంది. కదా మనం ఆలోచించాలి. బామ్మర్ది అనుమానం తీరేలా మేం చేద్దాం. అయితే ఒక పని చేద్దాం ముందు ముహూర్తానికి మీ పెళ్లి చేస్తాం. తర్వాత మా పెళ్లి చేసుకుంటాం ఓకేనా..
భైరవి: దీనికి నేను ఒప్పుకోను. జాతకం ప్రకారమే కదా పంతులు చెప్పింది. ముందు చిన్నోడి పెళ్లి తర్వాతే మీ కొడుకు పెళ్లి. 
విశ్వనాథం: ఏయ్ పంతులు నీకు రెండు నిమిషాలు టైం ఇస్తా.. రెండు పెళ్లిళ్లకు ఒకే ముహూర్తం పెట్టు లేదంటే నీకు నేను ముహూర్తం పెడతా. పెట్టుడు ముహూర్తం అయినా పర్లేదు. ఇక పంతులు రెండు జంటలకు ఒకే ముహూర్తం పెడతాడు. ఇక బాబీ వచ్చి సంగీత్‌కు అంతా రెడీ అయిందని క్రిష్‌ని పిలుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్ మార్చి 12th: గాయత్రీ గురించి నిజం తెలుసుకోవాలని చెవులు పోగొట్టుకున్న తల్లీకొడుకులు.. విశాల్‌కు చిలుక సాయం!