Oorvasivo Rakshasivo Today Episode రేష్మ ధీరుకి దుర్గకి పెళ్లి చేయమని పురుషోత్తంతో చెప్తుంది. దీంతో ఏమైందని ధీరు అడిగితే ధీరుకి తమ ఎఫైర్ గురించి తెలిసిపోయిందని పురుషోత్తంకి చెప్తుంది. ధీరు కాల్ చేశాడని మొత్తం చెప్తుంది. ఇక ధీరు తన తండ్రి పురుషోత్తానికి ఫోన్ చేస్తాడు.
ధీరు: డాడ్ ఇక్కడున్నావ్.. డాడ్ నేను దుర్గని లవ్ చేస్తున్నాను ఎట్టిపరిస్థితుల్లో తను నాకు కావాలి. మీరు ఏం చేస్తారో ఎవరితో మాట్లాడుతారో నాకు తెలీదు. దుర్గ ఫ్యామిలీ సైడ్ పెళ్లికి ఎలాంటి ప్రాబ్లమ్ రాకూడదు. అర్థమైందా.. తనకంటే నాకు ఎవరూ ఎక్కువ కాదు గుర్తుపెట్టుకో డాడ్.
పురుషోత్తం: దయాసాగర్‌తో నేను మాట్లాడుతా..
దయాసాగర్: (దుర్గ, తన తండ్రి గుడికి వస్తారు.) ఏమైంది అమ్మా.
దుర్గ: నేను పవిత్ర ప్రతీ శుక్రవారం ఈ గుడికే వచ్చే వాళ్లం నాన్న.
దయాసాగర్: త్వరలోనే మీ ఇద్దరూ మళ్లీ కలిసి వస్తారు.
దుర్గ: అలా రావాలి అంటే పవిత్ర ఆరోగ్యం కుదుటపడాలి నాన్న అలాగే తన జీవితం నాశనం చేసిన వాళ్లందరికీ శిక్ష పడాలి.
దయాసాగర్: అదంతా అమ్మవారు చూసుకుంటారు లే దుర్గ పదమ్మా.
దుర్గ: (విజయేంద్ర చెట్టు దగ్గర ముడుపు కట్టడానికి వస్తాడు.) విజయేంద్ర ఇక్కడికి వచ్చాడేంటి. నా మీద ఏమైనా అనుమానం వచ్చిందా..
విజయేంద్ర: హాయ్ దుర్గా గారు..
దుర్గ: మీరేంటి ఇక్కడ.
విజయేంద్ర: నమ్మకం, ధైర్యం కోసం గుడికి వచ్చా. మీరు ఈ గుడికి వస్తారా.. ఈ అమ్మవారు చాలా మహిమ గలవారు ఈ గుడితో నాకు కొంచెం అటాచ్ మెంట్ ఉంది. గతంలో వైష్ణవి ముడుపు కడతుంది.
దుర్గ: డ్రామాలు ఆడుతున్నాడా.. నా గురించి తెలుసుకున్నాడా..
విజయేంద్ర: వైష్ణవి చెప్పిన మాట గుర్తుంది కానీ, వైష్ణవి లేదు.
దుర్గ: వైష్ణవి చెప్పిన మాట గుర్తింది ఓకే కానీ మీరు యూఎస్‌కి వెళ్లినప్పటి నుంచి తనతో టచ్‌లో ఉన్నారా.. అలా ఉండుంటే తను మీకు బహుశా దూరం కాకపోయేది కాదేమో.
విజయేంద్ర: టైం బ్యాడ్ దుర్గ కొన్ని కారణాల వల్ల తనకు నేను టచ్‌లో లేకుండా పోయాను.
దుర్గ: ఇలా చెప్పడం మీ అబ్బాయిలకు చాలా సింపుల్ కదా..
విజయేంద్ర: పైకి మాట వినడానికి సింపుల్‌గానే ఉండొచ్చు కానీ మనసులో బాధ భరిస్తున్న నాకు మాత్రమే తెలుస్తుంది అది ఎంత కష్టమో.
దుర్గ: మనసులో.. అప్పుడు వైష్ణవికి కావాల్సినప్పుడు దూరంగా ఉండి.. ఇప్పుడు దుర్గ ముందు మంచి వాడిలా నటిస్తున్నావా విజయేంద్ర నాకు ఇప్పుడు నీ మీద నమ్మకం ప్రేమ రెండూ పోయాయి. ఇద్దరూ తమ కోరికలు పేపర్‌లో రాసి ముడుపు కడతారు.
ధీరు: డాడ్ దుర్గ వాళ్ల డాడీకి కాల్ చేశారా ఏమన్నారు.
పురుషోత్తం: లేదు ఇంకా..
ధీరు: వాట్ ఏమైంది డాడ్.. ఇప్పుడే కాల్ చేసి మాట్లాడండి. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి..
