Nindu Noorella Saavasam Serial Today Episode: ఇంటికి వచ్చిన మనోహరిని కోపంగా భాగీ ఎందుకు దొరికినట్టే దొరికి మిస్‌ అయ్యావు అని అడుగుతుంది. మనోహరి కోపంగా రాథోడ్‌ను తిడుతుంది.


భాగీ: ఏంటి మనోహరి ఎందుకు అంత కోపం.. నువ్వేదో రణవీర్‌ను కలవడానికి వెళ్లినట్టు రాథోడ్‌ వాళ్లు వచ్చి నిన్ను డిస్టర్బ్‌ చేసినట్టు ఫీలవుతున్నావేంటి..?


మనోహరి: ఏయ్‌ ఏమన్నావు..


భాగీ: అదే మాకెవరికీ తెలియకుండా ఆ ఇంటికి రణవీర్‌ను కలవడానికి వెళ్లావా..? మా ఆయన వచ్చినందుకు ఫీలవ్‌ అవుతున్నావా..? అంటున్నాను.


మనోహరి: నేను ఎందుకు అతన్ని కలవడానికి వెళ్తాను. అయినా ఆయన ఎప్పుడో కోల్‌కతా వెళ్లిపోయారు కదా


అంటూ భాగీ, రాథోడ్‌ను తిట్టుకుంటూ లోపలికి వెళ్తుంది. యమలోకం వెళ్లిన యముడు అనామికలా ఆరు ఎందుకు మారిందో రీజన్‌ తెలుసుకుంటాడు. ఎలాగైనా ఆరుకు గతం గుర్తు చేసియమలోకం తీసుకెల్లాలని కిందకు వస్తాడు. అప్పుడే అనామిక తన ఫ్రెడ్ కు ఫోన్‌ చేసి తాను హైదరాబాద్ వెళ్తున్నట్టు చెప్తుంది. అంతా విన్న చిత్రగుప్తుడు కంగారుపడతాడు. అయితే గుప్తుడి మాట కానీ గుప్తుడు కానీ అనామికకు వినబడవు, కనబడడు.  కాళీ బైక్‌ తీసుకుని వెళ్లిపోతుంటే.. మంగళ వస్తుంది.


మంగళ: ఓరేయ్‌ తమ్ముడు ఎక్కడకు వెళ్తున్నావు..?


కాళీ: భాగీని కలవడానిక వాళ్ల ఇంటికి వెళ్తున్నాను అక్కా..


మంగళ: దాని దగ్గరకు ఎందుకురా..? ఇవాళ మనం ఇలా దిక్కుమొక్కు లేకుండా ఉన్నామంటే.. కారణం ఆ భాగీ దాని రోగిష్టి నాయనే కదరా..?


కాళీ: నీకు ఇంత జరిగినా ఇంకా బుద్ది రాలేదు కదా అక్కా.. మనం ఈ పరిస్థితుల్లో ఉండటానికి కారణమైన మనోహరితో దోస్తీ చేస్తున్నా. అడిగినప్పుడల్లా పైసలిచ్చి ఇంట్లో పెట్టుకున్న భాగీని తిడుతున్నావు.


మంగళ: ఏందిరోయ్‌ మేనకోడలి మీద మస్తు ప్రేమ ఉన్నట్టు ఉంది.


కాళీ: ఎందుకుండదే..  ఈ చేతులతో ఎత్తుకుని పెంచిన.. అట్లనే నా లవర్‌ ఉంది కదా కలిసి ఒక్క జలక్‌ ఇచ్చి వస్తాను.


మంగళ: ఓరేయ్‌ నిప్పుతో దీపం వెలిగించుకోవాలి కానీ ఇల్లు అంటించుకోకూడదు. ఆ మనోహరిని మరీ తక్కువ చేస్తే.. ఇద్దరిని చంపేస్తుంది.


అని చెప్పినా వినకుండా కాళీ వెళ్లిపోతాడు. ఇంట్లో భోజనానికి అంతా రెడీ చేసిన భాగీ అందరినీ భోజనానికి పిలుస్తుంది. అప్పుడే కాళీ వస్తాడు. రాథోడ్‌ వెళ్లి అడ్డుకుంటాడు. అయినా వినకుండా లోపలికి వెళ్తాడు కాళీ. కాళీని చూసిన పిల్లలు భయపడుతుంటారు.


భాగీ: మామయ్య నువ్వు జైలు నుంచి ఎప్పుడు వచ్చావు


కాళీ: ఇవాళ పొద్దుగాల వచ్చిన


మనోహరి: వీడొచ్చాడేంటి..? కొంపదీసి అమర్‌కు నిజం చెప్పేస్తాడా..? అయినా వాడు అడిగినట్ట వాణ్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను కదా..? నా ప్లాన్‌ కానీ తెలిసిపోయిందా..?(  అని మనసులో అనుకుంటుంది.)


శివరాం: ఏమయ్యా నిన్ను చూస్తేనే అందరూ భయపడుతున్నారు ముందు బయటకు వెళ్లు రాథోడ్‌ తీసుకెళ్లు..


పైనుంచి అమర్‌ వస్తాడు.


కాళీ: సార్‌ మీతో కొంచెం మాట్లాడాలి


అమర్‌: మా ఇంటికి మాకు చాలా కావాల్సిన మనిషి ప్రాణాలు తీసిన నీకు ఈ ఇంట్లోకి అనుమతి లేదు. ఎవ్వరితో మాట్లాడటానికి అర్హత లేదు. రాథోడ్‌ పంపించేయ్‌..


మనోహరి: కరెక్టుగా చెప్పావు అమర్‌.. ఏయ్‌ నీకు ఇక్కడేం పని బయటకుపో.. ఇంకా  చూస్తున్నావేంటి రాథోడ్‌ బయటకు గెంటివేయ్‌..


కాళీ:  సార్‌ సరస్వతి మేడం యాక్సిడెంట్‌ గురించిన నిజం మీకు చెప్పడానికి వచ్చాను. ( మనోహరి షాక్‌ అవుతుంది.) దయచేసి నా మాట ఒక్కసారి వినండి సార్‌.. నిజం చెప్పి క్షమాపణ చెప్పుకోవడానికి వచ్చాను సార్‌


మనోహరి: ఇక్కడ నీ మాటలు నమ్మడానికి ఎవ్వరు లేరు ముందు బయటకు వెళ్లు


అమర్‌: నువ్వాగు మనోహరి.. నువ్వు చెప్పు కాళీ ఎవరు చెప్తే ఈ పని చేశావు


కాళీ: ఎవ్వరు చెప్పలేదు సార్‌. బండి బ్రేక్‌ ఫెయిల్‌ అయింది. అందుకే యాక్సిడెంట్‌ అయింది.


అని కాళీ చెప్పగానే.. మనోహరి కూల్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!