Nindu Noorella Saavasam Today Episode: చాలా ఆనందంగా మనోహరి, బాధలో అమరేంద్ర ఇద్దరూ వేర్వేరు కార్లలో పెళ్లికి వెళ్తున్నప్పుడు వెనుక నుండి ఫాలో అవుతున్న నిన్ను వెతుక్కుంటూ వస్తున్నఅంటూ అని చెప్పి తన చేతిలో ఉన్న మనోహరి ఫోటోని నలిపేసి రోడ్డు మీద పడేస్తాడు. 


ఇంట్లో భాగ్య , వాళ్ళ నాన్న కలిసి బాధపడుతూ ఉంటే అక్కడికి మంగళ  నానా మాటలు అంటుంది. కోపంతో భాగ్య వాళ్ళ నాన్న లేచి భార్యకి ఎదురు తిరుగుతాడు. అవును ఇవన్నీ తప్పే.. పని కోసం వెళ్తే పని చేసుకుని రావాలి గాని ఈ లొళ్ళంతా ఏందయ్యా అని అడుగుతుంది. మంగళ నీకేమీ తెలియదు అని భాగ్య వాళ్ళ తండ్రి .. ఇప్పుడు కూతురికి ఉద్యోగం లేదు నెల రోజుల్లో మన బతుకులు రోడ్డు మీద పడిపోతాయని చెబుతుంది. దీంతో తానే ఉద్యోగానికి వెళతానంటాడు తండ్రి.


పిన్ని మాటలకు భాగ్య ఆవేశంతో బాధతో  నోరు విప్పుతుంది. కష్టాల్లో సాయం చేసిన వాళ్లు ఎటు పోతే నాకేంటిలే అని అనుకోవటం చాలా పెద్ద తప్పు అంటుంది. మన అనుకున్న వ్యక్తి  సమస్యల్లో మనకి అండగా నిలబడ్డ వ్యక్తి కి జీవితమే సమస్య కాబోతోంది అని తెలిసినా కూడా ఏమీ చేయలేని నిస్సహాయులై ఉన్నాం కదా... అందుకు నాకు బాధగా ఉంది నాన్న అని ఏడుస్తూ అంటుంది. నావల్లే ఏడ్చింది అని అనుకున్న మంగళ మెల్లిగా జారిపోబోతుంటే.. భాగ్య వాళ్ళ నాన్న గట్టిగా కొట్టి పెళ్ళికి వెళ్లాలనుకుంటే అటు నుండి అటే వెళ్ళిపో మళ్లీ ఇటు రావద్దు... గడప దాటి బయటికి అడుగు పెట్టావంటే చంపుతా అని గట్టిగా బెదిరిస్తాడు... 


ఒక మూర్ఖుని కోపం కంటే ఒక మంచి వాని మౌనం ప్రమాదకరమైన అని మా పితృ దేవుడు చెప్పితిరి అని.. ఈ బాలిక మౌనము అంత మంచిది కాదు.. ఆ మౌనం నుండి వచ్చే ఆలోచన కచ్చితంగా ప్రమాదమునకు దారి తీయని గ్రహించి చిత్రగుప్తుడు ఆ తప్పు జరగక ముందే బాలికను తీసుకొని వెళ్ళవలెనని నిశ్చయించుకుంటాడు. 


చిత్రగుప్తుడు: బాలిక బాలిక ...


అరుంధతి: చెప్పండి గుప్త గారు ...


చిత్రగుప్తుడు: మనమిక బయలుదేరుదము..


అరుంధతి: పెళ్లయ్యే వరకు ఇక్కడే ఉందామన్నారు కదా గుప్తా గారు..


చిత్రగుప్తుడు: అంటిని కానీ చూస్తుంటే నాకు భయంగా ఉన్నది బాలిక..


అరుంధతి: మీలాంటి దేవుళ్ళు నాలాంటి మామూలు వాళ్ళని చూసి భయపడుతున్నారంటే నవ్వొస్తుంది గుప్తా గారు 


చిత్రగుప్తుడు: తన పతి దేవుని ప్రాణము కొరకు సాక్షాత్తు యమధర్మరాజులు వారితో పోరాడిపోట్లాడి తన పతి ప్రాణములను సాధించుకున్న సావిత్రి కూడా మామూలు మనిషియే బాలిక  మనిషి మనస్ఫూర్తిగా ఏదైనా చేయదలచినచో ఆపుట ఏ శక్తి తరము కాదని చాలా సందర్భములలో రుజువైనది... అందున నీవు కన్నతల్లివి.. నీ బిడ్డల క్షేమం కోసం ఏమి చేయుటకైనను నీవు వెనకాడవు.. 


అక్కడ కళ్యాణ మండపం దగ్గర  మనోహరి  చాలా సంతోషంగా  కారు దిగగా  అమరేంద్ర మాత్రం కారులోనే ఆలోచిస్తూ కూర్చుంటాడు...దీంతో మనోహరి  వెళ్లి అమరేంద్రని  దిగమని చెబుతుంది. అమరేంద్ర కిందకి దిగిన తర్వాత ఎదురుగా ఒక పెద్ద ఫ్లెక్సీ చూసి చాలా కోప్పడతాడు. ఆ ఫ్లెక్సీ లో చాలా పెద్ద తప్పు ఉంది. కానీ అది తప్పని తెలుసుకునే లోగా చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది అని బాధపడుతూ ఉంటాడు. పెళ్ళికొడుకు ఒక్కడే లోపలికి వెళుతుంటే పూజారి వచ్చి హారతి ఇచ్చి లోపలికి పంపిస్తాడు.. మంగళ వాయిద్యాలతో పెళ్ళికొడుకుని పెళ్లికూతురుని లోపలికి పట్టుకెళ్తూ ఉంటారు. పంతులు గారితో ఎంత వేగంగా కుదిరితే అంత వేగంగా ముహూర్తం ఫిక్స్ చేయమని చెబుతుంది  


అరుంధతి ఇంట్లో చిన్న పిల్లలందరూ చాలా బాధపడుతూ  ఏడుస్తూ ఉంటారు. అక్కడికి అరుంధతి వస్తుంది. మనకి భజంత్రీలు వినిపించట్లేదంటే నాన్న వాళ్ళు వెళ్ళిపోయారు కదా.. నాకు చాలా బాధగా ఉంది. అని మాట్లాడుకుంటుంటారు.  పిల్లల మాటలకి  చిత్రగుప్తుడు, అరుంధతి అందరూ బాధపడి ఏడుస్తూ ఉంటారు. తమని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు కదా అని దిగలుగా ఉంటారు పిల్లలు. 


ఇంతకీ ఉత్సాహంగా పెళ్లికి అని రెడీ అయిన మనోహరి ఏమి చేసింది...
అరుంధతి చిత్రగుప్తుడు ఏం నిర్ణయించుకున్నారు ...
చిన్న పిల్లలు వాళ్ళ నాన్న పెళ్లి చూడ్డానికి వెళ్ళారా లేదా అని తెలుసుకోవాలి అంటే రేపటి వరకు వేచి ఉండాల్సిందే..


Also Read: బిడ్డను బిర్యానీ చేసి ఊళ్లోవాళ్లకు విందుగా పెడితే? ఈ మూవీ పెద్దలకు మాత్రమే.. పిల్లలతో అస్సలు చూడలేరు