Oorvasivo Rakshasivo Today Episode ధీరు దుర్గ దగ్గరకు వచ్చి వాళ్ల ఇంట్లో పూజ హోమం ఉన్నాయి రమ్మని చెప్తాడు. ఆ విషయం దుర్గ తన తండ్రితో చెప్తుంది. ఆ కార్యక్రమానికి వెళ్లాలి అనుకుంటున్నాను అని చెప్తుంది. వాళ్లని చూసి నువ్వు నువ్వు ఆందోళన చెందితే మళ్లీ నీ హెల్త్ పాడవుతుంది అవసరమా అని దుర్గ తండ్రి అడుగుతాడు. దీంతో దుర్గ లేదు నాన్న వెళ్లాలి. నేను అక్కడికి వెళ్తే వాళ్ల ప్లాన్స్ కొంచెమైనా తెలుస్తాయి అంటుంది.
విజయేంద్ర: వైష్ణవి స్కెచ్ చూస్తూ.. ఎమోషనల్ అవుతాడు. వైష్ణవి నిన్ను కలిసి నా ప్రేమను చెప్పాలి అనుకున్నాను. కానీ రెండేళ్లుగా దూరంగా ఉండి ఎంత మిస్ అయ్యావో నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో చెప్పాలి అనుకున్నాను.
దుర్గ: విజయేంద్ర ఫొటో చింపేసి.. కంటికి కనిపించని అంత దూరం వెళ్తున్నావు అనుకున్నాను. కానీ నీ ప్రవర్తనతో నా మనసు నుంచి కూడా దూరం అవుతావు అని అనుకోలేదు. నీ పేపర్‌ని అయితే చింపగలిగాను కానీ నా కళ్లనుంచి వచ్చే కన్నీళ్లు నిన్ను ఇంకా గుర్తు చేసి ఇంకా బాధ పెడుతున్నాయి.
విజయేంద్ర: నాకు తెలుసు వైష్ణవి నీకు నేను అంటే ఎంత ఇష్టమో.. నీ మనసులో ప్రేమని నాకు తెలీకుండా నీ గుండెల్లో దాచుకున్నావు.
దుర్గ: నిజమే నిన్ను చాలా ఎక్కువ ప్రేమించాను. కానీ అది అప్పుడు ఇప్పుడు కాదు విజయేంద్ర.
విజయేంద్ర: ప్రేమ ఒక్కసారి పుడితే మనం వద్దు అన్నా పోదు. ఐలవ్‌యూ వైషూ..
దుర్గ: ఐ హేట్ యూ.. ఐ హెట్‌యూ విజయేంద్ర.
విజయేంద్ర: నీకోసం ఎంత సేపు అయినా వెయిట్ చేస్తా వైష్ణవి. నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. నాలో ఉన్న ప్రేమ నిజం అయితే నువ్వు తప్పకుండా నాకు కనిపిస్తావు.
ధీరు: మెసేజ్.. దుర్గ ఎక్కడున్నావ్.. నీ కోసం వెయిట్ చేస్తున్నా..
రక్షిత: ధీరు ఫోన్ పక్కన పెట్టి తొందరగా రా టైం అవుతుంది. ఇక గురువుగారు ధీరుతో హోమం చేయిస్తారు.
పురుషోత్తం: ఏమైంది రక్షిత పదే పదే గుమ్మం వైపు చూస్తున్నావ్.
రక్షిత: విజయేంద్ర వాళ్లని పిలిచాం కదా అందుకే చూస్తున్నా. జయ అక్క ఒక్కర్తే వస్తుంది అంటే వెయిట్ చేయను. కానీ విజయేంద్ర కూడా వస్తున్నాడు అని చూస్తున్నా. విజయేంద్ర వేసే ప్రతి స్టెప్ నేను గమనిస్తూనే ఉన్నాను.
విజయేంద్ర: వైష్ణవి నేను వైట్ కలర్ డ్రెస్ వేసుకుంటున్నా.. నేను ఈ డ్రెస్ వేసుకున్న రోజు సేమ్ డ్రస్ నువ్వు వేసుకున్నావ్. ఇందుకు సాక్ష్యం రెయిన్‌బో.
దుర్గ: మనద్దరం వైట్ డ్రస్ వేసుకున్న ప్రతీ సారి ఇంద్రధనస్సు వస్తుంది అనే విషయం నీకు గుర్తుందా విజయేంద్ర.
విజయేంద్ర: మళ్లీ రెండేళ్ల తర్వాత ఈ డ్రెస్ వేసుకుంటున్నా నువ్వు కనిపించాలి అని కోరుకుంటున్నా వైష్ణవి.
ధీరు: బ్రో.. పెద్దమ్మ బాగున్నారా.. రండి లోపలికి.. మామ్ ఎవరు వచ్చారో చూడు..
రక్షిత: ఎన్నిరోజులు అయిందిరా నిన్ను చూసి..
విజయేంద్ర: ఏమైంది పిన్ని అలా ఉన్నావ్.
రక్షిత: నువ్వు నాతో మాట్లాడకు విజయేంద్ర. ఇండియా వచ్చావ్. మీ అమ్మని కలిశావ్ ఇక్కడ పిన్ని బాబాయ్ ఉన్నారని నీకు గుర్తులేదా.. నీకు రావడం ఇష్టం లేదా.. అక్క వద్దు అన్నారా..
జయ: నేను ఎందుకు చెప్తా రక్షిత..
విజయేంద్ర: సారీ పిన్ని చిన్న పని ఉండి రాలేకపోయా..
పురుషోత్తం: రక్షిత పూజ అయిపోయాక తీరికగా మాట్లాడుకుందాం.
రక్షిత: విజయేంద్ర ఈ సారి మీ అమ్మ నిన్ను వదిలిపెట్టినా నేను వదిలిపెట్టను.
ధీరు: దుర్గ ఇంకా రాలేదు ఏంటి.
దుర్గ: వచ్చేవరకు కూడా బాబు ఆగలేకపోతున్నాడు.
రక్షిత: వీడు ఈ టైంలో కూడా ఎవరితో చాట్ చేస్తున్నాడు. దుర్గతో చాట్ చేస్తున్నాడా..
మరోవైపు విజయేంద్ర కొబ్బరికాయలు కొట్టడానికి బయటకు వెళ్తాడు. అప్పుడే దుర్గ వస్తుంది. దుర్గను విజయేంద్ర చూస్తాడు. దుర్గ కూడా విజయేంద్రని చూస్తుంది. ఇద్దరూ కలిసి గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటారు. దుర్గని విజయేంద్ర గుర్తుపట్టడు. దుర్గ మాత్రం విజయ్‌మీద కోపం బయటకు రాకుండా నటిస్తుంది. కొత్తగా ఒకర్ని ఒకరు పరిచయం చేసుకుంటారు. ఇద్దరూ కలిసి ఇంట్లోకి అడుగుపెడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.