Krishna Mukunda Murari Today Episode మురారి డెకరేషన్ వాళ్లతో మాట్లాడుతూ ఉంటే అక్కడికి వచ్చిన ముకుంద భవిష్యత్‌లో ఏం జరుగుతుందో ఏమో అని ఒక ఫొటో తీసుకోవాలి అని మురారికి తెలీకుండా తన సెల్ఫీ తీసుకుంటున్నట్లు మురారి కూడా కనిపించినట్లు ఫొటో తీసుకుంటుంది. మరోవైపు ఆదర్శ్ ముకుంద, మురారి ఉన్న ఫొటోని చూసేస్తాడు. విరిద్దరి ఫొటో ఇక్కడ ఉందేంటి అనుకుంటాడు. ఇక డెకరేషన్‌కి వచ్చిన వ్యక్తి చేతిలో కవర్లు ముకుంద చూస్తుంది.
ముకుంద: ఇవన్నీ ఎవరు ఇచ్చారు.
మురారి: ఆదర్శ్ ఇచ్చాడు. మీ రూంలో పాత కబోర్డ్‌లో ఉన్నాయని నేనే చెప్పాను.
ముకుంద: మనసులో.. అయ్యో ఆ ఫొటో చూసేసి ఉంటారా.. అంటూ పరుగులు తీస్తుంది.
ఆదర్శ్: మురారి, ఆదర్శ్ కలిసి ఉన్న ఫొటోలో ఆదర్శ్‌ని మడతపెట్టి ఉంటుంది. ఈ ఫొటోలో నేనున్న పార్ట్ మాత్రమే ఎందుకు మడతపెట్టి ఉంది. అంటూ గతంలో పెళ్లి రోజే ముకుంద మురారితో మాట్లాడిన మాటలు తలచుకుంటాడు. మళ్లీ ఆ ఫొటోలు అక్కడే పెట్టేస్తాడు. మరో వైపు ముకుంద పరుగున అక్కడికి వచ్చి ఫొటోలు చూసుకుంటుంది.
ముకుంద: హమ్మయ్య ఎక్కడికి అక్కడే ఉన్నాయి. అంటే ఆయన చూడలేదు. ఆయన కంట పడకుండా జాగ్రత్త పడాలి.
ఆదర్శ్: ముకుంద ఇంకా మురారి గురించే ఆలోచిస్తూ ఉందా లేదంటే నేను బ్రమపడుతున్నానా.. మురారి, ముకుందల ఫొటో అంటే పాతది కబోర్డ్‌లో మరిచిపోయింది అయిండొచ్చు. కానీ నేను మురారి ఉన్న ఫొటోలో నాది మాత్రమే ఎందుకు మడత పెడుతుంది. కావాలనే చేసిందా. లేదంటే అనుకోకుండా మడత పడిందా..
మురారి: ఎలా ఉన్నాయ్ అరేంజ్‌మెంట్స్..
కృష్ణ: అదిరిపోయాయి ఏసీపీ సార్.. చాలా హ్యాపీగా ఉంది ఏసీపీ సార్ ఈ ప్రోగ్రాంతో మనం అనుకున్నవన్నీ జరగబోతున్నాయి. పెద్దత్తయ్యకి ముకుంద మీద అనుమానం పోతుంది.
మురారి: తర్వాత మన శోభనం ముహూర్తం పెట్టేస్తారు అంతేకదా..
కృష్ణ: అబ్బా ఏం మాట్లాడినా చివరికి అక్కడికే వస్తారు కదా..
ఇక మురారి హార్ట్ సింబల్ బెలూన్, గులాబి పువ్వు పట్టుకొని కృష్ణకి ప్రపోజ్ చేస్తాడు. కృష్ణ చాలా హ్యాపీగా ఫీలవుతాడు. మరోవైపు ముకుంద ఆ సీన్ చూసి అది నేను ఉండాల్సిన చోటు కదా అని అనుకుంటుంది. అంతలోనే తన ఆలోచనలు మారకూడదు అని కృష్ణ, మురారిలు సంతోషంగా ఉండాలి అని అనుకుంటుంది. ఇక మధు వచ్చి ఫొటోలు తీస్తాను అంటూ ఫోజులు ఇమ్మని చెప్తాడు.
మధు: అబ్బబ్బబా.. అసలైన వాలంటైన్స్ డే కపుల్‌లా ఉన్నాయి.
ముకుంద: కరెక్ట్‌గా చెప్పావు మధు.. డిఫరెంట్ యాంగిల్లో ఫొటోలు తీయ్ ఫ్రేమ్ కట్టి హాల్‌లో పెడదాం.
కృష్ణ: పో ముకుంద.. నువ్వు కూడా ఏంటి.
నందూ: అంత సిగ్గు అయితే ఇలాంటి ప్రపోజల్స్ పబ్లిక్‌లో పెట్టుకోకూడదు. ఎవరైనా చూస్తున్నారా లేదా చూసుకోవాలి.
కృష్ణ: ఒప్పుకోండి ఏసీపీ సార్ మనం దొరికిపోయాం. కాకపోతే దొరకని దొంగలు ఇక్కడ చాలానే ఉన్నారు. ముకుందకి ఆదర్శ్ మీద ప్రేమలేదా.. ఆదర్శ్‌కి కూడా తనకి ఇలాగే ప్రపోజ్ చేయాలి అని కోరిక ఉండదా..
ముకుంద: మళ్లీ నన్ను ఇరికిస్తోంది ఏంటి.
కృష్ణ: ముకుంద వెళ్లి ఆదర్శ్‌ని పిలుచుకురా.. మీరు ఇలా ప్రపోజ్ చేసుకుంటే మేం ఫొటోలు తీస్తాం.
