Nuvvunte Naa Jathaga Serial Today March 5th: నువ్వుంటే నా జతగా సీరియల్: సిద్ధాంతం సావిత్రీదేవి గారి బంగారు గాజులు కొట్టేసిన దేవా.. ఇంట్లో టెన్షన్‌ టెన్షన్!

Nuvvunte Naa Jathaga Today Episode దివ్య తల్లి ఆపరేషన్ కోసం దేవా మిధున గాజులు తీసుకోవడం ఇంట్లో మిధున గాజులు పోయావని అందరూ టెన్షన్ పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

Nuvvunte Naa Jathaga Serial Today Episode ప్రమోదినితో ఆమె భర్త ఇన్నాళ్లు నా భార్య ఒట్టి అమాయకురాలు, భయస్తురాలు అనుకున్నా కానీ తనలో ఓ దొంగ ఉందని ఈ రోజే అర్థమైందని అంటాడు. అదేంటంటి  అంత మాట అనేశారు అని ప్రమోదిని అడుగుతుంది. ప్రమోదిని, తన భర్త మాట్లాడుకోవడం అటుగా వెళ్తున్న మిధున వింటుంది.

Continues below advertisement

ఆనంద్: దొంగ చాటుగా మిధునకు సాయం చేస్తున్నావ్. బస్తీ వాళ్లకి మిధున కూడా సాయం చేసింది అని చెప్పింది ఎవరు బంగారు.
ప్రమోదిని: అయ్యో నేను వాళ్లకి చెప్పాను అని మీకు ఎవరు చెప్పారు.
ఆనంద్: ఇప్పుడు నువ్వే చెప్పావు కదా.
ప్రమోదిని: అయ్యో మీరు ఎప్పుడు  అన్నట్లు నేను వెర్రి మాలోకేమే అండీ నాకు అబద్ధం చెప్పి తప్పించుకోవడం కూడా రాదు. పాపం అండీ ఆ మిధునని చూస్తే బాధగా ఉంది. అయిన వాళ్లని కన్నవాళ్లని అందరినీ వదిలేసి తాళికి విలువ ఇచ్చి దేవా కోసం ఇక్కడే ఉంటుంది. ఆ అమ్మాయి బాధ ఎవరూ పట్టించుకోవడం లేదు. దేవా కోపంతో మిధునకు ఏం చేస్తాడో అని భయం వేసింది. అందుకే బస్తీ వాళ్లతో అలా చెప్పాను. ఇప్పుడు దేవా మిధునని ఎట్టి పరిస్థితిలో ఇంటి నుంచి పంపలేడు. మిధున కంట తడి పెట్టుకునే పరిస్థితి రాకూడదని ఇలా చేశాను. 
ఆనంద్: నువ్వు చేసిన పని నాన్న చూసుంటే నీ పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించావా.
ప్రమోదిని: అప్పుడు మామయ్య గారు నన్ను ఇంట్లో నుంచి పంపేసేవాళ్లు.
ఆనంద్: ఇప్పుడు అర్థమైంది కదా అబద్ధం అయినా భయంతో టక్కున చెప్పేయకూడదు. ఇలాంటివి ఏమైనా చేసేముందు కనీసం నాకు అయినా చెప్పు. అర్థమైందా.
మిధున: ప్రమోదినిని హగ్ చేసుకొని అక్క నా బాధని నువ్వు అర్థం చేసుకున్నావ్. నా జీవితం కోసం నేను పడుతున్న బాధలు ఒక అక్కలా నువ్వు అర్థం చేసుకున్నావ్. నమ్మకం వచ్చేసింది అక్క నీలాగే అందరూ త్వరలోనన్ను అర్థం చేసుకుంటారని నమ్మకం వచ్చేసింది అక్క.

దేవా మిధున ఇద్దరూ ఒకేసారి స్నానం చేయడానికి బయల్దేరుతారు. ఒకరికి ఒకరు ఎదరువుతారు. దేవాతో మిధున భర్తగారికి గౌరవించాలి కాబట్టి దారి ఇస్తున్నా వెళ్లండి అంటుంది. దానికి దేవా హలో సిద్ధాంతం సావిత్రీ దేవి గారు మామూలుగా అయితే నేను దారిఇచ్చేదాన్ని కానీ నువ్వు భర్త భార్య అని నాకు దారి ఇచ్చావు కాబట్టి నేను హర్ట్ అయి నేనే నీకు దారి ఇస్తున్నా వెళ్లిపో అంటాడు. మిధున వెళ్లి తన చేతికున్న బంగారు గాజులు తీసి కబోర్డ్‌లో పెడుతుంది. అది చూసిన దేవా పనిలో పనిగా నీ మెడలో ఉన్న యమపాశం కూడా తీసేస్తే నేను హ్యాపీగా ఉంటాను అంటాడు. దాంతో మిధున ప్రాణం ఎవరైనా తీసి పక్కన పెడతారా అంటే దేవా దండం పెట్టేసి వెళ్లిపోతాడు. దేవా బాత్‌రూమ్‌లోకి వెళ్తుంటే మిధున తోసేస్తుంది. దేవా మిధునతో నేను రౌడీనే అలా తోసేస్తావేంటే అంటే నేను రౌడీ తాటతీసే భార్యని అంటుంది. దేవాకి వార్నింగ్ ఇచ్చి మిధున వెళ్లడంతో దేవా నేను రౌడీ అనుకుంటుందా ఇంకేమైనా అని దీంతో జాగ్రత్తగా ఉండాలి నేను దీనితో వేగలేనురా బాబు అని తల పట్టుకుంటారు. 

