Krishna Mukunda Murari Today Episode  భవాని ఇంట్లో అందరూ హోళీ అడటానికి వైట్ డ్రెస్‌లు వేసుకొని రెడీ అవుతారు. ఇక కృష్ణ రెడీ అవుతూ మురారి, ఆదర్శ్ కలిసిపోవడాన్ని గుర్తు చేసుకుంటుంది. తన మీద ఎందుకు కోపంగా ఉన్నాడా అని ఆలోచిస్తుంది. ఇంతలో మురారి వచ్చి తనకు చాలా హ్యాపీగా ఉందని అంటాడు. దానికి కృష్ణ ఆదర్శ్ నిజంగానే మారాడా ఏసీపీ సార్ అని అడుగుతుంది. ఆ అనుమానం ఎందుకు వచ్చిందని మురారి అడిగితే.. నా మీద కోపంగా ఉన్నాడు అని బుంగమూతి పెట్టుకుంటుంది. 


మురారి: ఇప్పుడే కదా మారాడు. ఇంకాస్త టైంలో నీ మీద కూడా మంచి అభిప్రాయం వస్తుంది. 
కృష్ణ: లేదు ఏసీపీ సార్ మీద ఉన్న సంతోషంలో నా మీద ఉన్న కోపం కనిపించలేదు అనుకుంటా..
మురారి: లేదు కృష్ణ. ఉంటే మన ఇద్దరి మీద కోపం ఉంటుంది. లేదంటే మన ఇద్దరి మీద ప్రేమ ఉంటుంది. అంతేకానీ ఒకరి మీద కోపం మరొకరి మీద ఇష్టం ఉండే ఛాన్సే లేదు.
కృష్ణ: ఆదర్శ్ ఎప్పుడు ఎలా మారుతున్నాడో ఊహించడం కష్టంగా ఉంది ఏసీపీ సార్.
మురారి: కృష్ణ ఆదర్శ్‌ మారాడు అని అందరూ సంతోషంగా ఉన్నారు. మీరు లేని పోని వాటిని ఆలోచించి మూడ్ పాడు చేయకుండా పండగ ఎంజాయ్ చెయ్. 


ఇక కృష్ణ ఆ రౌడీ గుర్తున్నాడా అని మురానిని ప్రశ్నిస్తుంది. మురారి గుర్తులేడు అంటాడు. వాడి మీద ఓ కన్నేసి ఉంచమని చెప్తుంది కృష్ణ. ఇంతలో మధు హడావుడి మొదలు పెడతాడు. ఇక రజినీ తన కూతురుకి ఆదర్శ్‌తో రాసుకొని పూసుకొని తిరగమని అంటుంది. ఇక మధు కూడా సంగీతని చూసి ఈ రంగుల పండగతో తన జీవితంలో రంగులమయం చేసుకోవాలి అనుకుంటాడు. మరోవైపు ఆదర్శ్‌ రెడీ అయి బయటకు వస్తే ఎదురుగా ముకుంద(మీరా) వైట్ డ్రస్‌లో కనిపిస్తుంది. ఆదర్శ్‌ అలా చూస్తు దగ్గరకు వెళ్తాడు.


ముకుంద: ఆదర్శ్‌ ఏంటి నన్ను తినేసేలా చూస్తున్నాడు. రూపం మార్చుకున్నా నా మీద ఇంకా మోజు పోయినట్లు లేదు. తొందరగా ఆదర్శ్‌కి సంగీతను అంటగట్టేయాలి. లేదంటే కథ మళ్లీ మొదటికి వస్తుంది. ఆదర్శ్‌తో వెళ్దామా..
రజిని: అమ్మో వీళ్లిద్దరూ ఇలా కలిసి వస్తున్నారు ఏంటి. దీని వాలకం చూస్తుంటే నా కూతురుకి ఎసరు పెట్టేలా ఉందే..


ఇక అందరూ హోళీ మొదలు పెడతారు. కృష్ణ చుడీదార్ వేసుకొని నడుముకి చున్నీ చుట్టు కోవడంతో మురారి సెటైర్లు వేస్తాడు. ఇక కృష్ణ మురారి మీద రంగు వేస్తుంది. మురారి కృష్ణ వెనక పరుగులు తీస్తాడు. వాళ్లని చూసిన ముకుంద వీళ్లిద్దరిని ఎలా అయినా విడగొట్టాలి అప్పుడే నాకు నిజమైన హోళీ అనుకుంటుంది. ఇక మధు భవానికి కలర్స్ పూస్తే.. భవాని రేవతికి పూస్తుంది. 


కృష్ణ, మురారి, ఆదర్శ్‌, సంగీతలు పరుగులు తీస్తుంటే ముకుంద కలర్ తీసుకొని మురారి మీద వేయబోతుంది. అప్పుడు ఆ కలర్ ఆదర్శ్‌ మీద పడుతుంది. అందరూ షాక్ అవుతారు. ఆదర్శ్‌ రొమాంటిక్‌గా ఫీలయ్యి.. ముకుందకు రంగు పూస్తాడు. ఇక మురారి కృష్ణకు రంగు పూస్తాడు. రజిని ముకుంద వైపు సీరియస్‌గా చూస్తుంది. ఆదర్శ్‌ తనకు రంగులు పూస్తుంటే తప్పుగా అర్థం చేసుకుంటుంది అని అనుకుంటుంది. ఇక మధు సంగీతకు రంగులు పూస్తాడు. 


మురారి కృష్ణ వెంట పడుతూ ముకుంద మీద రంగు వేసేస్తాడు. ముకుంద కూడా సంతోషంగా మురారి ముఖానికి రంగులు పూస్తుంది. మురారి నవ్వుకుంటూ వెళ్లిపోతుంటే చేయి పట్టి ఆపి మళ్లీ రంగు పూస్తుంది. కృష్ణ, మురారి షాక్ అవుతారు. ఇంతలో ఆదర్శ్‌ వచ్చి ముకుందకు కలర్ పూసేస్తాడు. అందరూ అలసి పోయి ఓ చోట కూర్చొంటారు. 


ఆదర్శ్‌: థ్యాంక్యూ ముకుంద నీ సంతోషం అంతా నీ వల్లే. నువ్వు నా మీద రంగులు పూయగానే నా మనసు హరివిల్లులా మారిపోయింది. థ్యాంక్స్.
ముకుంద: మనసులో.. ఖర్మరా బాబు ఈ ఆదర్శ్‌ మళ్లీ నాకే కనెక్ట్ అవుతున్నాడు. తొందరగా డైవర్ట్ చేయాలి. 


కృష్ణ మీరా మురారి మీద రంగులు పూసిన సంఘటన గుర్తు చేసుకోని ఆలోచిస్తూ ఉంటుంది. మురారి పిలిచినా పట్టించుకోదు. మురారి కారణం అడుగుతాడు. దీంతో కృష్ణ మీరా గురించి ఆలోచిస్తున్నా అంటుంది. దీంతో మురారి మీరా కాదు ముకుంద అంటాడు. ముకుంద అని పిలవడం తన వల్ల కాదు అని మీరా ప్రవర్తన బాలేదు అనిపిస్తుంది అని కృష్ణ అంటుంది. మెచ్చూరిటీ లేకుండా అలా ప్రవర్తిస్తుందా లేక ఏమైనా ఉందా అని అనుమానిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: ఇంటి దొంగని పట్టిచ్చిన హనుమాన్ వాలా.. చెల్లిని కనిపెట్టే ఇంట్లో అడుగుపెడతానని శపథం చేసిన లలితాదేవి!