Brahmamudi Serial Today Episode: కళ్యాణ్‌ ప్రేమగా అప్పు కోసం పోలీస్‌స్టేషన్‌కు క్యారియర్‌ తీసుకుని వెళ్తాడు. కళ్యాణ్‌ ను చూసిన లేడీ కానిస్టేబుల్‌ ఎవరు కావాలని ఆపుతుంది. మీ ఎస్సై మేడం కోసం వచ్చానని చెప్తాడు. ఇంతలో కళ్యా్‌ణ్‌ వాయిస్‌ విని అప్పు వస్తుంది.


అప్పు: ఎందుకు వచ్చావు..?


కళ్యాణ్‌: నీకోసం క్యారియర్‌ తీసుకొచ్చాను.


అప్పు: నువ్వు క్యారియర్‌ తీసుకురావడం ఏంటి..?


కళ్యాణ్‌: ఏందుకు నేను తీసుకురాకూడదా..?  భర్తలు, భార్యలకు క్యారియర్‌లు తీసుకురావడం చట్టరిత్యా నేరమా..?


అప్పు: అలా అని కాదు కానీ నువ్వు క్యారియర్‌ పట్టుకుని వస్తే.. ఒక మగాడిగా నీకు ఇబ్బంది అనిపిస్తుందేమోనని


కళ్యాణ్‌: ఇందులో ఇబ్బంది ఏం ఉంది. ఒకవేళ నేనే పోలీస్‌ ఆఫీసర్‌ అయితే నువ్వు నాకు తెచ్చేదానివా కాదా..?


అప్పు:  బంగారంలా తీసుకొచ్చేదాన్ని


కళ్యాణ్‌: నేను కూడా నా బంగారం కోసం తీసుకొచ్చాను


కానిస్టేబుల్: చాలా బాగా చెప్పారు సార్‌.. పురుషుల్లో పుణ్యపురుషులు వేరయా అన్నట్టు మీ లాంటి భర్త దొరకడం మేడం అదృష్టం సార్‌


అని పొగుడుతుంటే.. అప్పు ఆ కానిస్టేబుల్‌ను కేసు ఫైల్‌ తీసుకురాపో అటూ పంపిస్తుంది. మరోవైపు  స్టాల్‌ వీడియో తీస్తున్న శృతి కెమెరాకు నంద చిక్కుతాడు. అదే వీడియోను శృతి కావ్యకు పంపిస్తుంది. బట్టలు సర్దుతున్న ధాన్యలక్ష్మీ దగ్గరకు ప్రకాష్‌ వెళ్తాడు.


ప్రకాష్‌: ఏం చేస్తున్నావు..?


ధాన్యం: కనబడటం లేదా..?


ప్రకాష్‌: డొంక తిరుగుడు సమాధానాలు చెప్పకు.. నాకు కోపం తెప్పించకు ఏదైనా ఉంటే స్ట్రైట్‌గా చెప్పు


ధాన్యం: ఇలాంటి వాటికైతే కోపాలు వచ్చేస్తాయి. రావాల్సిన టైంలో అయితే అసలే రావు


ప్రకాష్‌: దేని గురించి మాట్లాడుతున్నావే


ధాన్యం: రావాల్సిన వాటా అడిగే హక్కు లేకుండా చేశారు. కనీసం బాధపడే హక్కు కూడా లేదా నాకు ఇక్కడ. ఎలాగూ రేపు ఉన్న ఆస్థి అంతా ఆ బ్యాంకు వాళ్లకు కట్టేస్తారు. ఆ తర్వాత వాళ్లు మనల్ని మెడపట్టి బయటకు గెంటేస్తారు.


ప్రకాష్‌: అలాగని ఎక్కడికి వెళ్తావు


ధాన్యం: మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఇక్కడకు వచ్చాక అసలు ఈ బ్రతుకు ఎక్కడకు వెళ్తుందో అర్తం కావడం లేదు. ఇంక రేపు బయటకు వెళ్తే.. ఎక్కడకు వెళ్లాలో తెలుస్తుంది.


ప్రకాష్‌: నీకు పిచ్చి ముదిరిపోయింది. అసలు ఏమైందే నీకు ఎందుకు ఇంత దిగజారిపోయావు.. అక్కడ మా నాన్న చచ్చి బతికి వచ్చాడు. ఒక్క నువ్వు రుద్రాణి తప్పా అందరూ ఈ ఇల్లు బాగుండాలని కోరుకుంటున్నారు. పరిస్థితులు అర్థం చేసుకుని కష్టాలు వచ్చినప్పుడు కలిసి ఉండేదే కుటుంబం.


అని ప్రకాష్‌ చెప్పినా ధాన్యలక్ష్మీ వినదు. తన కొడుక్కి ఆస్తులు లేకుండా చేస్తున్నారు అంటూ ఎమోషనల్‌ అవుతుంది. మరోవైపు శృతి సెండ్ చేసిన వీడియో చూస్తుంది కావ్య. అందులో నంద కనబడటంతో షాక్‌ అవుతుంది. షాకింగ్‌ గా రాజ్‌కు చూపిస్తుంది. నందను చూసి రాజ్‌ షాక్‌ అవుతాడు. వాడు బతికే ఉన్నాడంటే నా ఫ్రెండ్‌ విశ్వం నన్ను మోసం చేశాడు. డబ్బు కోసం ఆశపడి వాడు ఇదంతా చేసి ఉండొచ్చు అనుకుంటారు. ఇప్పుడెలా అని ఇద్దరూ ఆలోచిస్తూ.. అప్పును కలుద్దామని డిసైడ్‌ అవుతారు. తర్వాత అప్పు దగ్గరకు వెళ్లి విషయం చెప్తారు. వెంటనే అప్పు విశ్వం ఫోన్‌ ట్రాక్‌ చేసి ఆడియో కాల్‌ వింటుంది. విశ్వం, నందను కలవడానికి వెళ్తుంటే అప్పు ఫాలో చేస్తుంది. మరోవైపు బ్యాంకు వాళ్లు దుగ్గిరాల ఇంటికి వచ్చి ఆస్తులు జప్తు చేస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!