ముకుంద: వద్దు కృష్ణ ఇప్పుడు అవన్నీ ఎందుకు.
నందూ: ఎందుకు అంటావ్ ఏంటి.
మధు: ఇష్టం లేదు కనుక.
కృష్ణ: మధు తప్పుగా మాట్లాడకు. ఫొటో వద్దు అంటే ఆదర్శ్ అంటే ఇష్టం లేనట్టేనా..
మధు: ఆదర్శ్ అంటే ఇష్టం లేదు అని నేను ఎప్పుడు అన్నాను. కొంతమందికి అలా ఫొటోలు తీసుకోవడం ఇష్టం ఉండదు కదా ముకుందకు కూడా అంతేనేమో అని.. కానీ నువ్వు అన్నట్లే నీకు ముకుంద మీద ఎక్కడో అనుమానం ఉన్నట్లు ఉంది.
ముకుంద: మనసులో.. అయ్యో ఉన్న అనుమానాలు ఎలా పొగొట్టాలా అని నేను ఆలోచిస్తుంటే లేని అనుమానం పుట్టించేలా ఉన్నాడే..) ఇప్పుడేంటి.. నేను ఆదర్శ్‌తో కలిసి ఫొటోలు దిగాలి అంతే కదా ఇప్పుడే పిలుస్తాను ఉండు ఎన్ని ఫొటోలు కావాలి అంటే అన్ని ఫొటోలు ఏ పొజిషన్‌లో కావాలి అంటే అలా తీసుకో..
మురారి: అది అలా ఉండాలి. అయినా మా సంగతి కాసేపు పక్కన పెట్టి నీ సంగతి ఏంటో చెప్పు. ఈరోజు అయినా అలేఖ్య వస్తుందా రాదా..
కృష్ణ: మధు ఆదర్శ్‌ని పిలుచురా..
మధు: వెళ్లడం ఎందుకు ఫోన్ చేస్తా.. మనసులో.. ముకుంద సంగతి తెలిసి ఎక్కడికైనా వెళ్లిపోయాడా ఏంటి..
ముకుంద: ఎక్కడున్నారు ఆదర్శ్ ఎప్పుడెప్పుడు నా దగ్గరకు రావాలి అని చూసే మనిషి ఈ అవకాశాన్ని వాడుకోవడానికి అందరి కంటే ముందు ఉండాలి కదా ఇంకా రాలేదా.. ఆఫొటో చూశారా నామీద అనుమానం ఏమైనా వచ్చిందా..
మధు: ఇంట్లో అంత సందడి జరుగుతుంటే బ్రో ఒక్కడే ఇక్కడేం చేస్తున్నాడు. ముకుంద మీద నిజంగానే అంత ప్రేమ ఉంటే మురారి కృష్ణని అంటిపెట్టుకొని తిరిగినట్లు ఆదర్శ్ కూడా ముకుంద వెనుకే తిరగాలి కదా.. ఫోన్‌కి కూడా రెస్పాన్స్ లేదు మళ్లీ ట్రై చేద్దాం. రింగ్ అవుతున్నా తీయనంత పరధ్యానంలో ఏం ఆలోచిస్తున్నాడు. కొంపతీసి ముకుంద మీద నాకు వచ్చిన అనుమానమే బ్రోకి కూడా వచ్చిందా అదే నిజం అయితే ఆదర్శ్‌ని ఇక్కడికి తీసుకొచ్చి పెద్ద పొరపాటు చేసుకున్నట్లు అవుతుందా.. ఏం ఆలోచిస్తున్నావ్ బ్రో అంత మంది అక్కడ ఉంటే నువ్వు ఒంటరిగా ఇక్కడ ఉన్నావ్ అంటే ఏదో తేడా కొట్టింది.
ఆదర్శ్: ఏం లేదు అన్నాను కదా మధు.
మధు: ఉంది ఏదో ఉంది. ముకుంద మారింది అని కశ్మీర్ నుంచి నువ్వు తిరిగి వచ్చేశావ్ కదా.. ముకుందతో నువ్వు హ్యాపీగానే ఉన్నావా.. ఉంటే ఈ టైంలో తన దగ్గర ఉండాల్సింది పోయి ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావ్. చెప్పు బ్రో.
ఆదర్శ్: ఏయ్ చెప్పు చెప్పు అని చిరాకు పెడితే చావగొడతాను చెప్తున్నా.. నాకు ఏ ప్రాబ్లమ్ లేదు. ఇంకా ప్రోగ్రాం స్టార్ట్ అవడానికి టైం ఉంది పిలిస్తే వద్దామని ఇక్కడే ఏదో ఆలోచిస్తూ ఉండిపోయా అంతే.
మధు: నువ్వు ఏదో దాస్తున్నావ్ బ్రో. బయట పెట్టిస్తా అందరి మనసులో ఉన్నవి ఒక్కొక్కటీ బయట పెట్టిస్తా.. సరే సరే రా బ్రో.
కృష్ణ: ఆదర్శ్ ఎక్కడికి వెళ్లిపోయావ్..
మధు: ఆదర్శ్ బ్రో వేరే లోకంలో ఉన్నాడులే..
కృష్ణ: వేరే లోకం అంటే కొంప తీసి ఉదయమే మొదలు పెట్టేశారా..
ఆదర్శ్: మొదలు పెడదామనే అనుకున్నా కానీ కొన్ని పరిస్థితుల్ని ఫేస్ చేయాలి అంటే ధైర్యం కావాలి కదా..
ముకుంద: మనసులో.. ఈయన ఫొటో చూసేశారా ఇన్‌డైరెక్ట్‌గా వాటి గురించే మాట్లాడుతున్నారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: మృణాల్ ఠాకూర్: వైఫై వీక్‌గా ఉంటే వైబ్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయంటున్న మృణాల్ ఠాకూర్