Nindu Noorella Saavasam Serial Today Episode: బంటి పురమాయించిన పాప, అంజును కింద పడేలా చేస్తుంది. అంజు కింద పడి అమ్మా అంటూ బాధపడుతుంది. అరుంధతి బాధపడుతుంది. ప్రిన్సిపాల్ మాత్రం హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో మిస్సమ్మ వచ్చి గట్టిగా అంజు అని పిలుస్తుంది. కమాన్ అంజు అంటూ ప్రోత్సహిస్తుంది. దీంతో అంజు మెల్లగా లేచి పరుగెడుతుంది. పరుగు పందెంలో అంజు విన్నర్ అవుతుంది. దీంతో మిస్సమ్మ, అరుంధతి, పిల్లలు చాలా హ్యాపీగా ఫీలవుతారు. బంటి, ప్రిన్సిపాల్ ఇరిటేటింగ్‌గా ఫీలవుతారు. మరోవైపు మనోహరి రూంలోకి వెళ్లి బాధపడుతుంది.
మనోహరి: అమర్ కు నిజం తెలియకుండా ఆపలేకపోయాను. ఇప్పుడిక నిజం తెలిసినా అమర్ మనసులో భాగీ మీద అభిమానం కాస్త బాధ్యతగా మారుతుంది. ఆ బాధ్యత బంధాన్ని బలపరచక ముందే.. ఏదో ఒకటి చేయాలి. ఒక్కో సమస్య నుంచి బయటపడాలి.
అని ఆలోచిస్తుంటే ఎవరో మనోహరికి తన వీడియోను సెండ్ చేస్తారు. ఆ వీడియో చూసి భయంతో వీడియో పెట్టిన వ్యక్తికి నువ్వే నాకు కాల్ చేయ్ అని వాయిస్ మెసేజ్ పెడుతుంది. దీంతో ఆ వ్యక్తి మనోహరికి ఫోన్ చేస్తాడు.
మనోహరి: హలో ఎవరు నువ్వు ఏం కావాలి?
అజ్ఞాత వ్యక్తి: అదేంటి మనోహరి. చెప్పాను కదా యాభై లక్షలు కావాలని ఏంటి? అప్పుడే మర్చిపోయావా? పోని అమరేంద్రకు వీడియో పెట్టనా? నువ్వు జీవితంలో మర్చిపోకుండా చేస్తాడు.
మనోహరి: ఏయ్ ఈ మనోహరితో చాలా ప్రమాదకరమైన ఆట ఆడుతున్నావు. చస్తావు.
అజ్ఞాత వ్యక్తి: నువ్వు నీ స్నేహితురాలిని చంపావు. పిల్లల్ని చంపాలనుకున్నావు. ఇంకా నీ ఆకలి తీరలేదా? మనోహరి.
అని ఆ వ్యక్తి చెప్పగానే మనోహరి భయపడుతుంది. ఎవరు? నువ్వు అంటూ భయపడుతుంది. దీంతో ఆ వ్యక్తి వెంటనే నాకు డబ్బులు ఇవ్వకపోతే అమరేంద్రకు నిజం చెప్తాను అంటూ బెదిరిస్తాడు. దీంతో మనోహరి డబ్బులు ఇస్తానని ఒప్పుకుంటుంది. ఫోన్ కట్ చేస్తుంది. అసలు ఎవరు ఇతను అని ఆలోచిస్తుంది మనోహరి. మరోవైపు స్కూల్‌లో ఒకవైపు నుంచి ఆరు, ఇంకోవైపు నుంచి మిస్సమ్మ పరుగెత్తుకొస్తుంటారు. ఒకర్నినొకరు డాష్ ఇచ్చుకుంటారు.
మిస్సమ్మ: ఏంటక్కా అలా భయపెట్టావు.
ఆరు: సారీ సారీ
మిస్సమ్మ: అవును ఎక్కడికి అంత హడావిడిగా వెళ్తున్నారు.
ఆరు: ఇందాకా రన్నింగ్ రేస్ అయిపోయింది కదా పిల్లల్ని కలవడానికి వెళ్తున్నాను.
మిస్సమ్మ: ఓహో మీ పిల్లలు కూడా రన్నింగ్ రేస్‌లో పాల్గొన్నారా?
ఆరు: పాల్గొనడమే కాదు గెలి.. గెలవలేకపోయారు.
మిస్సమ్మ: అయ్యో.. అవును.. నా కూతురు అంజలి రన్నింగ్ రేస్‌లో గెలిచింది తెలుసా?
అని మిస్సమ్మ చెప్పగానే నా పిల్లలు అని మనసులో అనుకుంటుంది ఆరు. తర్వాత మిస్సమ్మ వెళ్లిపోతుంది. అంజు తాను గెలిచినందుకు అమ్ము వాళ్లతో ఫోజులు కొడ్తుంది. అక్కా, అన్నలతో సేవలు చేయించుకుంటుంది. మిస్సమ్మ చూసి నవ్వుకుంటుంది. మరోవైపు అమర్ తన సోల్జర్స్ తో అంజలి వాళ్ల స్కూల్ కు వస్తాడు. స్కూల్ మొత్తం చెక్ చేయమని చెప్తాడు. ప్రిన్సిపాల్ వచ్చి ఏందుకు చెక్ చేస్తున్నారని అడుగుతుంది. రన్నింగ్ రేస్ గురించి అంజలి గెలిచిందని చెప్తుంది. అమర్ పిల్లలను చూడాలని స్కూల్ లోపలికి వస్తాడు. మిస్సమ్మ అమర్ సార్ వచ్చారని పరుగెత్తుకెళ్తుంది. పిల్లలు కూడా పరుగెత్తుకొచ్చి అమర్ ను చూసి హ్యాపీగా ఫీలవుతారు. మాకోసమే వచ్చారా? అని పిల్లలు అడిగితే లేదని డ్యూటీ మీద వచ్చానని అమర్ చెప్పగానే పిల్లలు డల్‌గా ఫీలవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: బాలయ్య, సూర్యపై ‘యానిమల్’ విలన్ బాబీ డియోల్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఫ్యాన్స్ ఫుల్ ఖుష్