Illu Illalu Pillalu Serial Today Episode ధీరజ్ చెప్పిన విషయం కానిస్టేబుల్ నర్మద, ప్రేమకు చెప్తారు. ఇద్దరూ శోభని ఆ ఫ్రెండ్సే కిడ్నాప్ చేసుకుంటారని అనుకుంటారు. వాళ్ల గురించి తెలుసుకోవాలని శోభ నాన్న దగ్గరకు వెళ్తారు.
శోభ తండ్రి దగ్గరకు వెళ్లి ఫోన్ నెంబరు తన ఫ్రెండ్స్ నెంబర్స్ ఇవ్వమని అడుగుతారు. మీ వాడు నా కూతుర్ని కిడ్నాప్ చేస్తే మీరేంటి వేరే వాళ్ల డిటైల్స్ అడుగుతారు అని ఆయన అనడంతో మీకు మీ కూతురు క్షేమంగా కావాలి కదా అందుకే మాకు సమాచారం ఇవ్వండి అని నర్మద అడుగుతుంది. దాంతో ఆయన డిటైల్స్ ఇస్తారు.
నర్మద మామయ్యకి చెప్పి వెళ్దామని అంటే వద్దు అని ప్రేమ అంటుంది. మామయ్య వెళ్లనివ్వదు అని అంటుంది. దాంతో నర్మద అత్తయ్యకి చెప్దామని అంటుంది. మామయ్యకి చెప్పకుండా వెళ్తారా అని వేదవతి నోరెళ్లపెడుతుంది. మీరు చేస్తున్నది మంచి పనే కదా మీ మామయ్య కూడా సాయం చేస్తారు అని అంటుంది. మామయ్య మమల్ని వెళ్లనివ్వరు పోలీసులు చూసుకుంటారని అంటారని ప్రేమ అంటుంది. పోలీసులకే చెప్దాం అని వేదవతి అంటే వాళ్లు మనకి సపోర్ట్ చేయడం లేదు కదా అని నర్మద అంటుంది. దాంతో అత్త కోడళ్లతో పాటు శోభని వెతకడానికి బయల్దేరుతుంది.
అత్తాకోడళ్లు ఆటోలో వెళ్తారు. ముగ్గురు ఆటోలో ప్లేస్ లేక ఒకర్ని ఒకరు నెట్టుకుంటారు. దాంతో నర్మద అత్తని ఆటోలో ముందుకు కూర్చొపెట్టేస్తుంది. దారంతా నర్మదకు వేదవతి ప్రశ్నలు వేస్తుంటే టిఫెన్ తిన్నారా లేదా మా బుర్రలు తినేస్తున్నారు అని అంటుంది. ముగ్గురు శోభ ఫ్రెండ్ ఇంటికి వెళ్తారు. ఆమె నాకు ఏం తెలీదు అని వణికి పోతుంది. ప్రేమ, వేదవతి ఆ అమ్మాయిని బతిమాలితే నర్మద ఫైర్ అయిపోతుంది. ఆ వెధవ డిటైల్స్ చెప్పడానికి నువ్వు భయపడితే రేపు నీ పని అయిపోతుంది. డిటైల్స్ చెప్పు అని నర్మద అరవడంతో ఆ అమ్మాయి రాకేశ్, కిరణ్‌ల గురించి చెప్తుంది. డిటైల్స్ ఇస్తుంది.
వేదవతి దారిపొడువునా అపశకునాలే మాట్లాడటంతో ఇద్దరూ కోడళ్లు గుర్రుగా చూస్తారు. ఇక ప్రేమ నర్మదతో లాస్ట్ కాల్ నెంబరు బట్టి లొకేషన్ తెలుసుకుందాం అక్కా టెలీకాంలో నీకు తెలిసిన వాళ్లు ఉంటే డిటైల్స్ అడుగు అని ప్రేమ అంటుంది. లీగల్ ఇష్యూలు వస్తాయి వద్దు అని నర్మద అంటే వేదవతి నర్మదతో పేరుకే పెద్ద గవర్నమెంట్ జాబ్ నీ పలుకుబడి వాడి అడుగు అని రెండు చురకలు వేస్తుంది. దాంతో నర్మద డిటైల్స్ కనుక్కుంటుంది.
పోలీస్ స్టేషన్‌లో ధీరజ్ని చూసి రామరాజు చాలా బాధ పడతాడు. తండ్రి కన్నీరు పెట్టుకోవడం ధీరజ్ చూస్తాడు. ధీరజ్ కూడా చాలా బాధ పెడతాడు. ఇక రామరాజు పరుగున బయటకు వెళ్లి టిఫెన్ తీసుకొచ్చి కానిస్టేబుల్‌కి ఇచ్చి వాడు ఆకలితో ఉన్నాడు ఇవ్వండి అని అంటాడు. ఎస్‌ఐ గారు ఒప్పుకోరు అని కానిస్టేబుల్ అంటే అతన్ని బతిమాలి రామరాజు ఇస్తాడు. కానిస్టేబుల్ ధీరజ్‌కి టిఫెన్ ఇస్తాడు. రామరాజు చూసి తినరా అని సైగలు చేస్తాడు. ధీరజ్ తింటాడు అది చూసి రామరాజు మళ్లీ ఏడుస్తాడు. నర్మద, వేదవతి, ప్రేమలు లొకేషన్‌కి వెళ్తారు. ఓ కాలనీకి వెళ్లి ఇళ్లు కోసం మొత్తం వెతుకుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.