Nindu Noorella Saavasam Serial Today Episode: మూర్తి ఇంటికి వెళ్తుంది మనోహరి.  అసలు నీ పెళ్లి రేపు అవుతుందా? అని మూర్తి అడగ్గానే మనోహరి షాక్‌ అవుతుంది. ఎందుకు అలా అడుగుతున్నారని మనోహరి అంటుంది. ఏం లేదు రేపు పెళ్లి పెట్టుకుని ఎందుకు ఇంత డల్‌గా ఉన్నావు అని అడుగుతాడు. దీంతో ఏం లేదు అని చెప్తుంది మనోహరి ఇంతలో మంగళ గిల్టీ నగలు వేసుకున్న విషయం మూర్తి, మనోహరికి చెప్తాడు. దీంతో మనోహరి మంగళ వైపు కోపంగా చూస్తుంది. మంగళ భయపడుతుంది. ఇంతలో మూర్తికి ఫోన్‌ రావడంతో బయటకు వెళ్తాడు. వెంటనే మనోహరి కోపంగా మంగళ గొంతు పట్టుకుని చంపేస్తానని బెదిరిస్తూ నగలు ఎక్కడున్నాయని అడుగుతుంది. దీంతో మంగళ నగలు తీసుకొచ్చి ఇస్తుంది. అవి కూడా గిల్టీ నగలు కావడంతో మనోహరి షాక్‌ అవుతుంది. ఎవరో నన్ను ఫాలో అవుతున్నారు నా ప్లాన్‌ మొత్తం తెలుసుకున్నారని ఆలోచిస్తుంది. తర్వాత మిస్సమ్మ కూడా నగల గురించి ఆలోచిస్తుంది. మనోహరి గిల్టీ నగలు ఇంటికి తీసుకొస్తే.. వాటిని డూప్లికేట్‌ అని ఎలా ప్రూవ్‌ చేయాలని ఆలోచిస్తూ వర్జినల్‌ నగలు ఉండి ఉంటే ‌ఫ్రూవ్‌ చేయొచ్చని అనుకుంటుండగానే దూరంలో ఒక బ్యాగ్‌ కనిపిస్తుంది. బ్యాగ్‌ దగ్గరకు వెళ్లి తెరచి చూస్తే అందులో వర్జినల్‌ నగలు ఉంటాయి. వెంటనే రాథోడ్ ను పిలుస్తుంది.


రాథోడ్‌: ఏమైంది మిస్సమ్మ ఎందుకలా అరిచావు.. ఇవి అమ్మగారి నగలులా ఉన్నాయి.


మిస్సమ్మ: లా కాదు రాథోడ్‌ అమ్మగారి నగలే.. అవి కూడా డూప్లికేట్‌ కాదు వర్జినల్‌..


రాథోడ్‌: అవును మిస్సమ్మ, ఎవరు తీసుకెళ్లారో, ఎక్కడున్నయో తెలియని  నగలు ఇక్కడికి ఎలా వచ్చాయి. ఎవరు తీసుకొచ్చి పెట్టి ఉంటారు.


మిస్సమ్మ: మొన్న ఇలానే పోయిందనుకున్న తాళి సడెన్‌ గా ప్రత్యక్షమయ్యింది. ఇప్పుడు నగలు కూడా ఇంత మంది ఉన్నా నాకే కనిపించేలా నా రూంలో ప్రత్యక్షమయ్యాయి. ఆ దేవుడు మనవైపు ఉన్నాడు రాథోడ్‌. మనకు సాయం చేయాలని చూస్తున్నాడు.


రాథోడ్‌: అవును మిస్సమ్మ అందుకే ఈ నగలు మనకు దొరికేలా చేశాడు.


మిస్సమ్మ: ఈ ఒక్క బ్యాగుతో మనోహరి చేసే మోసాల్ని, చేయబోయే దారుణాల్ని బయటపెట్టవచ్చు


  అని ఇద్దరూ మాట్టాడుకుంటుంటే ఒక విండో లోంచి అరుంధతి, మరో విండో లోంచి నీల చూస్తుంటారు. నీల వెంటనే మనోహరికి చెప్పాలని వెళ్తుంది. నీల మనోహరికి ఫోన్‌ చేసి నగలు ఇక్కడే ఉన్నాయని మిస్సమ్మ దగ్గరే ఉన్నాయని చెప్తుంది. దీంతో మనోహరి షాక్‌ అవుతుంది. ఆ నగలు మిస్సమ్మ దగ్గరకు ఎలా వెళ్లాయని అడగ్గానే మిస్సమ్మ రూంలో జరిగిన విషయం మొత్తం చెప్తుంది. దీంతో అదే నగలతో దాన్ని దెబ్బ కొడతానని మనోహరి నీలకు చెప్తుంది. మరోవైపు అరుంధతి హ్యాపీగా బయటకు వస్తుండగా ఎవరికో పెళ్లి జరిగినట్లు అనిపించడంతో గుప్తను వెళ్లి అడుగుతుంది. రేపు జరగబోయే పెళ్లి గురించి కాదు ఇప్పుడు ముంచుకొస్తున్న మనోహరి ప్రమాదం గురించి ఆలోచించు మిస్సమ్మను బయటకు వెళ్లగొట్టేందుకే వస్తుంది. ఆ మనోహరి వెనక ఆ ఘోర ఉన్నాడు. అని గుప్త చెప్పగానే అరుంధతి బాధపడుతుంది. ఇంతలో మనోహరి వస్తుంది.


మనోహరి: అక్కాచెల్లెలు కలిసి ఈ మనోహరినే ఓడిద్దామనుకున్నారా?  ఈ ప్రపంచమే ఏకమైనా నాకు అమర్‌కు పెళ్లి కాకుండా ఎవ్వరూ ఆపలేరు.


అంటూ లోపలికి వెళ్లిపోతుంటే చిన్న గాలిలా మనోహరికి తగులుతుంది. దీంతో పక్కకు చూస్తుంది. పక్కన అరుంధతి నిలబడి ఉంటుంది.


అరుంధతి: నేను కనిపిస్తున్నానా?


మనోహరి: లోపలికి వచ్చి జరగబోయే సినిమా చూడు.


అంటూ మనోహరి వెళ్లిపోతుంది. దీంతో అరుంధతి గుప్తను ఏం జరుగుతుందని అడుగుతుంది. పరిస్థితులు ఆ బాలికకు అనుకూలంగా ఉన్నాయని గుప్త చెప్తాడు. లోపలికి వెళ్లిన మనోహరిని అమర్‌ నగలు తీసుకురాలేదని అడుగుతాడు. నిర్మల, శివరాం కూడా ఏమైందని అడుగుతారు. మనోహరి మాట్లాడకుండా నీలను తన బ్యాగు లోపల పెట్టమని చెప్తుంది. దీంతో అమర్‌ ఆగు నీల అంటూ ఆ ఇంటి నుంచి ఎందుకు బయటకు వచ్చావని మనోహరిని అడగడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: నేను వాళ్లను తినేస్తానట - స్టార్ హీరోలతో సినిమా ఛాన్సులు రాకపోవడంపై ప్రియమణి కామెంట్స్