పురుషోత్తం: మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి.
దయాసాగర్: నేను గుడిలో ఉన్నాను. ఈ రోజు చాలా బిజీ ఉంది. రేపు కలుద్దామా.
పురుషోత్తం: మీరు ఒక పది నిమిషాలు టైం ఇస్తే మాట్లాడి వెళ్లిపోతాను.
దయాసాగర్: ఓకే..
రక్షిత: ఏం చేస్తున్నారు వీళ్లిద్దరూ.. అదేంటో తెలుసుకోవా
ధీరు: డాడ్ నేను వస్తాను. తల్లీకొడుకుల్ని రక్షిత ఫాలో అవుతుంది.
మరోవైపు దుర్గ, విజయేంద్ర కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. దుర్గ విజయేంద్రని మాత్రమే చూస్తుంది.
దుర్గ: ఆగండి ప్రదక్షిణలు చేస్తున్నంత సేపు అటూ ఇటూ చూస్తున్నారు మీ వాళ్లు ఎవరైనా వస్తున్నారా..
విజయేంద్ర: అది కాదండి ప్రతి శుక్రవారం వైష్ణవికి ఈ గుడికి రావడం అలవాటు తను వచ్చుంటుందేమో అని చిన్న ఆశ.
దుర్గ: సరే మీరు వెతుక్కుంటూ ఉండండి. నేను వెళ్లి దీపం పెట్టి వస్తాను.
వైష్ణవి గురించి విజయేంద్ర పూజారిని అడుగుతాడు. తెలీదు అని పంతులు చూస్తారు. ఇక రెగ్యులర్‌గా వచ్చేవాళ్లని అడగమని అంటారు. నాకు తెలీదు అని విజయేంద్ర చెప్తాడు. అప్పుడు పంతులు దుర్గని చూపించి తను ప్రతీ శుక్రవారం వస్తుంది అని తనని అడగమని అంటాడు. వైష్ణవి ఫొటోని విజయేంద్ర దుర్గకి చూపిస్తాడు. దుర్గ ఆ ఫొటో పట్టుకొని ఎమోషనల్ అవుతుంది. చూడలేదు అని విజయేంద్రకి దుర్గ చెప్తుంది.
విజయేంద్ర: తను ఎక్కడున్నా ఇక్కడికి వస్తుంది అని ఇక్కడికి వస్తే తన గురించి తెలిసే అవకాశం ఉంటుంది అనుకున్నాను. కానీ..
దుర్గ: నిజంగా తను అంటే మీకు అంత ఇష్టమా..
విజయేంద్ర: ఇష్టం కాదు దుర్గ గారు ప్రాణంగా ప్రేమించాను. ఏమైంది ఎందుకు నవ్వుతున్నారు. మీరు నమ్మడం లేదా..
దుర్గ: నిజంగా ప్రేమిస్తే రెండేళ్లగా ఎందుకు కలవరు. మనకు కావాల్సిన వారు ఒక పది రోజులు కనిపించకపోయినా మాట్లాడకపోయినా ఏమైందని ఎంక్వైరీ చేస్తాం కదా. అలాంటిది ప్రాణంగా ప్రేమించాను అంటున్నారు తన కోసం మీరు ఏం ప్రయత్నం చేశారు. తన కోసమే ఇప్పుడే ఇండియా వచ్చాను అన్నారు. అప్పుడెందుకు రాలేదు.
విజయేంద్ర: అప్పుడు నా పరిస్థితి అలాంటిది. వచ్చే అవకాశమే ఉంటే ఎందుకు రాకుండా ఉంటాను.
దుర్గ: మనసులో.. ఎందుకు అంటే నీకు నా కంటే నీ వాళ్లు ఎక్కువ కాబట్టి. నా మీద ప్రేమ లేదు కాబట్టి.
విజయేంద్ర: ఒక్కసారి వైష్ణవి కనిపిస్తే తనకు అర్థమయ్యేలా చెప్తా తను నన్ను అర్థం చేసుకుంటుంది.
దుర్గ: ఓ మీకు ఆ నమ్మకం కూడా ఉందా..
విజయేంద్ర: ప్రేమంటేనే నమ్మకం కదా దుర్గ.
దుర్గ: నిజమే కానీ అన్ని ప్రేమల్లో నిజాయితీ ఉండదు. నిజమైనా ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు.
విజయేంద్ర: నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది త్వరలోనే తనని కలుస్తాను. దుర్గ నీకో విషయం చెప్పాలి. మిమల్ని చూసినప్పుడు మీతో మాట్లాడినప్పుడు సంథింగ్ మీకు చెప్పలేని ఫీలింగ్.
దుర్గ: ఎందుకో..
విజయేంద్ర: తెలీదు.. ఫ్రెండ్స్.. అని చేయి అందిస్తాడు. దుర్గ దండం పెడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.