Seethe Ramudi Katnam Today Episode అర్చన, గిరిధర్, ప్రీతి కొరడాతో సాంబను చితక్కొట్టేస్తారు. మధు సీత వాళ్లు వచ్చి ప్రశ్నించడంతో అది ఆట అని కవర్ చేస్తారు. దీంతో సీత కూడా నేను ఆడుతాను అని వంతులు వేసి మరి అర్చన, గరిధర్, ప్రీతిలను చితక్కొడుతుంది. అక్కడితో ఆగకుండా మీరు ఆడుకోండి అని చలపతికి కొరడా ఇస్తుంది. దీంతో చలపతి కూడా చితక్కొడతాడు. సీత, రేవతి, చలపతి నవ్వుకుంటారు.
సీత: ఆట అయిపోయింది అక్క ఇక నువ్వు వెళ్లొచ్చు.
సాంబ: చాలా థ్యాంక్స్ సీతమ్మ నన్ను కాపాడారు.
సీత: నీ తప్పు ఏం లేదు కాబట్టి నిన్ను కాపాడాను సాంబన్న.
అర్చన: వాళ్లు మళ్లీ సాంబ జోలికి రారు.
సాంబ: ఈ రోజు చేసిన తప్పు మళ్లీ ఎప్పుడు రాను అమ్మ.
సీత: ఇది నీ తప్పు కాదు సాంబ మా అక్క తప్పు.
అర్చన: వాళ్లతో నువ్వు ఆడిన ఆట మహా చూసుంటే బాగున్ను.
సీత: ఆడుతా ఏదో ఒక రోజు మహా అత్తయ్యతో ఈ ఆట ఆడుతా..
మధు హాస్పిటల్లో తన తల్లి మాటలు తలచుకొని బాధ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి మహాలక్ష్మి, అర్చన వాళ్లు వస్తారు. వాళ్లు మధుతో మాట్లాడటం సీత చూస్తుంది.
మహాలక్ష్మి: నువ్వు మళ్లీ ఇలా మాముందు ఉంటావని అనుకోలేదు మధు. నేను జనా ముంబయిలో ఓ ఇంపార్ట్ంట్ మీటింగ్‌లో ఉన్నప్పుడు నీ గురించి తెలిసింది. ఒక్క క్షణం మా గుండె ఆగిపోయినట్లు అనిపించింది. ప్రపంచం ఆగినట్లు అనిపించింది.
సీత: తనలో తాను.. ఏం నటిస్తున్నావ్ అత్తయ్య నువ్వు మహాలక్ష్మివి కాదు మహా నటివి.
జనార్థన్: అంతకు ముందే నీ గురించి మేం చాలా మాట్లాడుకున్నాం మధు. నీ ఫ్యూచర్ గురించి మధు చాలా ప్లాన్స్ వేసింది.
మహాలక్ష్మి: వాటిని ప్లాన్స్ అనే కంటే నా కలలు అనొచ్చు మధు. నీకు ఏమైనా అయి ఉంటే నా కలలు అన్నీ మాయం అయ్యేవి.
సీత: ఇలా చెప్పే మా అక్కని మాయ చేస్తున్నారు.
గిరిధర్: నీకోసం మేం ప్రాణాలు అయినా ఇస్తాం మధు.
మహాలక్ష్మి: నీ కోసం నేను మొక్కని దేవుడు లేడు.. అందరి దేవుళ్లకి మా మధుని కాపాడండి అని దండం పెట్టుకున్నారు. ముంబాయి నుంచి హైదరాబాద్ వచ్చి నిన్ను చూసే వరకు నా మనసు కుదుటపడలేదు. మమల్ని వదిలి ఎలా వెళ్లిపోవాలి అనుకున్నావ్ మధు.
జనార్థన్: నీకు ఏమైనా జరిగి ఉంటే మా పరిస్థితి ఏంటి మధు.
మధు: సారీ అండీ మీ అందర్ని నేను చాలా బాధపెట్టాను. మీ అందరి ప్రేమ చూస్తుంటే నేను చనిపోయి ఉంటే చాలా నష్టపోయేదాన్ని అనిపిస్తుంది.
