Trinayani Today Episode విశాల్ ఇంట్లో 41 రోజుల హనుమాన్ వాలా పూజ పూర్తి చేసి ఉగాది పూజ ప్రారంభిస్తారు. ఇక హనుమాన్ వాలా పూజను పూర్తి చేసిన నయని కోరిక నెరవేరుతుంది అని డమ్మక్క అంటుంది. దాంతో హాసిని నయనికి ఒకే ఒక్క కోరిక ఉంటుంది. అది కేవలం పునర్జన్మ ఎత్తిన గాయత్రీ అత్తయ్య కనిపించడమే అంటుంది. నయన అవును అక్క అంటుంది. దానికి విశాల్ వద్దు నయని అంటాడు.


విశాల్: నయని ఇప్పుడు ఆ కోరిక కోరడం వల్ల అర్థం, అవసరం రెండూ లేవు. 
లలితాదేవి: అలా ఎందుకు అంటున్నావ్ విశాల్. మా చెల్లి గాయత్రీ దేవి పునర్జన్మ ఎత్తి ఏడాదిన్నర అవుతుంది. ఇంకా ఇంట అడుగుపెట్టలేదని మేం కలవర పడుతుంటే అలా కోరుకోవద్దు అంటున్నావ్.
విశాల్: పెద్దమ్మ అమ్మ నాగులావరం నాగలక్ష్మి గుడి దగ్గర దాచి పెట్టిన నగలన్నీ కోడలకు చేరాలి అని మీరు తీసుకొచ్చి ఇచ్చారు. వాటిని నయని భద్రంగా దాచినప్పటికీ ఎవరో దొంగిలించారు. ముందు ఆ నగలు దొరికి దొంగ ఎవరో తేలాలి అని ఆంజనేయ స్వామిని కోరుకోమని నా ఉద్దేశం. నయనిని కూడా అదే కోరుకోమంటున్నాను.
పావనా: బాగా చెప్పావ్ అల్లుడు.
డమ్మక్క: చెప్పడం ఏమో కానీ విశాల్ బాబు ఇరాకాటంలో పడేశాడు.
గురువుగారు: నయని విశాల్ మాటలు తప్పకుండా కోరడం అయితే కోరుతుంది. ముందు ఉగాది పచ్చడి స్వీకరించండి అమ్మా..
లలితాదేవి: స్వామి వారు ఇంటి దొంగను పట్టిచ్చేలోపే మర్యాదగా నగలు తెచ్చి ఇస్తే మంచిది. అయితే మీలో ఏ ఒక్కరూ నగలు తీయలేదన్నమాట. మంచిది. అయితే తర్వాత దొరికి పోయారంటే మాత్రం మీరే బాధ పడతారు.
విక్రాంత్: లాస్ట్ ఛాన్స్ సుమన.
సుమన: నన్ను అంటారేంటి..
విశాల్: నయని స్వామి వారిని కోరుకో ఆ దొంగ ఎవరో ఆయనే పట్టిస్తారు. 


నయని కోరుకోగానే పెద్ద గాలి వీస్తుంది. హనుమాన్ వాలం(తోక) దొంగను పట్టిస్తుందని గురువుగారు అంటారు. గురువుగారు అలా అనగానే ఫొటోలోని తోక చాలా పెద్దగా మారి బయటకు వెళ్తూ నయనిని చుట్టేస్తుంది. నయని దొంగ అని హనుమాన్ తేల్చేస్తారు. అందరూ షాక్ అయిపోతారు. వెంటనే తోక మాయం అయిపోతుంది.


సుమన: ఆ దొంగవి నువ్వేనా అక్క..
హాసిని: చెల్లి.. నువ్వే దాచి పెట్టి నగలు కనిపించడం లేదు అని ఎందుకు అన్నావ్.
సుమన: అవి పోయావి అంటే ఇంకా కొన్ని తీసుకొస్తారు అనుకుందేమో..
లలితాదేవి: ఆగండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి. నయని నగలు ఎక్కడ పెట్టావమ్మా.


నయని గాయత్రీ దేవి ఫోటో వైపు చేయి చూపిస్తుంది. విశాల్ వెళ్లి ఫోట్ వెనుక చూస్తే నగల మూట కనిపిస్తుంది. విశాల్ తీసుకొని వస్తాడు. సుమన అక్కని దొంగ అంటే హాసిని, లలితాదేవి ఖండిస్తారు. 


నయని: గాయత్రీ దేవి గారి ఆస్తిని గాయత్రీ పాపకు రాసిచ్చినా మిమల్ని కన్న తల్లి రాలేదు బాబుగారు. గాయత్రీ అమ్మగారి నగలను పెద్దమ్మ గారు తీసుకొచ్చి ఇచ్చినా వాటి కోసం అయినా నేను కన్న తొలి బిడ్డ ఇంటికి వస్తుందని దాచి పెట్టాను అమ్మగారు. 
లలితదేవి: నయనిని దగ్గరకు తీసుకొని నీ గుండెల్లో బాధని చూడకుండా నీ గుండెల మీద నగలు చూడాలి అనుకున్నాను సారీ అమ్మ. ఈ సారి వాళ్లు వీళ్ల చెప్పడం కాదు నేను నా చెల్లిని తీసుకొనే ఈ ఇంటికి వస్తాను. మాటిస్తున్నాను. 


తిలోత్తమ లగేజ్‌ తీసుకొని ఇంటికి వస్తుంది. రావడం రావడమే వల్లభ, హాసిని తింగరి పనికి ముగ్గురు కింద పడతారు. వాళ్లని లేపడానికి వెళ్లి పావనా మూర్తి కూడా కింద పడతాడు. అందర్ని నయని లేపుతుంది. ఇక నయని అత్త తిలోత్తమకు ఉగాది పచ్చడి ఇస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


 Also Read: దిల్ రాజు: ట్రోలర్స్‌కు టార్గెట్ అవుతున్న స్టార్ ప్రొడ్యూసర్.. ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటే బెటరేమో!