Satyabhama Today April 10th Episode: మహదేవయ్య నందినిని పిలుస్తాడు. దగ్గరకు తీసుకొని యోగ క్షేమాలు అడుగుతాడు. నందిని డల్‌గా తండ్రి దగ్గర కూర్చొంటుంది. మహదేవయ్యని చూసి హర్షతో పాటు ఇంట్లో అందరూ టెన్షన్ పడతారు. ఎందుకు తనని చూసి భయపడుతున్నారని మహదేవయ్య అందర్ని అడుగుతాడు. 


మహదేవయ్య: నాకు కోపం ఎక్కువ ఒప్పుకుంటాను. నచ్చని పని జరిగితే నరికేస్తా అది కూడా ఒప్పుకుంటా.. కానీ ఇప్పుడు వచ్చింది మంచీ చెడ్డ మాట్లాడుకోవడానికి అంతే.. నేను ఏదైనా ఓపెన్‌గా మాట్లాడుతాను. మీరు కూడా ఓపెన్‌గా మాట్లాడితే అందరికీ మంచిది. నా బిడ్డ ఎవర్ని అయినా ఇబ్బంది పెడుతుందా.. అందరూ లేదు అని తల ఊపుతారు. మరి నీ సంగతి ఏంటి అల్లుడు. హర్ష కూడా లేదు అని తల ఊపుతాడు. మీకు ఎవరికైనా నా బిడ్డ మీద కంప్లైంట్స్ ఉన్నాయా.. మరి నీకు ఏమొచ్చిందే ఇంత మంచి వాళ్ల మీద నాకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చావ్. నెత్తిగాని తిరుగుతుందా.. మీ మామ ఎవరు కాలేజీలో పంతులు.. అందరికీ బుద్ధి నేర్పే వాడు.. బుద్ధి లేకుండా ప్రవర్తిస్తాడా.. వాళ్ల దగ్గర డబ్బు లేకపోవచ్చు మంచి మర్యాద మస్తు ఉన్నాయి. వీళ్లు ఇళ్లు చిన్నది కావొచ్చు. మనసులు చాలా పెద్దవి.. చిన్నపిల్ల పెంకితనంతో కంప్లైంట్ చేసింది సారీ.. పెళ్లికి ముందు నా బిడ్డకు నేను చెప్పి పంపాను. బంగారం అత్తింట్లో నీకు ఎవరూ పల్లెత్తి మాట అనరు. అనలేరు.. అని చెప్పాను. ఎందుకు అంటే నువ్వు ఈ మహదేవయ్య బిడ్డవి కాబట్టి.. ఏమంటారు బావగారు నేను చెప్పింది తప్పా.. ఆ భరోసాతో కదా మేం నీ కూతుర్ని బాగా చూసుకుంటున్నాం.
విశ్వనాథం: అదేంటి బావగారు అలా అంటున్నారు. నందినిని మేం ఎందుకు బాధపెడతాం. తనని మా కూతురిలా చూసుకుంటాం. ఎప్పుడూ తన సంతోషం కోసం ఆలోచిస్తూ ఉంటాం.
రుద్ర: దాని సంతోషం కోసం కాదు అది ఈ ఇంట్లో పడుతున్న బాధ గురించి ఆలోచించు.
మహదేవయ్య: రుద్ర నేను మాట్లాడుతున్నా కదా నువ్వు ఊరుకో.. నా బిడ్డ కష్ట సుఖం చూసుకోలేని అంత చేతకాని వాడిని అనుకున్నావ్‌రా. ఎవరైనా నా బిడ్డని బాధ పెడితే చూస్తూ ఊరుకుంటానా చంపి పాతరేస్తా.. బావగారు మా వాడి మాటలు పట్టించుకోకండి. కానీ నా కూతురు చెప్పిన దాంట్లో కొద్దో గొప్పో నిజం ఉంటుంది. కదా.. 
హర్ష: ఆ నిజం మీ కూతుర్ని అడగండి..
నందిని: చూస్తున్నావా బాపు ఎలా మాట్లాడుతున్నాడో..
మహదేవయ్య: ఒకటి గుర్తుంచుకో ప్రొఫెసర్ ఇక్కడ నా బిడ్డకు సమస్య వస్తే ఆడ నీ బిడ్డకు నాలుగు సమస్యలు వస్తాయి..
విశ్వనాథం: బావగారు..
మహదేవయ్య: ఈడ నా బిడ్డ సమస్యలకు కారణం ఏంటో బాగా తెలుసు మీ బతుకులు ఏంటో మాకు తెలుసు.. అని డబ్బులు తీసి ఇస్తారు. నెలనెలా డబ్బు పంపిస్తానని దాంతో తన కూతుర్ని బంగారంలా చూసుకోమని అంటాడు.
నందిని: లేదు బాపు నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు నీతో వచ్చేస్తా..
మహదేవయ్య: ఆ ఒక్కటి అడక్కు బిడ్డా ఆడపిల్లకు అత్తారిల్లే పుట్టిళ్లు.. నువ్వు ఈడే ఉండాలి. పోదాం పదరా. అల్లుడు వయసులో ఉన్నావ్ బలం ఉంది అనుకుంటున్నావ్ ఏంటో నిన్ను తొక్కాలి అంటే నేను అవసరం లేదు నా నీడ చాలు.. జాగ్రత్త అల్లుడు. ఇంకో సారి నాకు ఇలాంటి అవసరం రాకుండా చూసుకోండి బావగారు. పోయి వస్తా..
శాంతమ్మ: చెల్లెలిని కాపాడాలి అని పనికి మాలిన నిర్ణయం తీసుకున్నావ్ ఇప్పుడు నీ వల్లే దాని జీవితం చిక్కుల్లో పడుతుంది.  


