Nuvvunte Naa Jathaga Serial Today Episode సత్యమూర్తి దేవాతో వాళ్లు ఎవరో మమల్ని చంపడం కాదు నువ్వే చంపేసి కన్నవాళ్లని చంపాను అన్న గొప్ప బిరుదు మూట కట్టుకోరా అని అంటారు. దేవా, మిధున, శారద షాక్ అయిపోతారు. నాన్న అలా అనొద్దు అని దేవా అంటే నాతో మాట్లాడకురా నన్ను అలా పిలవకురా అని అంటారు. 


సత్యమూర్తి: వీడి వల్ల నా కుటుంబం ప్రాణాలు పోతాయనే భయం వెంటాడుతోంది శారద. నాకు తెలిసి నేను ఎవరికీ ఏం అన్యాయం చేయలేదు. కానీ నా కడుపున ఇలాంటి నీచుడు ఎలా పుట్టాడు శారద. 
శారద: ఏవండీ ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం దయచేసి వెళ్లిపోదాం అండీ.
సత్యమూర్తి: వీడేం ఘనకార్యం చేశాడని ఇంటికి వెళ్లి మాట్లాడుకోవడానికి. అసలు వీడు నాకు పుట్టడమే పెద్ద శాపం. నా ఇంట్లో ఉండటం పెద్ద దరిద్రం. ఓరేయ్ ఇన్ని రోజులు నువ్వు నా కడుపున పుట్టినందుకు బాధ పడ్డాను కానీ ఇప్పుడు నువ్వు ఇంకా బతికి ఉన్నందుకు బాధ పడుతున్నా. నిన్ను నేను మెడ పట్టుకొని గెంటేయకముందే వెళ్లిపో. ఇక్కడి నుంచి వెళ్లిపో. 
శారద: ఏవండీ ఏంటండి కడుపున పుట్టిన కొడుకు గురించి ఆ మాటలు ఏంటి అండీ.
సత్యమూర్తి: నాకు హాని చేసిన వారిని కూడా ఇలాంటి మాటలు అనను కానీ నా కొడుకుని ఇలా అంటున్నాను అంటే నా మనసు ఎంత  బాధ పడుతుందో అర్ధం చేసుకోండి.
మిధున: మామయ్య ఎక్కడికి వెళ్తున్నారు.
సత్యమూర్తి: దయచేసి నన్ను కాసేపు వదిలేయండి.
శారద: భగవంతుడా రోజు రోజుకి తండ్రికొడుకుల మధ్య దూరం పెరిగి పోతుంది ఈ పరిస్థితులు ఎప్పుడుకి సర్దుమణుగుతాయో.


ప్రమోదిని, సూర్యకాంతం ఇద్దరూ మార్కెట్ నుంచి ఇంటికి వస్తారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎక్కడికి వెళ్లారా అని కంగారు పడతారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో కాంతం తన నగలు, బంగారం కొట్టేసుంటారని వెళ్లి కంగారుగా చూస్తుంది. అన్నీ అక్కడే ఉండటంతో హ్యాపీగా ఫీలవుతుంది. ప్రమోదిని దగ్గర నగలు, బంగారం అని మాట్లాడి చీరలు అని కవర్ చేస్తుంది. గుడిలో పోలీసులు మిధున దగ్గరకు వస్తారు. మిధున పోలీసులకు థ్యాంక్స్ చెప్తుంది. సత్యమూర్తి గారి మీద అటాక్ జరిగితే జడ్జి గారి మీద అటాక్ జరబోతుందని ఎందుకు చెప్పారని అడుగుతారు. దాంతో మిధున మా మామయ్య గారు ఓ స్కూల్ రిటైర్డ్ హెడ్ మాస్టార్ అతనికి ప్రమాదం అంటే మీరు నమ్మరు మీరే కాదు ఎవరూ నమ్మరు అందుకే జడ్జి గారి మీద అటాక్ జరుగుతుందని చెప్పానని అంటుంది. పోలీసుల్ని తప్పు దోవ పట్టించినందుకు కోపంగా ఉన్నా సమయస్ఫూర్తితో హత్య ఆపినందుకు మెచ్చుకుంటున్నానని చెప్పి వెళ్లిపోతారు.


