Satyabhama Serial Today February 14th: సత్యభామ సీరియల్: సత్య, క్రిష్‌ల మధ్య చిచ్చుపెట్టిన నర్శింహ చావు.. ఇక ఎప్పటికీ ప్రేమికులు కలవనట్లే!!
Satyabhama Today Episode క్రిష్ నర్శింహకు వార్నింగ్ ఇచ్చిన తర్వాత రుద్ర నర్శింహని చంపడం సత్య క్రిష్‌ని అపార్థం చేసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode మహదేవయ్య, రుద్రల నాటకం తెలియని క్రిష్ నర్శింహని చంపడానికి బయల్దేరుతాడు. సత్య ఎంత చెప్పినా వినడు. ఆవేశంగా వెళ్తాడు. క్రిష్ చాకు తీసుకొస్తే సత్య తీసుకొని నువ్వు నర్శింహని చంపడానికి వెళ్లడానికి వీళ్లేదని అంటుంది.
రుద్ర: ఈ ఇంట్లో మగాడు బయటకు వెళ్తే అడ్డుకోవడం ఆడవాళ్ల పని కాదు. హారతి ఇచ్చి పంపాలి అంతే.
సత్య: సరే అయితే అక్క హారతి తీసుకొని రా ఈ కత్తి సంజయ్ చేతిలో పెడతా సంజయ్‌కి హారతి ఇచ్చి పంపుదాం. నర్శింహని చంపి వస్తాడు.
సంధ్య: సంజయ్‌కి ఏంటి సంబంధం ఎందుకు సంజయ్‌ని ఇన్వాల్స్ చేస్తావ్ అక్క.
సత్య: సంజయ్ కూడా తన కొడుకు లాంటి వాడే అని మామయ్య చెప్పారు కదా. నిన్ను ఈ ఇంటి కోడలిగా చూస్తున్నారు కదా. అత్తయ్య ఇచ్చిన నగలు కులుక్కుంటూ తీసుకున్నప్పుడు సంజయ్ వెళ్తే ఏంటి.
భైరవి: వాడికి దీనికి సంబంధం ఏంటే.
సత్య: సంబంధం ఏంటో నీకు మామయ్య చెప్పలేదా. క్రిష్ ఎగ్జిట్ పోల్స్ నాకు అనుకూలంగా రావడంతో ఈ నాటకాలు ఆడుతున్నారు.
మహదేవయ్య: ఓరేయ్ చిన్నా ఆత్మాభిమానం తర్వాతే ఈ మహదేవయ్యకు ఏమైనా అందుకే నువ్వు వెళ్తుంటే ఆపడం లేదు. సత్య నీకు ఏవేవో చెప్తుంది. నిన్ను ఆపాలని. నువ్వు వెళ్లకురా ఆ కత్తి వదిలేయ్. పోయి ఒంటి చేత్తోనే ఆ నర్శింహని చంపేస్తా.
క్రిష్: బాపు నేను బతికుండగానే నీకు కత్తి పట్టే అవసరం రానివ్వను. ఆ నర్శింహని చంపేస్తా.
సత్య: మనిషిని చంపే హక్కు మీకు ఎవరు ఇచ్చారు.
నాకు కూడా ఇంట్లో ఇష్టం లేని వారు ఉన్నారు వాళ్లని చంపేస్తా ఈ కత్తి నా దగ్గర ఉండినీ అని సత్య అంటే క్రిష్ ఒప్పుకోడు. దాంతో సత్య నీకు ఓ న్యాయం నాకో న్యాయమా అని అడుగుతుంది. క్రిష్ సత్య చేతిలో కత్తి తీసుకొని వెళ్లిపోతాడు. సత్య ఎంత బతిమాలినా తన ప్రేమ చూపించిన ఎంత చెప్పినా క్రిష్ సత్య మాట వినకుండా వెళ్లిపోతాడు. సత్య కింద కూర్చొని ఏడుస్తుంది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ రిజల్స్ చూసిన నర్శింహ మహదేవయ్య ఓడిపోతున్నాడనే సంతోషంతో తాగుతూ ఉంటాడు. ఇంతలో క్రిష్ అక్కడికి వెళ్లి నర్శింహ రౌడీలను కొట్టి నర్శింహని కొడతాడు. నర్శింహని పొడవడానికి కత్తి తీసి సత్య మాటలు గుర్తు చేసుకొని ఆగిపోతాడు. సత్య నన్ను ఆపిందని లేదంటే నీ ప్రాణాలు పోయావని నీకు నా సత్య ప్రాణ భిక్ష పెట్టిందని అంటాడు. పారిపో అని వార్నింగ్ ఇచ్చి క్రిష్ వెళ్లిపోతాడు. సత్య మాటలు తలచుకొని ఇంటికి వెళ్లి పోతాడు. ఇంతలో రుద్ర వచ్చి నర్శింహని చంపేస్తాడు.
ఇంటి దగ్గర అందరూ చాలా టెన్షన్ పడుతుంటారు. ఇంతలో టీవీలో నర్శింహని గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారని ఎన్నికలు రద్దు అయ్యావని వస్తుంది. దాంతో అందరూ క్రిష్ నర్శింహని చంపేశాడని అనుకుంటాడు. ఇక క్రిష్ ఇంటికి వస్తూ చేతికి రక్తపు మరక లేకపోవడంతో సత్య తనని ముద్దులతో ముంచేస్తుందని మారిపోయిన భర్తని పొగుడుతుందని అనుకొని లోపలికి వెళ్తాడు. క్రిష్‌ని చూసి మహదేవయ్య, భైరవిలు పొగిడేస్తారు. నర్శింహని చంపి పరువు నిలబెట్టావని అంటారు. ఇక క్రిష్ టీవీలో నర్శింహ చావు గురించి తెలుసుకొని షాక్ అయిపోతాడు.
సత్య కోపంగా అక్కడిని నుంచి వెళ్లిపోతుంటే క్రిష్ సత్యని ఆపి నేను నర్శింహని చంపలేదని బెదిరించాను అంతే అంటాడు. నీ బెదిరింపుకే చనిపోయాడా అని రుద్ర అంటాడు. దాం తో అందరూ నవ్వుతారు. క్రిష్ అందరి మీద అరిచి నేనేం చేయలేదని అరుస్తాడు. సత్య వెళ్లిపోతుంటే నన్ను నమ్ము సత్య అని ఏడుస్తాడు. చంపాలని కత్తి పెట్టా కానీ నీ మాటలు గుర్తొచ్చి ఆగిపోయాను నేను మారిపోయాను సత్య అని చెప్తాడు. అబద్ధం చెప్పినా అతికినట్లు ఉండాలని సత్య అంటుంది. నా దృష్టిలో నువ్వు పది రెట్లు కిందకి పడిపోయావ్ అని అబద్ధం చెప్పి ఇంకా దిగజారిపోయావని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఇది కదా కావాల్సింది.. కావేరిని చిన్నమ్మా అని పిలిచిన కార్తీక్.. ఏకాకైపోయిన శ్రీధర్!