Naga Panchami Today Episode: పంచమి కడుపులో బిడ్డ వల్ల ఇంట్లో వాళ్లకి ప్రాణ గండం అని పంచమికి అబార్షన్ చేయిస్తానని వైదేహి అంటుంది. దీంతో రఘురాం, శబరిలు వైదేహితో వాదిస్తారు. ఇక శబరి కుల గురువుని అడిగి నిర్ణయం తీసుకుందామని కోడలికి సలహా ఇస్తుంది.  కొడుకుతో కుల గురువుని కలవడానికి ఏర్పాట్లు చేయమని అంటుంది. వాళ్ల మాటలను కరాళి, ఫణేంద్రలు వింటారు.


కరాళి: వాళ్ల గురువు గారు ఏం చెప్తే అది చేయడానికి రెడీగా ఉన్నారు.
ఫణేంద్ర: ఆ బిడ్డ వలన మోక్షకు ఎలాంటి ఆపద లేకుండా ఆ గురువుగారు చెప్తే అప్పుడేం చేద్దాం కరాళి.
కరాళి: ఆ గురువుగారు అలా చెప్పరు ఆయన నోట నేను అనుకున్నదే పలికిస్తాను. ఆ శక్తి నాకు ఉంది. మనం రేపు వాళ్లని అనుసరించి నల్లమల అడవులకు వెళ్తున్నాం. వాళ్ల గురువుగారి మాటలు విని వాళ్ల ముఖాలు ఎంతలా మాడిపోతాయో చూడబోతున్నాం.


మోక్ష, పంచమి వెళ్తున్న కారు ఆగిపోతుంది. చెక్ చేసినా ఫలితం ఉండదు. మోక్ష క్యాబ్ బుక్ చేస్తాను అంటే పంచమి నడిచి వెళ్తామని అంటుంది. నువ్వు నడవగలవా లేదా అని మోక్ష పంచమిని అంటాడు. 
 
పంచమి: నేను పల్లెటూరి నుంచి వచ్చిన అమ్మాయిని. మీలా పట్నంలో సుకుమారంగా పెరగలేదు. నడక నాకు బాగా అలవాటు. 
మోక్ష: నువ్వు నడుస్తావ్ ఓకే కానీ నా బిడ్డ నడవలేదుగా. నువ్వు నడిస్తే లోపల నా బిడ్డ అలసిపోతుంది.
పంచమి: మరీ అంత సుకుమారం పనికి రాదు అండి. మీ ప్రేమ చూస్తుంటే ఒక్కోసారి నాకే భయం వేస్తుంది. 
మోక్ష: నా ప్రేమ నా ఇష్టం నా భార్య ఎప్పటికీ అలసి పోకూడదు. ఓ పని చేస్తా నిన్ను ఎత్తుకుంటా..
పంచమి: నేను నడుస్తా అండి పర్లేదు. అని పంచమి నడుస్తుంది. ఉన్నట్టుండి కడుపు నొప్పి అనగానే పంచమిని మోక్షఎత్తుకుంటాడు. 


పంచమిని ఎత్తుకొని హాస్పిటల్‌కి తీసుకెళ్తాడు. డాక్టర్‌ని మోక్ష కంగారు పెట్టేస్తాడు. పంచమిని చూసిన డాక్టర్ ఏం కాలేదు అని అంటాడు. మెడిసిన్ ఏం అవసరం లేదు అని ప్రెగ్నెన్సీ టైంలో మందులు ఎక్కువ వాడొద్దని అంటుంది. 


మరోవైపు చిత్ర పాముల కోసం పాలు తీసుకొని వెళ్తుంది. జ్వాల వచ్చి చిత్ర నెత్తి మీద ఒక్కటేసి వాటికి ఏం అవసరం లేదు అని ఎక్కువ దయ చూసిస్తే అవి మనల్నే చంపేస్తాయని చెప్తుంది. 