శారద: అంటే ఇదంతా చేసింది నువ్వా సమయానికి పోలీసులు రావడం మా ఆయన్ను కాపాడటానికి కారణం నువ్వా.
మిధున: మీ ఆయన మాత్రమే కాదు అత్తయ్య మా మామయ్య గారు కూడా. మామయ్యకు హాని జరగబోతే మీకు ఎంత ఉంటుందో నాకు అంతే ఉంటుంది. 
శారద: మీ నాన్న గారికి నీ మీద చాలా కోపంగా ఉంది. అలాంటిది ఇలా అబద్ధం  చెప్పడంతో అది పెరుగుతుందని తెలిసి కూడా ఇంత సాహసం చేశావా.  
మిధున: మా నాన్న కోపం నేను చూసేశా అత్తయ్య ఇప్పుడు ఇంకాస్త పెరుగుతుంది అంతే కానీ మామయ్య గారి ప్రాణాలకు ఏం కాకుండా ఉంటే అదే నాకు చాలా సంతోషం. దాని ముందు ఇదేం పెద్ద బాధ కాదు.


అమ్మా మిధున అంటూ శారద మిధునని వాటేసుకుంటుంది. మిధున చాలా సంతోషపడుతుంది. సాటి ఆడదానిలా నీ బాధ నేను అర్థం చేసుకోకుండా నిన్ను ఇబ్బంది పెట్టాను.. చాలా మాటలు అన్నాను.. నువ్వు తినకుండా నువ్వు కాళీ కడుపుతో పడుకుంటే కనీసం తిండి కూడా పెట్టని పాపిష్టి దాన్ని కానీ నువ్వు నీకు సమస్య వస్తుంది అని తెలిసి కూడా నా పసుపు కుంకుమలు నిలబెట్టావు. నువ్వు నిజంగా దేవత అని దండం పెడుతుంది. నువ్వు నన్ను అమ్మా అంటాను అంటే తిట్టి పంపేశాను కానీ నీతో అలా పిలుపించుకునే అర్హత లేదని ఏడుస్తుంది. నాకు కూతురు లేదని ఎప్పుడూ బాధ పడేదాన్ని కానీ నీ లాంటి బంగారం లాంటి అమ్మాయిని నా దగ్గరకు పంపడానికే నాకు ఆ ప్రాప్తం ఇవ్వలేదని ఇప్పుడు అర్థమైందని అనడంతో మిధున ఎమోషనల్ అయి అత్తని హగ్ చేసుకుంటుంది. 


మిధునకు ఏమవుతుందో తన ప్రాణాలకు ఏం ప్రమాదం ఉందో అని హరివర్దన్ చాలా టెన్షన్ పడతారు. అందరూ ఏమైందని అడిగితే రౌడీ వల్ల తన తండ్రిని చంపబోయారని ఆయన కోసం మిధున నన్ను అక్కడికి పంపించిందని లేదంటే ఆయన చనిపోయేవారని అంటారు. వాడి మీద పగతో రేపు మిధున చంపడానికి వాడి శత్రువులు చూస్తారని వాడి వల్ల వాడి చుట్టూ ఉన్న వాళ్లకి ప్రమాదమే అని అంటారు. అక్కకి ఏం కాకుండా కాపాడు నాన్నని అని మిధున చెల్లి తండ్రిని వేడుకుంటుంది. అక్కని త్వరగా ఇంటికి తీసుకురా నాన్న అని ఏడుస్తుంది. బామ్మ, లలిత అందరూ ఏడుస్తారు. మిధునని ఎలా కాపాడుకుంటామండీ అని లలిత ఏడుస్తుంది. నా కూతురికి ఏమైనా అయితే ఆ క్షణమే నా ప్రాణం పోతుందని అని హరివర్దన్ అంటాడు. ఏదో ఒకటి చేసి మిధునని ఇంటికి తీసుకురావాలని రాహుల్ అంటాడు. నా కూతురిని ఇంటికి తెచ్చుకుంటానని జడ్జి గారు అంటారు. ఇక గుడిలో శారద, మిధున హోమం దగ్గరకు వెళ్తారు. పూర్ణహుతి సమర్పించాలని పంతులు అంటారు. పూర్ణహుతి నా కోడలు మిధున సమర్పిస్తుందని శారద చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీకి ఓ అవకాశం.. మనీషాకి తెలీకుండా HCG టెస్ట్ చేసేదెలా?