Nindu Noorella Saavasam Serial Today Episode: మిస్సమ్మ వాళ్ల నాన్న, మంగళ ఊరు నుంచి వస్తారు. మిస్సమ్మ హ్యాపీగా ఫీలవుతుంది. ఇప్పుడే మీ గురించి అక్కతో చెప్తున్నాను అంతలోనే మీరొచ్చారని అంటుంది మిస్సమ్మ. దీంతో అక్క ఎవరని అడగ్గానే పక్కింటి అక్క అని మీకు ఇప్పుడే పరిచయం చేస్తాను అని మిస్సమ్మ పక్కకు చూడగానే అరుంధతి కనిపించదు. ఎప్పుడూ చూసినా ఎవరికైనా పరిచయం చేద్దామంటే కనబడకుండా వెళ్లిపోతుందేంటి? అనుకుంటుంది మిస్సమ్మ. ఇంతలో మిస్సమ్మ ఫాథర్స్ డే శుభాకాంక్షలు చెప్పి లోపలికి వెళ్తుంది. ఇంతలో అరుంధతి వచ్చి పాథర్స్ డే శుభాకాంక్షలు చెప్తుంది. ఇక లోపలికి వెళ్లగానే పిల్లలందరూ తాతయ్యా అంటూ వెళ్లి హ్యపీగా ఫీలవుతారు.
శివరాం: ఏంటి బావగారు ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది.
మిస్సమ్మ ఫాథర్: బాగుంది బాబుగారు.
శివరాం: భలే టైంకు వచ్చారు బావగారు. ఇవాళ పాథర్స్ డే అందరం జరుపుకుంటున్నాం. మిస్సమ్మకు మీరు తోడు లేరని అనుకుంటున్నాం. ఇంతలో మీరు వచ్చారు.
మిస్సమ్మ ఫాథర్: ఇందాకే చెప్పింది బాబుగారు.
అమర్: అమ్మా నాకు కొంచెం వర్క్ ఉంది నేను వెళ్లేసి వస్తాను.
మంగళ: ఒక్క నిమిషం బాబు..
మిస్సమ్మ: ఏమైంది నాన్నా ఆయనతో ఏమైనా చెప్పాలా?
మిస్సమ్మ ఫాథర్: ఏమీ లేదమ్మా అదంతా ముఖ్యమైన విషయం ఏం కాదులే..
మంగళ: చల్లకొచ్చి ముంత దాచినట్టు.. మాట్లాడటానికి వచ్చి ఇప్పుడు కాదంటున్నావు.
మిస్సమ్మ: ఏమైంది నాన్నా ఏమైనా సమస్యా
అని మిస్సమ్మ అడగ్గానే మేం బతకడానికి మేం కష్టపడక తప్పదు కదా బాబు ఈయన మళ్లీ స్కూల్‌లో వాచ్‌మెన్‌గా చేరాలని అనుకుంటున్నాడు. కాకపోతే మీ పిల్లలు చదివే స్కూల్ కదా అందుకనే అడగడానికి వచ్చాము బాబు. అని మంగళ చెప్తుంది. దీంతో మిస్సమ్మ వద్దని చెప్తుంది. నిర్మల, శివరాం కూడా వద్దని మేము చూసుకుంటామని చెప్తారు. దీంతో మిస్సమ్మ ఫాథర్ వద్దని చెప్తాడు. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుందని ఏదో ఒక పని చేసుకుంటేనే మాకు ఆనందంగా ఉంటుందని చెప్తాడు.
మిస్సమ్మ: ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నారు. పెళ్లి చేసుకుంటే కూతురు అమ్మానాన్నల బాధ్యత చూసుకోకూడదా?
మిస్సమ్మ ఫాథర్: ఇప్పుడు నీ పని నన్ను చూసుకోవడం కాదమ్మా ఈ ఇంటిని ఈ ఇంట్లో వాళ్లను చూసుకోవడం. వీళ్ల తర్వాతే నీకు ఎవరైనా.. ఆఖరికి నేనైనా..
అమర్: నేను మిమ్మల్ని చూసుకుంటానండి. ఈ మాట నేను మీ కూతురు మెడలో తాళి కట్టినందుకు చెప్పడం లేదండి. నేను అభిమానించే వ్యక్తిగా చెప్తున్నాను. నా భార్యకు నాన్నను అని మీరనుకున్నందుకు చెప్తున్నాను.
అని అమర్ చెప్పగానే అందరూ హ్యాపీగా ఫీలవుతారు. మరోవైపు మనోహరి సీరియస్‌గా ఆలోచిస్తుంది. ఇంతలో మనోహరి రూంలోకి మంగళ వస్తుంది. మనోహరి, మంగళను తిడుతుంది. రెండు పడవల మీద కాలు పెడితే నీకే ప్రమాదం అంటూ హెచ్చిరిస్తుంది. దీంతో నేనెప్పుడూ నీ పడవలోనే ఉన్నాను అని చెప్తుంది మంగళ.
మంగళ: అది సరే కానీ నేను మొన్న ఫోన్‌లో చెప్పిన విషయం ఏమైంది.
మనోహరి: ఏ విషయం?
మంగళ: అదే ఆరుంధతి ఆత్మ ఇక్కడ తిరగడం గురించి.. కచ్చితంగా ఆత్మ ఇక్కడే ఉంది మనోహరి. ఇందాక కూడా ఆ భాగి ఆత్మతోనే మాట్లాడిందేమో అనిపించింది.
మనోహరి: అరుంధతి ఇక్కడే ఉంటే నేను చేసినవన్నీ చేసేటివన్నీ ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎందుకు నన్నేం చేయడం లేదు. నిజంగా అది ఇక్కడే ఉందా లేదా?
అని మనోహరి అనగానే మంగళ ఆత్మకు మనిషిని ఏమైనా చేసే శక్తి ఉంటుందా? అని అడగ్గానే వెంటనే మనోహరికి మిస్సమ్మ, అమ్ము మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తాయి దీంతో మనం వెంటనే ఘోరాను కలవాలని అంటుంది. మరోవైపు కిచెన్‌లో మిస్సమ్మ వంట చేస్తుంటే అమ్ము వస్తుంది. ఏదైనా కావాలా అమ్ము అని మిస్సమ్మ అడగ్గానే అమ్ము మిస్సమ్మను తిడుతుంది. అయితే పెళ్లి రోజు ఏం జరిగిందో నాకు గుర్తు లేదు అనగానే అమ్ము అయితే ఆరోజు ఏం జరిగిందో నీకు గుర్తు లేదు. నిన్న ఏం జరిగిందో నాకు గుర్తు లేదు అనగానే మిస్సమ్మ షాక్ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: అమలా పాల్ డెలివరీకి అంతా రెడీ - బంప్ వీడియోకి బ్యాడ్ కామెంట్స్, నెటిజనులకు అది తెలియదా?