Serial Actress Chaitra Rai Comments బుల్లితెరలో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న నటి చైత్రా రాయ్‌. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఈ ముద్దుగుమ్మ.. తక్కువ సమయంలోనే తెలుగు ఇండస్ట్రీలోనూ సక్సెస్‌ అయ్యారు. కన్నడ సీరియల్స్‌తో పాటు స్టార్‌ మా, జెమినీ, జీ తెలుగు, ఈటీవీ.. ఇలా తెలుగులో ప్రధాన ఛానళ్లలో ప్రసారమయ్యే సీరియళ్లలో ఆమె నటించారు. ‘ఒకరికి ఒకరు’, ‘మనసున మనసై’, ‘దటీజ్ మహాలక్ష్మి’‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు’తో తెలుగువారికి మరింత చేరువయ్యారు. అయితే కొన్ని వివాదాలతో కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే ఆమె దూరమయ్యారు. ‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు’ సీరియల్‌లో డ్యూయల్‌ రోల్‌ చేసిన చైత్ర.. ఆ తర్వాత నుంచి పక్కకు తప్పుకున్నారు. తాజాగా ఆమె నటిస్తున్న రాధకు నీవేరా ప్రాణం సీరియల్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 


పర్సనల్‌ కారణాలతోనే సీరియళ్లకు దూరమైనట్లు వార్తలు వచ్చాయి. ఎక్కువగా కుటుంబానికే సమయాన్ని కేటాయిస్తూ వచ్చారు. ప్రెగ్నెంట్‌ కావడంతోనే సీరియళ్లకు దూరమయ్యేరనే ప్రచారం జరిగింది. దీనికి మరింత బలం చేకూరుస్తూ సీమంతం ఫొటోలను అప్పట్లో ఆమె ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. గ్యాప్‌ మాత్రమేనని.. పూర్తిగా సీరియళ్లకు దూరం కాలేదని చెప్పుకొచ్చారు చైత్ర. తాజాగా తన సెకండ్ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌ ‘దేవర’ సినిమాలో నటించినట్లు తెలుస్తోంది. ఆ మూవీలో విలన్‌గా నటిస్తున్న బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్‌కు భార్యగా చైత్ర నటించించినట్లు సమాచారం. ఆమెకు సంబంధించిన షూట్‌ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. తాజాగా చైత్రా రాయ్ ఓ ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


కాంట్రవర్సీతో సీరియళ్లకు దూరమైన చైత్ర.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆమె ‘రాధకు నీవేరా ప్రాణం’ సీరియల్‌లో నిరుపమ్‌ సరసన నటిస్తున్నారు. ఈ సీరియల్‌లో ముందు ఉన్న హీరోయన్‌ను తప్పించి ఈమెకు ఆ ఛాన్స్ ఇచ్చారు. పాత హీరోయిన్‌కు సీరియల్‌లో యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఫేస్ మార్పిడి జరిగి చైత్రను రంగంలోకి దించారు. ఆ విషయాన్ని ఇంటర్యూలో ప్రశ్నించగా చైత్రా తన మనసులో మాట చెప్పారు. 


ఈ  సీరియల్‌  మధ్యలో వచ్చారు కదా.. ఏమనుకున్నారు? ఫస్ట్‌ థాట్‌ ఏంటి? ఆల్‌రెడీ ఒక సీరియల్‌లో చేస్తున్నారు.. మధ్యలో ఎంటరవడం ఎలా అనిపించింది అని యాంకర్ ప్రశ్నించగా.. సీరియల్‌ని తీసుకోవడానికి చాలా ఆలోచించా. మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి? దేవుడు ఇచ్చిన అవకాశం అందిపుచ్చుకోవాలి అని ఓకే చెప్పేశాను అని చైత్ర తెలిపారు. ఇక మీ బీరువాలో ఎన్ని చీరలు ఉన్నాయని ప్రశ్నించగా.. ఓ వెయ్యి వరకు ఉంటాయని చెప్పిన చైత్ర తన యూట్యూబ్ ఛానెలో తన చీరల మీద ఓ వ్లాగ్ చేస్తా అని చెప్పారు. ఇక ఇటీవల దాదాపు 100 చీరలు బయట వాళ్లకు ఇచ్చేశా అని చెప్పారు. ఒకప్పుడు ఎవరి దగ్గరైనా ఓ శారీ నచ్చితే కచ్చితంగా తన దగ్గర ఉండాలి అని అనుకునేవారంట. ప్రస్తుతం తనకు చీరల మీద ఆసక్తి పోయిందని అన్నారు.  


ట్రూత్‌.. ఆర్‌ డేర్‌


సరదాగా ట్రూత్‌ ఆర్ డేర్ ఆడిన చైత్ర ట్రూత్‌ని ఎంచుకొని తన భర్త గురించి ఆసక్తి విషయాలు పంచుకుంది. మీ భర్తను మెప్పించడానికి ఏదైనా చేసి రిగ్రెట్‌ ఫీలైన సందర్భాలున్నాయా? అని అడగా అలా అస్సలు లేదు అని చెప్పారు. ఇక కన్నడకు చెందిన చైత్ర హైదరాబాద్‌ వచ్చాక తెలుగులో ఒక్క ముక్క కూడా వచ్చేది కాదు. చాలా కష్టమయ్యేదని చెప్పారు.  ఏం మాట్లాడినా అర్థమయ్యేది కాదని కేవలం భోజనం అయిందా? చేశారా? తప్ప ఏదీ రివర్స్‌ చెప్పడం వచ్చేది కాదని తెలిపారు. 


ఇక వాళ్ల  అమ్మకి కూడా చెప్పేశా. ఇంక వెళ్లొద్దు.. ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసేద్దాం నావల్ల కాదు అని ఓ సందర్భంలో అన్నారట. చివరకు స్క్రిప్ట్‌ అంతా కన్నడలో రాసుకుని ప్రాక్టీస్‌ చేసేదాన్ని అని చైత్ర తెలిపారు. అక్కడ లైవ్‌లో చెప్పాలి. ప్రాంప్టింగ్‌ అలవాటు లేదు. తెలుగుకు వచ్చి 12 సంవత్సరాలు అయింది. కన్నడ నుంచి ఓ కొత్త వ్యక్తి తెలుగుకు వస్తే.. మేమిద్దం మాట్లాడుతున్నప్పుడు డైరెక్టర్‌ వచ్చి మీది కర్ణాటకనా? తెలుగువారు కాదా? అని ఆశ్చర్యపోయారు. ఆయన అలా అడిగేసరికి నేను షాకయ్యా అని చైత్ర తెలిపింది.


Also Read: అశ్విన్: అశ్విన్ బాబు కొత్త మూవీ టైటిల్ అదుర్స్ - మరో ‘హను మాన్’ అవుతుందా?