మరోవైపు దేవాకి దివ్య కాల్ చేసిన అమ్మకి హర్ట్‌ ఎటాక్ వచ్చింది వెంటనే ఆపరేషన్ అంటున్నారు పదిలక్షలు కావాలి అంట అని చెప్పి ఏడుస్తుంది. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా అనుకుంటూ దేవా సరే నేను అరేంజ్ చేస్తా నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి బయటకు వెళ్తాడు. మరోవైపు శ్రీరంగం, సూర్యకాంతం బిర్యాని తెచ్చుకొని ఎవరికీ తెలీకుండా చాటుగా తింటుంటారు. మిధున ఇంటి నుంచి వెళ్లిపోతే త్రిపుర మేడం కోటి ఇస్తానని అన్నది కానీ మిధున తిరిగి వచ్చి మన ఆశల మీద నీరు జల్లేసిందని ఏడుస్తుంది. దాంతో రంగం ఒక్కటి పోతే ఏంటి మరో సారి ప్రయత్నించి పంపేద్దాం పంపే వరకు వదలొద్దు మిధునని పంపేసి కోటి కొట్టేద్దాం అంటాడు. మిధున ఈ పుట్టింటికెళ్లి వచ్చి బంగారు గాజులు వేసుకుందని కుళ్లుకుంటుంది. దాంతో రంగం త్వరలోనే ఆ గాజులు నీ చేతికి ఉంటాయని అంటాడు. 

డబ్బు కోసం వచ్చిన దేవా ఎక్కడా సర్దుబాటు కాక మిధున గాజులు తీసుకొని వెళ్లిపోతాడు. శారద ఇద్దరు కోడల్ని పక్కన కూర్చొపెట్టుకొని ఇంటి ఖర్చులు లెక్కలు వేస్తుంది. సత్యమూర్తి పేపర్ చదువుతుంటాడు. ఇంతలో మిధున కంగారుగా గాజులు కోసం వెతుకుతుంది. కనిపించపోయే సరికి కంగారు పడుతుంది. అది చూసిన సత్యమూర్తి ఏమైందమ్మా అంటే ఏం కాలేదని అంటుంది. అందరూ గుచ్చి గుచ్చి అడగటంతో గాజులు కనిపించడంలేదని అంటుంది. తన ఇంట్లో బంగారు గాజులు కనిపించకపోయే సరికి సత్యమూర్తి చాలా కంగారు పడతారు. సూర్య కాంతం తన భర్త ఒకరిని ఒకరు నువ్వు తీశావా అంటే నువ్వు తీశావా అనుకుంటారు.  పెట్టిన చోట లేకపోవడంతో ఎవరైనా తీసుంటారేమో అని ఆనంద్ అంటాడు. ఇంటిలో అందరూ ఉంటే దొంగ ఎలా వస్తారని శారద అంటుంది. అందరి గదులు వెతకమని సత్యమూర్తి అంటాడు.

మన ఇంట్లో వాళ్లు ఎవరూ తీయలేదు నాకు ఆ నమ్మకం ఉందని మిధున అంటుంది. ప్రమోదిని తన తల్లి మీద ఒట్టు వేస్తుంది. ఏంటి అక్క మీరు అని మిధున అంటుంది. కాంతం కూడా తాను తీయలేదు అని అంటుంది. అందరూ ఈ విషయం వదిలేయండి అని మిధున అంటే నువ్వు డబ్బింటి అమ్మాయివి నీకు అది పెద్ద విషయం కాదు కానీ అది నా ఏడు సంవత్సరాల సంపాదన అంటాడు. మిధున వద్దూ అన్నా ఆనంద్, ప్రమోదిని తమ గదిలో చూడటానికి తీసుకెళ్తారు. తర్వాత తమ గది చెక్ చేస్తే వాళ్లు దాచుకున్న నగలు డబ్బు దొరికిపోతుందని రంగం, కాంతం ఇక్కడున్న వాళ్లు తీయకపోతే దేవానే తీసుంటాడు అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: చెల్లిని చావగొట్టిన దీప.. కన్నకూతురి చెంప పగలగొట్టిన సుమిత్ర.. దీప విశ్వరూపం!

Continues below advertisement