హర్ష తన ఫ్రెండ్స్‌ని కొమ్మలతో చితక్కొడతాడు. తనకు పనికిమాలిన ఐడియా ఇచ్చారంటూ తిడతాడు. మీరు చెప్పినట్లు చేసినందుకు తన ఇజ్జత్ మొత్తం పోయిందని అంటాడు. ఇక బాబీ క్రిష్ మనసు మార్చే ప్రయత్నం చేస్తాడు. మొగుడు నచ్చకపోతే ఏ ఆడది అయినా విడాకులు అడుగుతుంది అని అలా అడగలేదు అంటే వదినకు నీ మీద ప్రేమ ఉందని అంటాడు. నువ్వే తగ్గి వదిన మీద ప్రేమ బయటకు తీసుకురావాలి అని అంటాడు. దీంతో క్రిష్ ప్రేమ అని నన్ను రెచ్చగొడతారా అని మళ్లీ వాళ్లని కొడతాడు. కాళీ గాడి మాటలు ఇలాగే విన్నాను అని సగం జీవితం పోయిందని ఇప్పుడు మీ మాటలు వింటే పూర్తి పోతుందని మందు తాగుతాడు. 


మరోవైపు రుద్ర తన తండ్రిని నిలదీస్తాడు. ఒకప్పుడు మా బాపు ఎలా ఉండేవాడు ఇప్పుడు ఇలా ఏంటి అని అడుగుతాడు. దానికి మహదేవయ్య నేను తగ్గి మాట్లాడలేదు అని రాజకీయం కోసం ఇలా మారుతున్నాను అంటాడు. మహదేవయ్య ఇంటికి వచ్చేసరికి ఎదురుగా సత్య కనిపిస్తుంది.  మహదేవయ్య సత్యని ఆపి రుద్రని లోపలికి వెళ్లిపోమంటాడు. భైరవి కూడా అక్కడికి వస్తుంది.


మహదేవయ్య: నీ అంత చదువుకోలే.. నీ అంత తెలివిగా మాట్లాడటం చేతకాదు. ఏం చెప్పినా ముక్కు సూటిగా కుండ పగలగొట్టేలా మాట్లాడుతా.. నా అలవాటు ఏంటో తెలుసా.. ఎవరైనా నేను చెప్పినట్లు వినకపోతే చెంప పగలగొడతా. నాకు నచ్చని మాట మాట్లాడితే పళ్లు రాలగొడతా. నన్ను ఎదురించి మాట్లాడితే కాళ్లు విరక్కొడతా.. నా తోక తొక్కితే కత్తి కడుపులో దింపుతా.. అది నా టెంపర్. ఈ రోజు ఈ ఇంట్లో ఒకరు నేను చెప్పినట్లు వినలే.. నచ్చనట్లు మాట్లాడారు. ఎదురు తిరిగారు. పోనీలే పాపం అని విడిచేశా. మారనీకి అవకాశం ఇద్దామని వదిలేశా అది ఎవరో తెలుసా.. నువ్వే(సత్య).. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: జీవితంలో ఎవరూ తనని మధుని వేరు చేయలేరన్న మహా.. బ్యాచ్ మొత్తాన్ని పస్తులుంచిన సీత!