Mrunal Thakur : వైఫై వీక్‌గా ఉంటే వైబ్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయంటున్న మృణాల్ ఠాకూర్
వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటున్న మృణాల్ ప్రస్తుతం ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తుంది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసి వైఫై వీక్‌గా ఉంటే వైబ్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయని చెప్పింది. (Images Source : Instagram/mrunalthakur)
తెలుగు సినిమా సీతారామంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది మృణాల్ ఠాకూర్. స్టోరీ, సాంగ్స్, మృణాల్, దుల్కర్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా మారిపోయారు. (Images Source : Instagram/mrunalthakur)
సీతారామంకు ముందు హిందీలో పలు సీరియల్స్‌లో, చిత్రాల్లో నటించింది. కానీ ఆమె పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ, సీతారామం సినిమా ఆమెను ఓవర్‌నైట్ స్టార్‌డమ్‌ని తెచ్చిపెట్టింది. (Images Source : Instagram/mrunalthakur)
'హాయ్ నాన్న' సినిమాతోనూ ఫ్యామిలీ ఆడియన్స్ ఫేవరేట్ అయిపోయింది. యశ్నాగా తన పాత్రల్లో ఇమిడిపోయి, తెలుగింటి అమ్మాయిగా అందరి మనసుల్లో నిలిచిపోయింది.(Images Source : Instagram/mrunalthakur)
ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్‌లో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఆమె లుక్, ఫస్ట్ సింగిల్‌కి మంచి క్రేజ్ అందుకుంది.(Images Source : Instagram/mrunalthakur)
కల్కి సినిమాలో ప్రభాస్ సరసన ఆమె నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో రాబోయే ఏఆర్ మురుగుదాస్-శివకార్తికేయన్ అప్‌కమ్మింగ్ ప్రాజెక్ట్‌కు ఆమె సెలెక్ట్ అయినట్టు తెలుస్తోంది. (Images Source : Instagram/mrunalthakur)