Nuvvunte Naa Jathaga Serial Today Episode ప్రమోదిని భర్తని తీసుకొని గదికి వెళ్లి ఏడుస్తుంది. తాగిన మైకంలోనే ఆనంద్ ప్రమోదినిని ఏడ్వొద్దని అంటాడు. ఏడుపు తప్ప నాకు ఇంకేం మిగిలింది.. ఇన్నాళ్లు మీ బద్ధకాన్ని సపోర్ట్ చేస్తున్నానని మామయ్య నన్ను కూడా అంటున్నారు. ఉద్యోగం చేయాలి అనే ఆలోచనే లేదు ఇప్పుడు ఈ తాగుడు ఒకటా అని అడుగుతుంది. దేవా వాళ్ల మాటలు వింటాడు. అన్నయ్య జాబ్ చేయడం లేదని వదిన ఇంత బాధ పడుతుందా అని దేవా అనుకుంటాడు.
కొంప తీసి బిల్ మీరు కట్టారా ఏంటి?
శ్రీరంగం మత్తుకి తలనొప్పి అని అరుస్తుంటే కాంతం మజ్జిగ ఇస్తుంది. అందరూ మొగుళ్లు తాగారని అరుస్తుంటే నేను చూడండి ఎలా మజ్జిగ ఇస్తున్నానో అంటుంది. ముగ్గురు కలిసి మందు తాగారు కదా కొంపతీసి డబ్బు మీరు ఇచ్చారా ఏంటి అని గుండెలు పట్టుకుంటుంది. నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని రంగం చెప్తాడు. దాంతో కాంతం భర్తని పొగిడేస్తుంది.
ఓవర్ చేస్తుంది కానీ తప్పదుగా..
దేవా వదిన మాటలు తలచుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మిధున మేడ మీద దేవా బెడ్ పక్కనే కూర్చొని ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది అని పాటలు పెట్టుకొని వింటూ ఉంటుంది. దేవా వెళ్లి ఇప్పుడు నేను అన్నయ్యని మార్చడానికి సపోర్ట్ అడిగితే ఓవర్ చేస్తుంది. అయినా అన్నయ్య కోసం తప్పదు అని మిధున పక్కకు వెళ్లి కూర్చొని మిధున చూడాలని మాట్లాడాలి అని దగ్గుతాడు. ఏంటి ఓవర్ చేస్తున్నావ్.. నీతో మాట్లాడటానికి నేను వచ్చాను అని నీకు తెలుసు అయినా ఓవర్ ఏంటి అని అడుగుతాడు.
ఆ ఐడియా ఏంటి..
దేవా మిధునతో మా అన్నయ్య జాబ్‌కి వెళ్లడానికి నీ దగ్గర ఏదో ఐడియా ఉంది అన్నావ్ కదా ఏంటో చెప్పు అని అడుగుతాడు. మావి తొక్కలో ఐడియాలు సార్ మీ అన్నయ్యని మార్చడానికి మీరు అద్భుతమైన ఐడియాలు వేస్తారు. మీరు చాలా గొప్ప వారు సార్ మీకు మా ఐడియాలు ఎందుకు సార్ కామెడీనా అని అంటుంది. అన్నయ్య కోసం తప్పడం లేదని దేవా మిధునకు సలహా అడుగుతాడు. చెప్పమని బతిమాలుతాడు. ఇప్పుడు చెప్పను రేపు చెప్తాను అని నిద్రపోతుంది.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో మిధునకు సీట్..
హరివర్దన్ ఇంటికి మిధున పేరు మీద కొరియర్ వస్తుంది. లలిత తీసుకుంటుంది. ఏంటా అని భార్యభర్తలు చూస్తారు. మిధునకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో సీట్ వచ్చిందని అంటాడు. తన గొంతు తనే కోసేసు కొని తన భవిష్యత్ తనే నాశనం చేసుకుందని ఈ యూనివర్సిటీలో చదివితే నా కూతురి భవిష్యత్ మరోలా ఉండేదని కానీ తనే నాశనం చేసుకుందని బాధ పడతారు. దానికి త్రిపుర మిధునని మన ఇంటికి తీసుకురావడానికి ఇదో అద్భుతమైన అవకాశం అంటుంది.
ఇది మిధున కల..
మామయ్య ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదవాలి అనేది మిధున లైఫ్‌టైం డ్రీమ్ కదా అని అంటుంది. అక్కడ చదవడం తన కల కాబట్టి విషయం తెలిస్తే ఫారిన్ వెళ్లి చదువుకోవడానికి ఒప్పుకుంటుంది. రెండు మూడేళ్లు ఫారిన్‌లో ఉంటుంది కాబట్టి మిధున మనసు మారిపోతుందని త్రిపుర అంటుంది. రాహుల్ కూడా త్రిపుర చెప్పింది నిజమే అని అంటాడు. మిధునకు విషయం చెప్పమని హరివర్దన్‌కి చెప్పడంతో మిధున తల్లిదండ్రులు బయల్దేరుతారు.
మిధున గంతులు
మిధున ఆరు బయట పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుంటే దేవా సలహా అడగటానికి వెళ్తూ తిట్టుకుంటాడు. మిధునకు సలహా అడుగుతాడు. ఐడియా రావడం లేదు ఓ మంచి టీ తీసుకురా చెప్తానని అంటుంది. ఒళ్లు ఎలా ఉంది నాకు టీ తెమ్మంటున్నావ్ అని అడుగుతాడు. టీ ఇవ్వకపోతే ఐడియా చెప్పను అంటుంది. దాంతో దేవా టీ తీసుకురావడానికి వెళ్తాడు. మిధున గంతులేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: నువ్వు ఎవర్నినైనా ఉద్దరించుకో ఉద్యమాలు చేసుకో నా జోలికి రాకు.. దీపకు గౌతమ్ వార్నింగ్!