Bobby Deol: బాలయ్య, సూర్యపై ‘యానిమల్’ విలన్ బాబీ డియోల్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఫ్యాన్స్ ఫుల్ ఖుష్

తమిళ స్టార్ హీరో సూర్య, తెలుగు సీనియర్ యాక్టర్ బాలయ్యపై బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ ప్రశంసల వర్షం కురిపించారు. వారితో కలిసి పని చేయడం తన అదృష్టం అన్నారు.

Continues below advertisement

Bobby Deol  About Suriya And Balakrishna: బాలీవుడ్ సీనియర్ నటుడు బాబీ డియోల్ సౌత్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. తమిళ దర్శకుడు సిరుత్తై శివ తెరకెక్కిస్తున్నన ‘కంగువ’, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ‘హరి హర వీర మల్లు’, బాబీ డైరెక్షన్ లో రూపొందుతున్న NBK 109 చిత్రాల్లో కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. తమిళ నటుడు సూర్యతో పాటు బాలయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  

Continues below advertisement

సూర్య గొప్ప నటుడు- బాబీ డియోల్

సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ మూవీ రిలీజ్ కు ముందే ‘కంగువ’ సినిమాకు ఓకే చెప్పినట్లు బాబీ డియోల్ వెల్లడించారు. సూర్య లాంటి నటుడితో కలిసి  పని చేయడం గర్వంగా ఫీలవుతున్నట్లు చెప్పారు. “నేను చాలా కాలంగా సూర్యతో కలిసి పని చేయాలని అనుకున్నాను. అతడు చాలా గొప్ప నటుడు. నాకు ‘కంగువ’ ఆఫర్ రాగానే చాలా సంతోషపడ్డాను. శివ గొప్ప దర్శకుడు. చాలా సున్నిత మనస్కుడు. అతడు టెడ్డీ బేర్ లాంటివాడు. అయినా, ఓ ప్రతిష్టాత్మక చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు” అని చెప్పుకొచ్చారు.

బాలయ్యతో కలిసి పని చేయడం బాగుంది- బాబీ డియోల్

అటు NBK 109 సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించడం చాలా బాగుందన్నారు నటుడు బాబీ డియోల్. బాలయ్య ఎప్పుడూ చాలా ఎనర్జిటిక్ గా ఉంటారని చెప్పారు. “బాలకృష్ణ గారితో నటించడం చాలా మధురానుభూతిని కలిగిస్తోంది. షూటింగ్ ఎప్పుడు మొదలైనా, ఎంత లేట్ అయినా ఆయన చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు. ఆయన ప్రతి ఒక్కరితో చాలా సంతోషంగా ఉంటారు. దర్శకుడు బాబీ చాలా మంచి వ్యక్తి. ఇలాంటి గొప్ప వ్యక్తులతో కలిసి పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అన్నారు.  

ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందిన బాబీ డియోల్

బాబీ డియోల్ ఒకప్పుడు హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగారు. కానీ, ఆ ర్వాత మంచి సినిమాలు రాకపోవడంతో కొంతకాలం ఇబ్బందులు పడ్డారు. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ సినిమాతో దేశ వ్యాప్తంగా ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకున్నారు. విలన్ అబ్రార్ పాత్రలో ఒదిగిపోయి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. ఒకప్పుడు నార్త్ సినిమాలకే పరిమితం అయిన బాబీ డియోల్, ‘యానిమల్’ మూవీ సక్సెస్ తో సౌత్ సినిమాల్లోకి అడుగు పెట్టారు. హిందీ, తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తున్నారు. తెలుగులో బాలయ్యతో పాటు మరికొన్ని సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ‘దేవర’లో ఆయన నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆలియా భట్, శర్వరి ఆల్ఫాతో అనురాగ్ కశ్యప్‌ తెరకెక్కిస్తున్న ఓ సినిమాలోనూ బాబీ డియోల్ నటిస్తున్నారు.  

Also Read: ఒకే వేదికపైకి అల్లు అర్జున్ - సుకుమార్... మారుతి నగర్ ఈవెంట్‌లో 'పుష్ప 2' పుకార్లకు చెక్!?

Continues below advertisement
Sponsored Links by Taboola