Trinayani Today March 12th Episode తిలోత్తమ, వల్లభలు హెడ్ సెట్ పెట్టుకొని విశాల్‌ ఎవరితో ఏం మాట్లాడుతాడో వినాలి అనుకుంటాడు. మరోవైపు హాసిని గాయత్రీ పాప కోసం జాగ్రత్తలు చెప్పడానికి విశాల్‌ దగ్గరకు పరుగులు తీస్తుంది. ఇక శివ అనే రామచిలుక నయనితో మాట్లాడుతుంది. చిలుక నయనికి పెన్ను పేపర్‌ తీసుకొని తాను చెప్పినట్లు రాయమని అంటుంది. అందులో ఏమీ చెప్పకు అని పేపర్‌ మీద నయనితో రాయిస్తుంది.


హాసిని: విశాల్ ఇక్కడున్నావా నీ కోసం ఇళ్లంతా వెతుకుతున్నాను.
చిలుక: గోడకు చెవులే కాదు టెక్నాలజీ కూడా ఉంది. వంగి చూస్తే నోరు తెరుస్తారు. 
నయని: రాస్తున్నా కానీ నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు..
చిలుక: అదే నాకు కావాలి.
విశాల్: నేనే నిన్ను కలిసి మా అమ్మ గురించి మాట్లాడుదాం అనుకున్నాను వదిన.
తిలోత్తమ: గాయత్రీ అక్కయ్య గురించి ఆ తిక్క దానితో ఏం మాట్లాడాలి అనుకున్నాడురా.. ఏం మాట్లాడుతున్నారో వింటే కానీ పూర్తిగా అర్థం కాదు..
చిలుక: దాన్ని కాల్చిండి అంతకు ముందు విషయం మార్చండి.. రాశావు కదా ఇప్పుడు అగ్గిపెట్టిను ఆ పేపర్‌లో చుట్టిపెట్టు నయని.. చిలుక ఎగురుకుంటూ దాన్ని తీసుకొని విశాల్‌ దగ్గరకు వెళ్తుంది.
హాసిని: విశాల్ ఇన్నాళ్లు అయిన గాయత్రి అత్తయ్య పునర్జన్మ గురించి ఏమాత్రం టెన్షన్ పడకుండా నువ్వు రిలాక్స్‌గా ఉన్నావ్ కదా..
తిలోత్తమ: కరెక్ట్ ఆ డౌట్ నాకు కూడా ఉంది.
వల్లభ: పెద్దమ్మ గురించి తెలిసే తెలీనట్లు ఉన్నందుకే అంత కూల్‌గా ఉన్నాడు అంటావా మమ్మీ.
తిలోత్తమ: ఏం చెప్తాడో చూద్దాం.. 


చిలుక ఇచ్చిన పేపర్‌ విశాల్ తీసుకొని చదివి షాక్ అవుతాడు. ఆ పేపర్‌ని హాసినికి కూడా చూపిస్తాడు. ఇక చిలుక అక్కడే ఉన్న మైక్‌ను విశాల్‌కు చూపిస్తుంది. కావాలనే విశాల్ టాపిక్ మారుస్తాడు. తనను కన్న తల్లి తనని చూడ్డానికి కూడా రావడం లేదు అని అంటాడు. ఇక హాసిని ఆ మైక్‌కు నిప్పు పెట్టేస్తుంది. అది పేలి తిలోత్తమ, వల్లభల చెవి నుంచి రక్తం వచ్చేస్తుంది. 


విశాల్ ఉదయం గాయత్రీ పాపని ఎత్తుకొని తన తల్లి ఫొటోతో మాట్లాడుతూ సంతోషపడతాడు. మరోవైపు తిలోత్తమ ఊలూచిని ఎత్తుకొని కిందకి వస్తూ విశాల్‌ని చూసి ఆగుతుంది. హాసిని తిలోత్తమను విశాల్‌కు సైగలు చేస్తుంది అది కానీ విశాల్‌ చూసుకోడు. తనకు, పావనామూర్తికి, హాసినికి మాత్రమే నువ్వు ఎవరో తెలుసు అని అంటాడు. ఇంతలో ఆ మాట తిలోత్తమ వినకుండా సౌండ్ చేస్తుంది. అయితే మైక్‌ ఎఫెక్ట్‌కి తిలోత్తమ, వల్లభల చెవులు సరిగా వినిపించవు. ఏమైంది అని అందరూ షాక్ అవుతారు. 


పావనా: ఇద్దరి చెవులు ఒకేసారి పనిచేయడం లేదు అంటే ఏమనుకోవాలి.
విక్రాంత్: గోడకి చెవులు ఉంటాయని ఏ గోడ దగ్గర చెవులు పెట్టారో ఇలా అయింది. 


ఇక చెవిలో మందు వేస్తామని దురంధర, పావనా అందరూ సైగలు చేస్తారు. నయని ఆయిల్ వేడి చేసి తీసుకొచ్చిందని చెవిలో వేస్తే నయం అవుతుంది అని విశాల్ చెప్తే తిలోత్తమ ఒకే అంటుంది. నయని చెవిలో ఆయిల్ వేస్తుంది. తర్వాత వల్లభకు వేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: ఆ డైరెక్టర్‌ నన్ను అలా అడిగే సరికి షాక్ అయ్యా: సీరియల్ నటి చైత్రా రాయ్