Guppedantha Manasu February 13th Episode: (గుప్పెడంతమనసు ఫిబ్రవరి 13 ఎపిసోడ్)
ఎండీ సీట్ లో శైలేంద్ర కూర్చోవడం పక్కా అని దేవయాని అంటే...అది నెరవేరదు అంటుంది ధరణి. ఎండీ సీట్ నాదే అంటూ మీరు చెప్పే మాట విని బోర్ కొడుతోంది..అది జరిగితే ఎప్పుడో జరిగేదంటుంది.
శైలేంద్ర: వసుధారను ఎవరూ కాపాడలేరు ఆమెకు పెద్ద మొత్తం డబ్బు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రారు
ధరణి: గతంలో ఓసారి ఎంఎస్ఆర్ దగ్గర మీరు అప్పు తీసుకున్నట్లు నాటకం ఆడి కాలేజ్ లాక్కుందాం అనుకున్నారు కదా... కానీ ఆ సమయంలో మురుగన్ వచ్చి ఆ సీట్ మీకు దక్కకుండా చేశాడు. ఇప్పుడు కూడా అలానే ఎవరో ఒకరు వస్తారేమో
శైలేంద్ర: అలా ఏం జరగదు ధరమి...అప్పుడు రిషి బతికిఉన్నాడు కాబట్టి డబ్బు పంపించి కాలేజీని కాపాడాడు. ఇప్పుడు రిషి పైలోకంలో ఉన్నాడు కాబట్టి ఏం చేయలేడు. కొంపతీసి రిషి పైలోకం నుంచి ఊడిపడి ఎండీ సీట్ దక్కకుండా చేస్తాడా ఏంటి
ధరణి: ఏమైనా జరగొచ్చు...మీరు మాత్రం ఆ సీట్లో కూర్చోలేరు..చెప్తున్నా కదా రేపు మీకు బ్యాడ్ డే...
శైలేంద్ర: నో ధరణి..నువ్వు చెప్పింది రాంగ్..నాకు గుడ్ డే...ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సింహాసనాన్ని రేపు అధిష్టించబోతున్నా రేపు వసుధార గద్దె దిగడం..ఆ ప్లేస్ లో నేను కూర్చోవడం ఖాయం
ధరణి: మీరు ఎన్నైనా చెప్పండి కానీ ఎండీ సీట్ సొంతం చేసుకోలేరు
శైలేంద్ర: నువ్వు చెప్పిందే నిజమైతే నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను. అవసరమైతే నీ కాళ్లు నొక్కమన్నా నొక్కుతాను. నువ్వు బానిసలా ఉండమంటే అలాగే ఉంటాను. నీ బదులు నేను ఇంటి పనులు చేస్తాను. కుక్కలా నీ దగ్గర పడి ఉంటాను
దేవయాని వారిస్తున్నా శపథం చేస్తాడు..
ధరణి మాటలతో దేవయాని టెన్షన్ పడుతుంది. ఎండీ సీట్ మరోసారి ఎక్కడ తమకు దూరం అవుతుందోనని కంగారు పడుతుంది. భయపడాల్సిన అవసరం లేదని, తాను ప్లాన్‌ను పక్కగా అమలుచేశానని భరోసా ఇస్తాడు శైలేంద్ర
Also Read: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: తట్టా బుట్టా సర్దుకున్న మహేంద్ర – వసుధారకు హ్యాండిచ్చిన ఫ్రెండ్స్
మహేంద్ర-అనుపమ
జరగబోయే పరిణామాల గురించి మహేంద్ర తీవ్రంగా ఆలోచిస్తుంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన అనుపమ..ఊరికి దూరంగా వెళ్లిపోవాలనే నిర్ణయం కరెక్ట్ కాదని వసుధార చెప్పిన మాటలను సమర్థిస్తుంది. కాలేజీ వదిలి పారిపోతే స్టూడెంట్స్ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని అంటుంది.
మహేంద్ర: కాలేజీ గురించో, వసుధార బాధల గురించి తాను పట్టించుకోవడం లేదని, వసుధార జీవితం గురించి భయపడుతున్నాను. ఇక్కడే ఉంటే వసుధార ఏమైపోతుందో తెలియడం లేదు. ఎన్ని సాక్ష్యాలు చూపించినా ఎంత చెప్పిన రిషి బతికే ఉన్నాడని వసుధార వాదిస్తోంది
అనుపమ: రిషిని వసుధార ఎంతగానో ప్రేమించింది. ఇష్టపడింది. ఇద్దరు పెళ్లిచేసుకుని జీవితం గురించి ఎన్నో కలలు కని ఉంటారు. ఇప్పుడు అవన్నీ ఆవిరైపోతున్నాయంటే వసుధార ఆ విషయాన్ని ఎలా జీర్ణించుకుంటుంది. రిషి లేడనే వాస్తవాన్ని ఎలా అంగీకరిస్తుంది
మహేంద్ర: నువ్వే ఏదో ఒకటి చేసి వసుధారను రియాలిటీలోకి తీసుకురావాలి
వారి మాటలు విన్న వసుధార ఫైర్ అవుతుంది...