సీత: వీళ్లు నీ గురించి ఆలోచించడం లేదు అక్క నటిస్తున్నారు.
మహాలక్ష్మి: నువ్వు చనిపోతే నష్టపోయేది నువ్వు కాదు మధు మేం. ఇంకెప్పుడూ ఇలా చేయను అని నాకు మాట ఇవ్వు మధు. మమల్ని వదిలి కాదు ఈ ఇంటి నుంచి కూడా వెళ్లను అని నాకు ప్రమాణం చేయు.. మధు మహా చేతిలో చేయి వేసి.. మాటిస్తున్నాను అండీ మిమల్ని కాదు అని నేను ఏమీ చేయను అంటుంది. దీంతో మహా థ్యాంక్యూ మధు ఇక నిన్ను నన్ను ఆ దేవుడు కూడా వేరు చేయలేడు. నీ కోసం ఎంతో గొప్ప జీవితం ఎదురు చూస్తుంది.
సీత: మా అక్కని ఇలాగే ట్రాప్ చేస్తున్నారు మీ సంగతి చూస్తాను.
అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు కూర్చొంటారు. మహా, జనా కూడా వస్తారు. అని ఇష్టమైన ఇంటలు చేయించాను అని చక్కగా తినాలి అని మహా అంటుంది. రామ్, మధుమితలను పిలుస్తుంది. వాళ్లు కూడా కూర్చొంటారు. రాజ్యం అందరికీ వడ్డిస్తుంది. ఇంతలో సీత వచ్చి ఆగండి అంటుంది.
సీత: మర్చిపోయారా అత్తయ్య మా అక్క ఆరోగ్యం బాగుండాలి అని మొక్కుకున్నారు కదా..
మహాలక్ష్మి: అవును నేనే కాదు జనా, అర్చన, గిరిధర్, ప్రీతీ మేం అందరం కూడా మొక్కుకున్నాం.
అర్చన: అవును అయితే ఏంటి ఇప్పుడు.
సీత: మీ అందరూ మా అక్కపై అంత ప్రేమ చూపించారు కాబట్టే మా అక్కకి మీరంతా చాలా ఇష్టం. మీ ఆశీర్వాదేలా మా అక్కకు ఆరోగ్యం. మా అక్క మీద ఇంత ప్రేమ చూపిస్తున్న మీరు దేవుడి మొక్క చెల్లించకపోతే అపచారం కదా. దేవుడి మొక్క చెల్లించకుండా మీరు అన్నం తింటే మా అక్కకి అన్యాయం కదా.. రేపు గుడికి వెళ్తారు ఓకే మరి ఈ రోజు పరిస్థితి ఏంటి. మా అక్క ప్రాణాలతో భయపట పడితే ఉపవాసం ఉంటానని మా అత్తయ్య మొక్కుకున్నారు కదా..
రామ్: నిజమా పిన్ని మీరు అలా మొక్కుకున్నారా..
సీత: నిజమండి అత్తయ్య పస్తులు ఉండి అయినా సరే అక్క ప్రాణాలు నిలబెట్టాలి అనుకున్నారు.
మహాలక్ష్మి: మనసులో.. నన్నే ఇరికించావ్ కదే..
మధు: నా గురించి మీరు ఇంత గొప్పగా ఆలోచించారా.. మీరు గ్రేట్ అండీ.. నా కోసం మీరు ఈ రోజు ఉపవాసం ఉంటారా..
రామ్: అవును మధు గారు నేను మొదటి నుంచి చెప్తున్నా కదా మా పిన్ని మీ విషయంలో చాలా కేర్ తీసుకుంటుంది అని.
సీత: అది మామూలు కేరా అండీ స్పెషల్ కేర్.
సీత చేసిన పనికి మహాతో పాటు అందరూ తిండి నుంచి లేచేస్తారు. మరోసారి మధు జీవితాంతం మిమల్ని గుర్తుపెట్టుకుంటానని థ్యాంక్స్ చెప్తుంది. సీత తినడానికి కూర్చొంటుంది. వాళ్లని ఏడ్పించడానికి లొట్టలేసుకొని తింటుంది. మహాతో పాటు అందరూ ఆకలితో చావాలా అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.