Nindu Noorella Saavasam Today Episode: అమ్మలేదని, మిస్సమ్మ ఉన్నా బాగుంటుంది అని, పిల్లలు బాధపడుతూ ఉంటారు. ఇంతలో చిత్రగుప్త భాగ్య ఇంటికి వస్తాడు. భాగ్యాలోకి దూరిన అరుంధతి బయటకు వచ్చి పెళ్లికి వెళ్తున్నాను అని చెబుతుంది.
చిత్రగుప్త: బాలిక ఆగుము బాలిక
అరుంధతి: గుప్తా గారు నేను వెళ్ళాలి జరగండి.
చిత్రగుప్త: లేదు బాలిక నువ్వు చాలా పెద్ద తప్పు చేయుచున్నావు, నేను నిన్ను వెళ్ళ నివ్వను. మీ ప్రాణం పోయి నీ బంధము వీటి ఇన్ని దినములు అయినది ఇంకా ఎందుకు బాధపడుతుంటివి.. ఎందుకు ఏమి కోరి కష్టములను తెచ్చుకుంటున్నావు. చూడు బాలిక జరిగినది చూచుట తప్ప మరి ఏమి చేయనని మాకు మాట ఇచ్చావు. గుర్తుందా? ఇప్పుడు ఇలా చేయడం సబబు కాదు.
అరుంధతి: నన్ను మన్నించండి గుప్తా గారు . నా కుటుంబాన్ని కాపాడుకోవాలంటే ఇది తప్ప వేరే మార్గము కనిపించట్లేదు ఇంకొద్ది సేపట్లో గడియలు ముగియపోతున్నాయి.. ఆ తర్వాత నేను ఏమి చేసినా నేను ఎంత బతిమిలాడినా మీరు ఇక్కడ ఉంచారని నాకు తెలుసు . చనిపోయాక కూడా ఇక్కడే ఉంటే ఆడజన్మకు కావాల్సిన బాధను మూట కట్టుకుంటున్నాను అన్నారు కదా. అంటే నా పిల్లల్ని నా కుటుంబాన్ని ఈ పరిస్థితుల్లో వదిలేస్తే అంతకన్నా బాధని మూటకట్టుకొని వెళ్తాను గుప్తా గారు. నా జీవితమంతా ఇచ్చినదాంతో తృప్తి పడటం అలవాటైపోయిన దానిలో. మొదటిసారి నాకు కావలసిన దానికోసం పోరాడుతున్నాను గుప్తా గారు. దయచేసి నన్ను ఆపకండి. అనాధగా పుట్టడం అదే నా తలరాత.. నా పిల్లలు కూడా పడతారంటే నేను చూస్తూ ఊరుకోలేను ఎందుకంటే ఒక అనాధగా ఉండడం అంటే రోజు చస్తూ బతకడం గుప్తా గారు. ఆ చావు బతుకులు గురించి నా కన్నా ఇంకా ఎవరికీ బాగా తెలియదు.
చిత్రగుప్త: అయినను నీవు ఎక్కువ సమయం ఈ బాలిక శరీరంలో ఉండటం మంచిది కాదు.
అరుంధతి: నేను అనుకున్నది అయిపోయిన వెంటనే బయటికి వచ్చేస్తా గుప్తా గారు
చిత్రగుప్త: ఈరోజు 11:15 నిమిషాలకు పౌర్ణమి ఘడియలు ముగియనున్నాయి. అటు పిమ్మట నీవు ఎట్టి పరిస్థితులలో ఉన్నను. బాలిక శరీరమును వదిలి బయటకు రావలెను. ఈ సారికి పెళ్లి ని ఆపెదవు. మరల తనని వివాహం చేసుకొనదని ఏమీ హామీ ఉన్నది.
అరుంధతి: ప్రయత్నించకుండా ఉండేలా, ప్రయత్నించినా ప్రయోజనం ఉండకుండా ఉండేలాగా చేయబోతున్నాను గుప్తా గారు. మనోహరి అనే సమస్యకి శాశ్వత పరిష్కారమే ఇవ్వబోతున్నాను గుప్తా గారు
అమర్ అడ్రస్ తెలుసుకుని వచ్చిన బీహార్ గ్యాంగ్ కూడా అక్కడ మనోహరి కి ఈరోజు పెళ్లి అని తెలుసుకుంటాడు. మిలిటరీలో ఆనందంగా, చక్కగా ఉండే నా కొడుకు లైఫ్ ఇలా చాలా బాధగా అయిపోయిందని అమరేందర్ తండ్రి ఫీలవుతున్నప్పుడు, మనోహరీ అమర్ లైఫ్ ని మార్చుతుందేమో అని సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది అమరేంద్ర తల్లి.
పిల్లల కోసం రాథోడ్ కి ఫోన్ చేస్తాడు అమర్ తండ్రి. పిల్లలు రారు, వాళ్లకి పెళ్లి ఇష్టం లేదని చెబుతూ మిస్సమ్మ వస్తున్నది అని చెబుతాడు. ఎందుకు వస్తున్నాదో కనుక్కొని చెప్తాను అని అంటాడు. మిస్సమ్మ రూపంలో వచ్చిన అరుంధతి ఇంట్లో చిన్నపిల్లలందరినీ దగ్గరికి తీసుకుంటుంది. వాళ్లకి చిన్న కథ ఒక చిన్న పాప ఎలా గెలిచిందో చెప్పి మళ్ళీ వాళ్ళు సంతోషపడేలా చేస్తుంది.