Lucky Bhaskar Movie Postponed: 'మహానటి', 'సీతారామం' చిత్రాలతో తెలుగులో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు దుల్కర్‌ సల్మాన్‌. అంతకాదు భాషతో సంబంధం లేకుండ బాలీవుడ్‌, కోలీవుడ్‌లోనూ బ్యాక్ టూ బ్యాక్‌ ఆఫర్స్‌ అందుకుంటున్నాడు. ఇప్పుడు తెలుగులో అతడు నటిస్తున్న మరో స్ట్రయిట్‌ మూవీ లక్కీ భాస్కర్‌. తెలుగు డైరెక్టర్‌ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ముందు నుంచే అంచానాలు నెలకొన్నాయి. ఇక ప్రచార పోస్టర్స్‌, అప్‌డేట్స్‌, టీజర్‌ కూడా చిత్రంపై హైప్‌ క్రియేట్‌ చేశాయి. ఈ నేపథ్యంలో లక్కీ భాస్కర్‌ సెప్టెంబర్‌ 27న రిలీజ్‌ చేస్తున్న ఈ మూవీ ఇప్పటికే ప్రకటించింది.


అయితే తాజాగా ఈ సినిమాను వాయిదా వేసినట్టు మూవీ టీం ఓ ప్రకటన ఇచ్చిన షాకిచ్చింది. ఈ మేరకు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఓ అప్‌డేట్‌ ఇచ్చింది. ఈ చిత్రాన్ని దిపావళి సందర్బంగా అక్టోబర్ 31 వాయిదా వేసినట్టు చెప్పారు. అయితే దీనికి కారణం కూడా మూవీ టీం వెల్లడించింది.  శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌లో నిర్మాత సూర్య దేవర నాగ‌వంశీ, సాయి సౌజ‌న్యలు 'లక్కీ భాస్కర్‌' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో దుల్కర్‌ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమా రిలీజ్‌ని ప్రకటించడంతో ఆడియన్స్‌లో క్యూరియాసిటీ మొదలైంది.






ఈ క్రమంలో ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడం దుల్కర్‌ ఫ్యాన్స్‌ అంతా షాక్ అవుతున్నారు. ఈ మేరకు మేకర్స్‌ మూవీ వాయిదా వేయడంపై క్లారిటీ కూడా ఇచ్చారు.  లక్కీ భాస్కర్‌ చిత్రాన్ని పాన్‌ ఇండియాగా రిలీజ్‌ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం పోస్ట్‌  ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ సినిమాను డబ్బింగ్‌ వర్క్‌ కారణంగా వాయిదా వేస్తున్నట్టు మేకర్స్‌ స్పష్టం చేశారు. "మా లక్కీ భాస్కర్‌ సినిమా పట్ల ప్రేక్షకులు చూపిస్తున్న ఆసక్తికి మేము సంతోషిస్తున్నాము. దుల్కర్‌ సల్మాన్‌ కూడా తన ఎక్కడ కాంప్రమైస్‌ అవ్వకుండ భాస్కర్‌గా తన వంద శాతం ఎఫర్ట్స్‌ పెట్టి పర్ఫామ్‌ ఇచ్చారు.



క్వాలిటీ విషయంలో కూడా ఆయన కాంప్రమైజ్‌ కాలేదు. 80's, 90's బ్యాక్‌డ్రాప్‌లోని తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం మా టెక్కికల్‌ టీం అండ్‌ క్రూ ముంబై సెట్‌ని రిక్రియేట్‌ చేసింది. అలాగే మూవీ క్వాలిటీ విషయంలో మేము కాంప్రైజ్‌ అవ్వాలనుకోవడం లేదు. పలు భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేస్తున్న ఈ సినిమా డబ్బింగ్‌ విషయంలో మాకు మరింత టైం కావాలి. ప్రతి భాషలో ఆయా లోకల్‌ ఫ్లేవర్‌ మిస్‌ కాకుండా డబ్బింగ్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది. దీనికి మాకు మరింత సమయంలో పడుతుంది. అందుకే సినిమాను వాయిదా వేయక తప్పడం లేదు. అందుకే లక్కీ భాస్కరో అక్టోబర్‌ 31, 2024కి పోస్ట్‌పోన్‌ చేశాం" అంటూ మూవీ టీం వివరన ఇచ్చింది. 


Also Read: మలయాళ ఇండస్ట్రీలో ఆడవాళ్లపై లైంగిక వేధింపులు - వెలుగులోకి సంచలన విషయాలు, హేమ కమిటీ ఏం చెబుతుందంటే!