Ammayi garu Serial Today Episode దీపక్ వేసిన ఇంజెక్షన్ వల్ల విజయాంబిక పిచ్చి దానిలా అయిపోతుంది. అత్తయ్య అన్నందుకు మౌనికని వాయించేస్తుంది. ఈ టైంలో విజయాంబిక దగ్గర దీపక్ ఉంటే బెటర్ అని మందారం చెప్పడంతో చంద్రకి చెప్పి బెయిల్ ఇప్పించమని సూర్య చెప్తారు. విజయాంబిక అందరినీ చూసి మీరంతా నన్ను ఆడుకోనివ్వడం లేదు కదా మీ పని చెప్తా అనుకొని నిద్ర బాగా వస్తుందని చెప్పి నోటిలో వేలు పెట్టుకొని పడుకుంటుంది. అందరూ వింతగా చూస్తారు. దీపక్ ఇంటికి వస్తాడు. మా మమ్మీకి ఏమైంది అని కంగారు పడతాడు.
సూర్య దీపక్‌తో నువ్వు తప్పు చేయలేదు అని నమ్మని తీసుకురాలేదు మీ అమ్మకి ఈ టైంలో నీ తోడు కావాలని తీసుకొచ్చా అని చెప్తారు. రూప దీపక్‌తో మీ అమ్మకి పిచ్చి పట్టింది చిన్న పిల్లలా మారిపోయిందని ఎవరు ఏమంటున్నా దవడ పగలగొడుతుందని చెప్తుంది. మమ్మీకి పిచ్చి పట్టడం ఏంటి అని దీపక్ కంగారు పడతాడు. మమ్మీ మమ్మీ అని గదిలోకి వెళ్లే సరికి విజయాంబిక చిన్న పిల్లలా ఫుల్లుగా పౌడర్ రాసుకొని కాటుకతో పెద్ద బొట్టు పెట్టుకొని బుగ్గ చుక్క రెండు జడలు వేసుకొని నోటిలో వేలు పెట్టుకొని అందరినీ షాక్‌కి గురి చేస్తుంది. ఇక దీపక్ మమ్మీ సారీ అనగానే ఎవడ్రా నువ్వు అని చెంప వాయిస్తుంది. అది కాదు మమ్మీ అని దీపక్ అంటే మళ్లీ మమ్మీ అంటావా అని దీపక్ బాక్స్ బద్దలగొడుతుంది.
దీపక్ గొంతు పట్టి నలిపేస్తుంది. సూర్య దగ్గరకు వెళ్లి నేను వీడికి మమ్మీనా నన్ను మమ్మీ అంటుందని అడిగితే సూర్య బిత్తర చూపు చూస్తాడు. ఇక మౌనికి మీ కన్న కొడుకే అత్తయ్య అని అనగానే మౌనికని రేవేట్టేస్తుంది. సూర్య దగ్గరకు వెళ్లి నాకు అసలు పెళ్లి కాలేదు అని అంటుంది. చంద్ర అక్క అనగానే నువ్వు ఎవడ్రా అని అంటుంది. చంద్రని కూడా తన దగ్గరకు పిలిస్తే నేను రాను అని చంద్ర భయపడి భార్య చాటుకి వెళ్తాడు. తనని అత్తయ్య, మమ్మీ, అక్క అని పిలవొద్దని పాప అని పిలవమని చెప్తుంది. పాపకి నిద్ర వస్తుందని అని నోట్లో వేలు పెట్టుకొని పడుకుంటుంది. అందరూ దీపక్‌ని తల్లిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్తారు. దీపక్ చాలా కంగారు పడతాడు. మందారం వెనక మౌనిక కూడా జారుకుంటుంది.
రూప దీపక్ దగ్గరకు వెళ్లి మందారాన్ని పిచ్చిదాన్ని చేయాలి అనుకుంటే మీ అమ్మ ఎలా అయిందని అనుకుంటున్నావా. నేను రాజు ప్లాన్ చేసి నువ్వు మందారానికి వేయాలి అనుకున్న ఇంజక్షన్ అత్తయ్యకి వేయాలి అనుకున్నాం అని చెప్తుంది దీపక్ షాక్ అయిపోతాడు. మీ బండారం బయట పడేలా చేస్తానని ఛాలెంజ్ చేస్తుంది. రాజు కాల్ చేయడంతో రూప బయటకు వెళ్లి మాట్లాడుతుంది. విజయాంబిక గురించి చెప్తుంది. మందారాన్ని చూపించడానికి యూఎస్ నుంచి వచ్చిన ఓ స్పెషలిస్ట్‌ని కలవడానికి వెళ్తున్నానని రాజు చెప్తాడు. రాజు డాక్టర్‌ని కలిసి మందారం కేసు గురించి చెప్తాడు. పేషెంట్‌ని చూడాలి అని చెప్తే రేపు తీసుకొస్తానని రాజు చెప్తాడు. రాజు రూపకి విషయం చెప్పడంతో రూప చాలా సంతోషిస్తుంది. మందారానికి గతం గుర్తొస్తుందని రూప మాట్లాడటం దీపక్ వింటాడు. షాక్ అయిపోతాడు. రేపు సూర్యకి విషయం చెప్పే మందారాన్ని తీసుకురమ్మని రాజు రూపతో చెప్తాడు. ఉదయం రూప వాళ్లు వెళ్లాలి అనుకున్న కారుకి దీపక్ బాంబ్ పెడతాడు. రూప, మందారం ఇద్దరూ టైం బాంబ్‌కి బలి అయిపోతారు అనుకుంటాడు. రూప తండ్రితో యూఎస్ డాక్టర్ గురించి చెప్పి మందారాన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్తాను అని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బాలయ్యని ఫాలో అవ్వడం అంత ఈజీ కాదోయ్ గిరి.. జైలులో తాళి కట్టడానికి గిరి ప్లాన్!