Nuvvunte Naa Jathaga Serial Today February 1st Episode దేవాకి వశీకరణ మందు పెట్టడానికి భాను దేవా ఇంటికి వస్తుంది. భానుని చూసిన మిధున పని లేక పొద్దస్తమానం మా ఇంటి చుట్టే తిరుగుతావని అంటుంది. ఇక భాను చేతిలో నుంచి వశీకరణ మందు కింద పడటంతో ఆ డబ్బా చూసిన మిధున దాన్ని తీసుకొని ఏంటి ఇది అని అడుగుతుంది. ఇక అందులో ఉన్న వశీకరణ కాటుక మిధున చేతులకు అంటేస్తుంది.
భాను: అది నాది నీకు ఎందుకు.
మిధున: నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావ్.
భాను: నేను ఎందుకు కంగారు పడుతున్నా మస్తు జాలీగా ఉన్నా.
మిధున: ఇంకెప్పుడూ నవ్వకే చండాలంగా ఉంది. ఏయ్ ఏంటి ఇది చేతికి అంటింది.
భాను: మనసులో వశీకరణ మందు చేతికి అంటిందే. అది కాటుక వెళ్లు నువ్వు. అమ్మో జర ఉంటే తగులుకునేదాన్ని దేవా ఏడ ఉన్నాడు.
భాను దేవా వెంట పడుతుంది. ఇంతలో మిధున దేవాకి నీరు ఇస్తే నీకు నా పనులు చేయొద్దని ఎన్ని సార్లు చెప్పాలి అని ఆ నీరు కింద పడేస్తాడు. భాను దేవాకి కాటుక పూయడానికి వస్తూ నీరు మీద కాలు వేసి జారి మిధునకు ఢీ కొట్టేస్తుంది. మిధున వెళ్లి దేవా మీద పడిపోతుంది. ఆ టైంలో మిధున చేతికి అంటిన వశీకరణం మందు దేవా తల వెంట్రులకు రాసేస్తుంది. మిధున దేవాకి వశీకరణ మందు రాసేసింద్రో అని భాను గుండె పట్టుకుంటుంది. ఇక మిధున కొంగు పట్టుకొని దేవా తిరుగుతాడని నా కొంప కొల్లేరైపోయిందని భాను అనుకుంటుంది.
ఎన్నో రాత్రులొస్తాయి కానీ రాదే వెన్నెలమ్మా.. అంటూ మిధున, దేవా రొమాంటిక్ డ్యూయెట్ వేసుకున్నట్లు భానుకి కలొస్తుంది. తుళ్లిపడి లేచి చెమటలు పట్టేస్తుంది. ఇప్పుడు జాగ్రత్త పడకపోతే వచ్చిన కల నిజం అవుతుందని కంగారు పడుతుంది. లవ్ గురు దగ్గరకు వెళ్లి విరుగుడు తేవాలి అని అనుకుంటుంది. మరోవైపు త్రిపుర సూర్యకాంతానికి బ్యూటీపార్లర్‌కి తీసుకెళ్లి ఫేస్ ప్యాక్‌లు మేకప్‌లు చేయిస్తుంది. బదులుగా మిధునని తన ఇంటికి పంపించాలని చెప్తుంది. ఇక అందుకు సూర్యకాంతం త్రిపుర ఫోన్ తీసుకుంటుంది.
పురుషోత్తం కొన్ని డాక్యుమెంట్లు దేవాకి ఇచ్చి కొన్నేళ్లగా ఉన్న బస్తీ వాళ్ల ఇళ్ల స్థాలాల డాక్యుమెంట్లని రేపే పంచుదామని అంటాడు. నువ్వు దేవుడన్నా అని దేవా పురుషోత్తాన్ని అంటాడు. ఈ ఇళ్ల పట్టాల ఇవ్వనివ్వకుండా ఓ లాయర్ అడ్డుకుంటున్నాడని చెప్తాడు పురుషోత్తం. ఇక దేవా మంచి పనిని అడ్డుకుంటానంటే ఎలా ఊరుకుంటానని అంటాడు. డాక్యుమెంట్స్ జాగ్రత్తగా ఉంచమని అంటాడు. మా ఇంట్లో ఉంచుతానని దేవా వెళ్తాడు. ఇక అప్పు ఇచ్చిన మళ్లేశం లాయర్‌ని తీసుకు వస్తాడు. డబ్బు ఇంకా ఇవ్వలేదని సత్యమూర్తికి లాయర్ నోటిస్ ఇప్పిస్తాడు. 5రోజుల్లో అప్పు తీర్చకపోతే ఇళ్లు జప్తు చేస్తున్నట్లు నోటీస్ ఇస్తామని అంటాడు. పరువు పోతుందని అని సత్యమూర్తి అంటే 10 లక్షలు ఇవ్వకపోతే ఇళ్లు తీసుకుంటానని అంటాడు. మిధున మొత్తం చూస్తుంటుంది. ముందే నోటీస్ ఇచ్చాం కాబట్టి దేవా మల్లేశాన్ని ఏమైనా చేస్తే మీ ఫ్యామిలీతో పాటు దేవాని పోలీసులు అరెస్ట్ చేస్తారని లాయర్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఇది కదా కావాల్సింది.. కావేరిని చిన్నమ్మా అని పిలిచిన కార్తీక్.. ఏకాకైపోయిన శ్రీధర్!