Brahmamudi Telugu Serial Today Episode: కావ్య వాళ్ల బావ భాస్కర్ ఆఫీసుకు వెళ్లడానికి రాజ్ తన కారు ఇవ్వడంతో ఇద్దరూ షాక్ అవుతారు. అదే విషయం బామ్మతో చెబితే వాడు రివర్స్ లో వస్తున్నాడు. వాడికి నేనేంటో చూపిస్తాను అని చెప్పి వెళ్లిపోతుంది. దీంతో కావ్య, భాస్కర్ డల్లుగా కారు దగ్గరకు రాగానే రాజ్ కూడా రెడీ అయ్యి వస్తాడు. రాజ్ ను చూసిన కావ్య, భాస్కర్ హ్యాపీగా ఫీలవుతారు. రాజ్ మీరు ఒక హెల్ప్ చేయాలని అడుగుతాడు. దీంతో రాజ్ మళ్లీ జెలసీగా ఫీలవుతున్నాడనుకుంటారు కావ్య, భాస్కర్. వెంటనే ఎంటో చెప్పు అని అడగ్గానే నేను ఆఫీసుకు వెళ్లాలి.. నాకు మీరు ఆఫీసు దాకా లిఫ్ట్ ఇస్తారా? అని అడగడంతో సరే అంటారు కావ్య, భాస్కర్. రాజ్‌ను భాస్కర్ ముందు సీటులో కూర్చో అని చెప్పగానే నేను మధ్యలో దిగిపోయేవాడిని ముందు సీట్లో కావ్య కూర్చుంటేనే బాగుంటుందని కావ్యను కూర్చోబెడతాడు రాజ్. కారులో వెళ్తుంటే
రాజ్: సరదాగా అలా తిరిగొస్తే రిలీఫ్‌గా ఉంటుంది.
కావ్య: అంటే మీరు మాతోనే వస్తారా?
రాజ్: ఏం మాట్లాడుతున్నావు కళావతి పాపం తమ్ముడన్నయ్యా నేను ఉంటే ఫ్రీగా ఉండలేడు. మీరంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినవారు. ఎన్నో విశేషాలు ఉంటాయి. హ్యాపీగా తిరిగేసి రండి. ఎంటి సైలెంట్‌గా కూర్చున్నారు సాంగ్స్ పెట్టొచ్చు కదా?
అంటూ రాజ్ సాంగ్స్ పెడతాడు. ఎఫ్‌ఎంలో బావకు సంబంధించిన సాంగ్స్ వస్తుంటాయి. రాజ్ డాన్స్ చేస్తాడు. తర్వాత ఒక దగ్గర దిగిపోతాడు. పక్కకు వెళ్లిన రాజ్ నాతోనే పెట్టుకుంటారా? ఇప్పుడు చూడండి మీకు ఉంటుంది అంటూ వెళ్లిపోతాడు. కావ్య జరిగిందంతా బామ్మకు ఫోన్ చేసి చెప్తుంది. దీంతో బామ్మ మీరైతే ఇంటికి రండి అని చెప్పి రాజ్‌కు ఫోన్ చేసి తాతయ్యకు టాబ్లెట్స్ తీసుకురా అని చెప్తుంది. మరోవైపు అప్పు, కళ్యాణ్ కలిసి మాట్లాడుకుంటుంటారు.
కళ్యాణ్: అసలు ఇంటికి కూడా వెళ్లాలనిపించడం లేదు బ్రో పుట్టి పెరిగింది అదే ఇంట్లో అయినా ఏదో పరాయి ఇంట్లోకి వెళ్లినట్టుంది.
అప్పు: నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నావు.
కళ్యాణ్: లేదు బ్రో నువ్వు అక్కడ ఉంటే నా బాధ అర్థం అయ్యుండేది.
అప్పు: ఇప్పుడు నిన్ను ఎవ్వరూ నమ్మడం లేదు అంతే కదా.. నమ్మేలా చెయ్ అప్పుడు అందరూ నీతో మంచిగా ఉంటారు.
కళ్యాణ్: ఇక ఇంట్లో వాళ్లకు బయటి వాళ్లకు ఏంటి తేడా? ఇంట్లో అనామికతోనే పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది.
అంటూ కళ్యాణ్ బాధగా అనామిక గురించి చెప్తుంటాడు. దీంతో నీ భార్య గురించి ఇలా తక్కువ చేసి మాట్లాడం తప్పు అని నువ్వు అనామికకు నచ్చినట్లు ఉండమని లేకపోతే నీ గోల్ సాధించు అని అప్పు చెప్తుంది. మరోవైపు రాజ్ టాబ్లెట్స్ తీసుకుని ఇంటికి రాగానే బామ్మ కావ్య ఎక్కడ అని అడుగుతుంది. వాళ్ల బావతో బయటకు వెళ్లిందని చెప్పగానే బావతో వెళ్లడం ఎంట్రా వెళ్తే నీతో వెళ్లాలి కానీ అంటూ అడుగుతుండగానే భాస్కర్, కావ్య వస్తారు.
మరోవైపు అప్పు, కళ్యాణ్ మాట్లాడుకోవడం దూరం నుంచి అనామిక, ధాన్యలక్ష్మీ చూస్తారు. దీంతో అనామిక కోపంగా అప్పును కళ్యాణ్‌ను తిడుతుంది. మమ్మల్ని ఇద్దరినీ విడదీసి తను మీ ఇంటికి కోడలు కావడానికి ట్రై చేస్తుంది. అని ఇద్దరూ ఇంటికి వెళ్తారు. మరోవైపు రాజ్ పాస్‌పోర్ట్ తీసుకొచ్చి కావ్యకు ఇస్తాడు. నువ్వు మీ బావతో అమెరికా వెళ్లి హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి వెళ్లిపోతాడు. తర్వాత బామ్మ, భాస్కర్ అక్కడి వస్తారు. వాళ్లతో విషయం చెప్పి కావ్య బాధపడుతుంది. దీంతో ఇవళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: సూర్య, జ్యోతిక ఆస్తులు అన్ని కోట్లా? భార్యాభర్తలు బాగానే సంపాదిస్తున్నారుగా!