జ్వాల: రేపు బామ్మ  పంచమి వాళ్లని తీసుకొని కుల గురువు గారి దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఆయన పంచమి కడుపులో బిడ్డ వల్ల ఏ ప్రాబ్లమ్ లేదు అని ఆయన చెప్తే ఇక పంచమిని నెత్తిన పెట్టుకుంటారు. ఈ ఇంట్లో పంచమికి తిరుగు ఉండదు.
చిత్ర: అలా జరగకూడదు అక్క. అందుకే ఈ పాములను ఈరోజే ఇంట్లో వదిలేద్దా అత్తయ్య చూసింది అంటే ఇక పంచమి పని అవుట్. 
జ్వాల: ఈ రాత్రిక మనం జాగారణ చేసి అయినా సరే ఈ పాములతో రక్తి కట్టించాలి. ఈ పాములను మోక్ష గదిలో వదిలేస్తే వాటిని చూసి మోక్షఅరుస్తాడు. అందరితో పాటు మనం వెళ్లి గొడవ పెద్దది చేద్దాం. అప్పుడు పంచమి పని అయిపోతుంది. 


పంచమి: అత్తయ్య గారు మిమల్ని ఒక విషయం అడగొచ్చా..
వైదేహి: నాకు ఇష్టమైన మోక్షకు భార్యవి కదా నువ్వు ఎప్పుడైనా ఏమైనా అడగొచ్చు.
పంచమి: రేపు మనం కుల గురువు గారి దగ్గరకు వెళ్తున్నాం కదా అత్తయ్య గారు ఆయన మాట మీకు నమ్మకం కదా అత్తయ్య గారు. వారి మాట మీదే మా బిడ్డ భవిష్యత్ ఆధారపడి ఉంది. నా బిడ్డ వల్ల మోక్ష బాబుకి ఏ ఆపద లేదు అని తెలిస్తే అప్పుడు నా బిడ్డను బతకనిస్తారు కదా అత్తయ్య. నేను మోక్ష బాబు బిడ్డ మీద ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నాం అత్తయ్య గారు.
వైదేహి: అవునా నాతో రా. చూడు.. అని తన గదిలో సెల్ఫ్‌లు మొత్తం బొమ్మలతో నింపేసి ఉంటుంది. అది వైదేహి పంచమికి చూపిస్తుంది. నీ బిడ్డ నా వంశాంకురం పంచమి తన కోసం నేను ఎంతలా ఎదురు చూస్తున్నానో చూడు. ఇది నాకే పరీక్ష పంచమి. నా కొడుకుకు ఆపద కలుగుతుందేమో అని కుమిలిపోతున్నారు. మరో వైపు మా వంశాంకురం. ఎవర్నీ కోల్పోలేను.
పంచమి: మిమల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించండి..మీలో ఇంత ప్రేమ ఉందని అనుకోలేదు అత్తయ్యగారు. నా మీద కోపంతో నా బిడ్డని తీయించేస్తారు అనుకున్నాను. 
వైదేహి: నేను బిడ్డలన్ని కన్నాను. కడుపులో బిడ్డ పడితే ఎలా ఉంటుందో నాకు తెలుసు. మూడు నెలల బిడ్డ మీద నీకు అంత ప్రేమ ఉంటే 25 ఏళ్లు అల్లారు ముద్దుగా పెంచిన నేను ఎంతలా ప్రేమ ఉంటుందో అర్థం చేసుకో. గురువుగారు నోట మంచి మాట రావాలి అని ఎన్ని దేవుళ్లను మొక్కానో నాకు తెలుసు. కానీ తేడా జరిగితే నేను ఒప్పుకోను. నువ్వు అన్నింటికి సిద్ధంగా ఉండు.


మరోవైపు జ్వాల చిత్రను నిద్ర లేపి పాములను తీసుకొని మోక్ష గది దగ్గరకు వస్తారు. పాములను మోక్ష గదికి వదులుతారు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: గేమ్ ఛేంజ‌ర్ లో నాది మంచి రోల్.. ఆ సినిమాలో చేయ‌డం చాలా చాలా హ్యాపీగా ఉంది అంజ‌లి