Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీ రూంలోకి వెళ్లి శారీ తీసుకొచ్చిన మనోహరి.. ఆ శారీకి స్ప్రే చేసి మంటల్లో చిక్కుకుని చనిపోయేలా చేయాలనుకుంటుంది. ముందుగా ఆ స్ర్పేను ఒక గుడ్డకు చేసి చూడాలనుకుంటుంది. ఇంతలో అక్కడికి చంభా వస్తుంది.
చంభా: ఏం చేస్తున్నావు మనోహరి..
మను: ఇది ఒకసారి ఇలా పట్టుకో..
అని ఆ గుడ్డను చంభా చేతికి ఇస్తుంది. ఆ గుడ్డను అగ్గిపెట్టేతో కాల్చేస్తుంది.
మను: ఇప్పుడు అర్థం అయిందా..? ఇది ఏమిటో
చంభా: అగ్నిని ఆకర్షించే వాయువా..?
మను: అవును ఈ స్ప్రే కొట్టిన శారినీ సాయంత్రం భాగీ కట్టుకుంటే ఎలా ఉంటుంది.
చంభా: చుట్టూ దీపాలు ఉంటాయి. పైగా టపాసులు పేలుస్తారు. ఒక చిన్న నిప్పురవ్వకే ఈ గుడ్డ పేలిక భగ్గుమంది అలాంటిది
మను: నువ్వు ఊహించింది నిజమే సాయంత్రం భాగీ సజీవ దహనం అవుతుంది. దీపాలు వెలిగిస్తేనో.. టపాసులు పేలిస్తేనో అగ్ని ప్రమాదంలో అది మరణించింది అని అందరూ అనుకుంటారు. ఎవ్వరికీ తెలియని ఒక నాచురల్ డెత్
ఇద్దరి మాటలు కిటికీలోంచి వింటుంది ఆరు
ఆరు: నా చెల్లికి ఇంత ప్రమాదం జరగుతుందని తెలిసే రాజు గారు నన్ను కిందకు పంపిచారా.? ఇప్పుడు నేనేం చేయాలి. నా మాట ఎవ్వరికీ వినబడదు.. నేను ఎవ్వరికీ కనిపించను.. భాగీని నేను ఎలా కాపాడాలి..? అయ్యో..
మనోహరి భాగీ శారీకి స్ర్రే కొడుతుంది.
చంభా: అమ్మో అమ్మో నీ కుట్రలు కుతంత్రాల ముందు నా మాయలు మంత్రాలన్నీ దిగదుడుపే మనోహరి
మను: ఈ చీరను ఎవ్వరూ చూడకుండా మిస్సమ్మ రూంలో పెట్టాలి. ఆ పని నువ్వు చేస్తావా..? లేక నన్నే చేయమంటావా..?
ఆరు: మీరిద్దరూ కలిసి నా చెల్లిని చంపాలని చూస్తున్నారా..? మీ కుట్రలు సాగనివ్వను.. ఎలాగైనా నా చెల్లిని నేనే కాపాడుకుంటాను. కానీ ఎలా కాపాడాలి.. అయో ఎలా దేవుడా..?
అని ఆలోచికస్తుంది. వెంటనే బయటకు వెళ్తుంది ఆరు. తర్వాత సాయంత్రం అవుతుంది. పిల్లలు బయటకు వచ్చి దీపాలు వెలిగిస్తూ.. టపాసులు కాలుస్తూ ఉంటారు. వాళ్ల దగ్గరకు వెళ్తుంది ఆరు.
ఆరు: అమ్ము, అంజు దీపాలు పెట్టకండి.. మిస్సమ్మ బయటకు వస్తే ప్రమాదం.. పిల్లలు వద్దు పిల్లలు.. నా మాట వినండి.. ఎలా దీపాలు ఆర్పాలి
అంటూ ఆరు ఎంత చెప్పినా పిల్లలకు వినిపించదు అలాగే దీపాలు వెలిగిస్తూ.. టపాసులు కాలుస్తుంటారు. ఇంతలో భాగీ రెడీ అవుతుంది. అమర్ కూడా రెడీ అయి వస్తాడు. దీంతో ఇద్దరూ కలిసి బయటకు వెళ్లి టపాసులు కాల్చాలి అనుకుంటారు. సరేనని భాగీ అనడంతో ఇద్దరూ కిందకు వస్తారు. డోర్ దగ్గర నిలబడి పిల్లలను చూస్తుటారు. ఇంతలో అక్కడికి ఏడుస్తూ ఆరు వస్తుంది.
ఆరు: భాగీ కాస్త దీపాలకు దూరంగా ఉండు.. లేదంటే నీ శారీకి మంటలు అంటుకుంటాయి. ఆ మనోహరి నీ శారీకి ఏదో స్ప్రే కొట్టింది. జాగ్రత్త భాగీ..
అంటూ చెప్తుంది కానీ ఆరు మాటలు భాగీకి వినిపించవు.. అమర్‌తో కలిసి పిల్లల దగ్గరకు వెళ్తుంది భాగీ. ఇంతలో లోపల నుంచి బయటకు వచ్చిన మనోహరి, చంభా ఇంకా భాగీకి మంటలు అంటుకోవడం లేదని చూస్తుంటారు. తామే ఏదో ఒకటి చేసి భాగీకి మంటలు అంటుకునేలా చేయాలని ప్లాన్ చేస్తారు. అందుకోసం అమ్ము చేత దీపాలు వెలిగించాలని అనుకుంటుంది మనోహరి. వెంటనే అమ్మును పిలుస్తుంది. అమ్ము మనోహరి దగ్గరకు వస్తుంది.
అమ్ము: ఏంటి ఆంటీ పిలిచారు..?
మను: అదిగో అక్కడ కింద దీపాలు ఆరిపోయాయి ఒకసారి వెళ్లి వెలిగించు
అమ్ము: అలాగే ఆంటీ
అని వెళ్తుంటే.. చంభా కూడా అమ్ముతో పాటు వెళ్తుంది. భాగీ దగ్గరకు వెళ్లగానే.. అమ్ము కిందపడేలా చేస్తుంది చంభా. అమ్ము కిందపడబోతుంటే.. అమ్ము చేతిలో ఉన్న దీపాలు భాగీ శారీ మీద పడతాయి. వెంటనే భాగీకి మంటలు అంటుకుంటాయి. అందరూ షాక్ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!