Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున దీపావళి వేడుకతో పాటు దేవా నిర్దోషిగా ఇంటిక వస్తుండటంతో మిథున ఇళ్లంతా దీపాలు వెలిగించేస్తుంది. ప్రమోదిని మిథునని చూసి దేవా వస్తుండటంతో వెలుగు మొత్తం నీ కళ్లలోనే ఉందని అంటుంది. కాంతం వచ్చి మహానటి అని పాటలు పాడుతుంది. ఈ యువరాణి గారే దేవాని జైలుకి పంపాలని చూసి ఇప్పుడు దీపావళి వెలుగు అంటూ దీపాలు వెలిగిస్తుందని అంటుంది. నీకేం తెలీదు నువ్వు నోరుమూసుకో కాంతం అని ప్రమోదిని అంటుంది.
మిథున ప్రమోదినితో నిన్నటి నుంచి సీరియస్‌గా ఉన్నాం కదా తన కామెడీతో అందర్ని నవ్వించని అంటుంది. ఇంతలో దేవాని తీసుకొని సత్యమూర్తి, శారద వస్తారు. మిథున సంతోషంతో హారతి తీసుకొని వస్తుంది. మిథున హారతి ఇస్తుంటే శారద ఆపుతుంది. నీకు కోర్టు దగ్గరే చెప్పాను నీ ముఖం నాకు కనిపించడానికి వీళ్లేదు.. నువ్వు నా గుమ్మం తొక్కడానికి వీళ్లేదు అని అలాంటిది ఏ ముఖం పెట్టుకొని నా కొడుకుకి దిష్టితీస్తావ్ అని అడుగుతుంది. మిథున వాళ్ల నాన్నే దేవాని బయటకు తీసుకొచ్చారు ఇప్పుడు ఈ మాటలు ఎందుకు అని అడుగుతారు.
శారద మిథున మీద ఫైర్ అవుతుంది. నా ఇంట్లో ఉంటూ నా కొడుకునే జైలు పాలు చేయాలి అని చూస్తావా.. నా భర్త మాటని కాదని నిన్ను ఇంట్లోకి తీసుకొచ్చినందుకు గొప్ప గుణ పాఠం నేర్పావు.. నా కొడుకు మీద పగ తీర్చుకోవడానికి నువ్వు వచ్చావన్న నీ నిజస్వరూపం నాకు అర్థమైంది. ఇంకొక్క క్షణం నువ్వు ఇక్కడ ఉండటానికి వీళ్లేదు.. నేను మెడ పట్టుకొని గెంటేయకముందే నువ్వే వెళ్లిపో అని అంటుంది. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు.. ఛీ పో వెళ్లిపో అని చెప్తుంటే సిగ్గు లేకుండా ఇక్కడే ఉంటావా బయల్దేరు తల్లీ అని కాంతం అంటుంది. శారద కూడా వెళ్లి అని తిడుతుంది.
శారద మిథున చేయి పట్టుకొని బయటకు లాక్కెళ్తుంటే ప్రమోదిని ఆపుతుంది. మిథునకు తన భర్త మీద ఉన్న ప్రేమని శంకించే అర్హత మనకు లేదు అత్తయ్య.. దేవా మీద తను పగ పట్టింది అనడం జైలు పాలు చేయాలి అనుకుంది అనడం చాలా పాపం అత్తయ్య.. తన భర్త ప్రాణాలతో ఉండాలి.. తను పసుపుకుంకుమలతో ఉండాలి అనే ఇలా చేసిందని మిథున గతంలో ప్రమోదినికి చెప్పిన మాటలు చెప్తుంది. తన భర్తకి తను ఎప్పటికి ద్రోహం చేయదు అని మనం తెలుసుకోవాలి అని అంటుంది.
శారద మిథున దగ్గరకు వెళ్లి మిథునా అని హగ్ చేసుకొని ఏడుస్తుంది. మిథున నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో తెలిసి కూడా బాధలో నిన్ను అపార్థం చేసుకున్నా క్షమించు అని అంటుంది. అమ్మ ఎప్పటికీ క్షమాపణ అడగకూడదు అని మిథున అంటుంది. మిథునని శారద ముద్దాడుతుంది. దేవాకి హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్లమని అంటుంది. మిథున దేవాకి హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్తుంది.
హరివర్ధన్ కేసుని ఎంక్వైరీ చేస్తున్నాడని రణధీర్ తప్పు చేశాడని తెలిస్తే ప్రమాదని పీఏ దేవుడమ్మతో చెప్తాడు. హరివర్ధన్‌కి ఎంతో కొంత నిజం తెలుసుంటుంది అందుకే దేవాని సపోర్ట్ చేశాడని అందుకే హరివర్ధన్‌ని చంపేయాలని దేవుడమ్మ అంటుంది. పీఏ షాక్ అయిపోతాడు. దేవుడమ్మ రౌడీలతో చెప్పి హరివర్ధన్‌ని ఎత్తుకొచ్చేయమని అంటుంది.
దేవా ప్రమోదిని చెప్పిన మాటలు తలచుకొని బాధ పడతాడు. నేను తనని ఎంత ద్వేషిస్తే అంత ప్రేమిస్తుంది. మిథున తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం తనని ఎలా పంపేయాలి అనుకుంటాడు. ఇంతలో మిథున స్నానం చేసి వస్తుంది. తల తుడుచుకుంటే దేవా చూస్తూ ఉంటాడు. దేవా మిథున నడుము చూసి చాలా డిస్ట్రబ్ అవుతాడు. మిథున చూసి ఇక్కడి రాకపోయావా.. పోనీ నన్ను అక్కడికి రమ్మంటావా.. దూరం నుంచి చూడటానికి ఇబ్బంది పడుతున్నావ్ కదా.. చూసి చూసి మెడ పట్టేస్తుందేమో అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ అని దేవా కవర్ చేస్తాడు. మొదటి సారి నన్ను నీ భార్యగా చూశావ్.. మొదటి సారి ఓ భర్త తన భార్యని ఎలా చూడాలో అలా చూశావ్ త్వరలోనే నీలో మార్పు వచ్చేస్తుంది. నీలో భర్త మెల్లగా బయటకు వచ్చేస్తున్నాడు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.