Lakshmi Nivasam Serial 7th April Episode Promo: ఓవైపు జానుతో పెళ్లికి సిద్ధమవుతాడు జై. జాను పేరెంట్స్ లక్ష్మీ, శ్రీనివాస్‌లకు ఆ విషయాన్ని చెప్పి తమ నిర్ణయం చెప్పాలంటూ అతని కార్డ్ ఇచ్చి వెళ్లిపోతాడు. ఇదే సమయంలో కొందరు బయట జాను గురించి తప్పుగా మాట్లాడగా వారికి బుద్ధి చెప్తాడు జై. 

మరోవైపు.. శ్రీకాంత్ తన ఆస్తి మొత్తాన్ని తన కూతురు ఖుషీ పేరు మీద రాస్తాడు. సుపర్ణిక ఇంటికి వచ్చిన లాయర్ ఈ విషయాన్ని ఆమెకు చెప్తాడు. శ్రీ చనిపోయే ముందు వీలునామా రాశారని.. అది పోలీసుల సమక్షంలోనే తెరుస్తామని అంటాడు. దీంతో సుపర్ణికతో పాటు భార్గవ్, అతని తల్లి భాగ్యం షాక్ అవుతారు. సుపర్ణికకు కేవలం 5 శాతం మాత్రమే రాయడంతో భాగ్యం నిట్టూరుస్తుంది. సుపర్ణిక కూడా తల పట్టుకుంటుంది.

పోలీస్ స్టేషన్‌కు తులసి ఫ్యామిలీ..

తాజా ఎపిసోడ్ ప్రోమోకు రిలీజ్ కాగా ఆసక్తి రేపుతోంది. లక్ష్మీ, శ్రీనివాస్‌ ఇంట్లో ఉండగా అక్కడికి పోలీసులు వస్తారు. తులసి కోసం ఎంక్వైరీ చేసిన పోలీస్ ఆఫీసర్ సీఐ గారు మిమ్మల్ని స్టేషన్‌కు తీసుకు రమ్మన్నారని అంటాడు. దీంతో అంతా షాక్ అవుతారు. పోలీస్ స్టేషన్‌కు ఎందుకు రావాలి? అంటూ శ్రీనివాస్ ప్రశ్నించగా స్టేషన్‌కు వస్తే అంతే తెలుస్తుంది అంటూ పోలీసులు తులసితో సహా లక్ష్మీ, శ్రీనివాస్‌లను స్టేషన్‌కు తీసుకెళ్తారు. దీంతో ఇంట్లో వాళ్లంతా కంగారుపడతారు. ఇదే సమయంలో శ్రీనివాస్, లక్ష్మీలను పోలీసులు జైల్లో వేస్తారు. ఇది చూసి తులసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. తన వాళ్లను వదిలేయాలంటూ పోలీసులను వేడుకుటుంది.

సిద్ధు వారిని కాపాడతాడా?

ఇదే సమయంలో సిద్ధుకు అతని అనుచరుడు ఫోన్ చేసి మన వాళ్లను జైలులో పెట్టారని.. వెంటనే స్టేషన్‌కు రావాలని అంటాడు. దీంతో ఆడపిల్ల అనే కనికరం కూడా లేకుండా అలా ఎలా చేస్తారని ప్రశ్నిస్తాడు. వెంటనే స్టేషన్‌కు బయలుదేరుతాడు. దీంతో సిద్ధు తులసిని రక్షించాడా.? అనేది ఆసక్తికరంగా మారింది. 

ఎన్నో ప్రశ్నలు

అసలు తులసి ఫ్యామిలీని ఎవరు ఎందుకు టార్గెట్ చేశారు?, లక్ష్మీ, శ్రీనివాస్‌లను ఎందుకు జైలులో పెట్టారు?, సిద్ధు వెళ్లేది వారిని కాపాడడానికేనా? సుపర్ణిక, భార్గవ్ ఏమైనా ప్లాన్ చేశారా?, లేదా శ్రీ యాక్సిడెంట్‌కు కారకులైన వారిని వదిలిపెట్టనని బసవతో తులసి అనడంతో తనకున్న పలుకుబడితో బసవనే వారిని జైల్లో పెట్టించాడా? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే. 

జైకు జాను ఓకే చెప్తుందా?

మరోవైపు, జై ప్రపోజల్‌ గురించి లక్ష్మీ, శ్రీనివాస్‌లు తన ఫ్యామిలీతో డిస్కస్ చేస్తారు. అందరూ ఆ ప్రపోజల్‌కు ఓకే చెప్పాలని అనగా.. జాను అభిప్రాయం అడగాలని తులసి అంటుంది. జై ప్రపోజల్‌కు లక్ష్మీ, శ్రీనివాస్‌లు ఒప్పుకొంటారా?, జాను ఏమంటుంది?, జాను ఫ్యామిలీ పెళ్లికి ఓకే చెప్తే విశ్వ పరిస్థితి ఏంటి?, ఆస్తి విషయంలో షాక్ తిన్న సుపర్ణిక, భార్గవ్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? సిద్ధును బయటపడేసేందుకు బసవ ఇంకా ఏం ప్లాన్ చేస్తున్నాడు? వంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం సస్పెన్స్‌గానే ఉంది.