వసుధార: నేను వాస్తవంలోనే బతుకుతున్నాను. రిషి చనిపోయాడని మీరు అంటున్న మాటలు నా మనసును చాలా బాధపెడుతున్నాయని ఎమోషనల్ అవుతుంది.
అనుపమ: నిన్ను ఇబ్బంది పెట్టాలని మేం అనుకోవడం లేదు మామూలు మనిషిని చేయాలనే ప్రయత్నిస్తున్నాం
వసుధార: నేనేం పిచ్చిదానిని కాదు. మీరు దొరికిన సాక్ష్యాలు నమ్మి రిషి చనిపోయాడని అంటున్నారు. నేను నా మనఃసాక్షిని నమ్మి రిషి బతికే ఉన్నాడని అంటున్నాను. నేను ప్రాణాలతో ఉన్నానంటే రిషి కూడా ఎక్కడో ఒకచోట బతికే ఉన్నారు. నేను ఊపిరి పీల్చుకుంటున్నానంటే రిషి కూడా ఎక్కడో క్షేమంగా ఉన్నారని అర్థం. అదే నా నమ్మకం . సర్ ఎక్కడున్నాడో త్వరలో తెలుసుకుంటాను. నా నమ్మకమే నిజమని మీ అందరికి నిరూపిస్తాను
Also Read: ఫిబ్రవరి 14 వసంతపంచమి - శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి!
రాజీవ్‌కు శైలేంద్ర ఫోన్
శైలేంద్ర: నేను ఎండీ కావాలనే కల తీరబోతోంది..
రాజీవ్: ఏం చేశావ్
శైలేంద్ర: రిషి గాడు డబ్బుల కోసం కాలేజీని తాకట్టుపెట్టినట్టు క్రియేట్ చేశాను...రేపటితోనే కాలేజీలో వసుధారకి చివరి రోజు. నువ్వే లోపలకు వచ్చి వసుధారని తీసుకెళ్తావో, ఆమె బయటకు వచ్చాక తీసుకెళ్తావో నీ ఇష్టం..
రాజీవ్: నా డార్లింగ్ ని కాలేజీ లోపలకు వచ్చి తీసుకెళ్తాను... మొన్నొకడు వసుధారని కాపాడాడని చెప్పాను కదా వాడే మళ్లీ వచ్చే ప్రమాదం ఉందేమో...
శైలేంద్ర: వాడొచ్చినా ఏం చేయలేడు..నువ్వు హ్యాపీగా ఉండు...
రాజీవ్: నా కండిషన్ నీకు గుర్తుంది కదా..ఎండీ సీట్ కోసం నువ్వే ఏ ప్లాన్ వేసుకో కానీ వసుధారకు ఎలాంటి ప్రమాదం తలపెట్టిన ఊరుకోను. అదే జరిగితే ఎదురుగా ఉన్నది ఎవరనేది కూడా చూడను
శైలేంద్ర: ఎండీ సీట్ నా సొంతమైన తర్వాత వసుధారతో పనిలేదు.
కానీ వసుధారను కాపాడిన వ్యక్తి కాలేజీకి ఎక్కడ వస్తాడోనని రాజీవ్ భయపడుతూనే ఉంటాడు...
Also Read: ఈ రాశులవారికి ఆలోచనల్లో కుదురుండదు, ఫిబ్రవరి 13 రాశిఫలాలు
అనుపమ
వసుధార మాటలు గుర్తుచేసుకుని అనుపమ ఆలోచనలో పడుతుంది. కాలేజీలో సమస్య నుంచి ఎలా గట్టెక్కాలో తెలియక అనుపమ కూడా సతమతమవుతుంది. పెద్దమ్మకు ఫోన్ చేసి ఏం చేయాలో తెలియడం లేదని బాధపడుతుంది. రిషి మరణం - వసుధార ప్రవర్తన గురించి చెబుతుంది. ఈ బాధలో ఉండగా కాలేజీకి మరో సమస్య ఎదురైందంటూ అసలు విషయం చెప్తుంది. అనుపమ మాటలు విన్న పెద్దమ్మ.. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. ఏం చేయాలి, ఎలా చేయాలన్నది బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని ధైర్యం చెబుతుంది
రిషిపై ప్రేమతో
రిషి జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంటుంది వసుధార. రిషికి ప్రాణమైన కాలేజీని శైలేంద్రకు దక్కకుండా కాపాడాలని అనుకుంటుంది. అందుకు మీ అండ నాకు కావాలని రిషి బ్రేస్‌లెట్‌ను తన చేతికి తొడుక్కుంటుంది వసుధార. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.