Naga Panchami Today Episode: నాగేశ్వరి నాగదేవతని ప్రార్థించగా నాగదేవత ప్రత్యక్షమవుతుంది. నాగేశ్వరి ఒంటి మీద గాయాలు చూసిన నాగదేవత ప్రశ్నిస్తుంది. దీంతో నాగేశ్వరి ఫణేంద్ర పూర్తిగా మారిపోయి తన ప్రయత్నాలకు అడ్డు తగిలి తనని గాయ పరిచాడని చెప్తుంది. దీంతో నాగదేవత తన శక్తితో నాగేశ్వరి గాయాలు అన్నీ మానేలా చేస్తుంది.


నాగదేవత: నీ పోరాటం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది నాగేశ్వరి. నువ్వు పంచమికి రక్షణగా ఉండి.. తన కడుపులో పెరుగుతున్న మహారాణి విశాలాక్షిని నువ్వే దగ్గరుండి నాగలోకం తీసుకురావాలి విశాలాక్షి. 
విశాలాక్షి: నా ప్రయత్న లోపం ఉండదు మాత. కానీ ఆ ఫణేంద్ర కారణంగా నాకు ఆటంక లోపం కలుగుతుంది. తమరే ఆ ఫణేంద్రను కట్టడి చేయాలి. 
నాగదేవత: ఫణేంద్రను రప్పించి.. నువ్వు నీ హద్దులు దాటావు ఫణేంద్ర మన నాగలోకం నియమావళిని నువ్వు పాటించడం లేదు. నేను ఎంతగా ఎదురు చూసినా నీలో మార్పు రావడం లేదు.
ఫణేంద్ర: అలా ఏం లేదు మాతా. మన నాగలోకాన్ని మోసం చేసిన ఆ పంచమిని శిక్షించడం ఏ మాత్రం లేదు.
నాగదేవత: తప్పు ఒప్పులు నిర్ణయించే అధికారం నీకు లేదు ఫణేంద్ర. నువ్వు నాతో మాట్లాడే అర్హత కోల్పోయావు. ఈ క్షణం నుంచి నీలో నాగ శక్తులు పనిచేయవు. 
ఫణేంద్ర:  మాతా నన్ను శపించకు. నాలో శక్తులు లేకుండా చేయకు.
నాగదేవత: ఇక నువ్వు ఎప్పటికీ నాగలోకం రాలేవు. ఒక సామాన్యుడిలా జీవితం సాగిస్తావు. వెళ్లిపో. ఇక నీకు ఫణేంద్ర అడ్డు రాడు నాగేశ్వరి.


మరోవైపు స్ఫృహ కోల్పోయిన గురువుగారిని శిష్యులు లేపుతారు. పంచమి కడుపులో బిడ్డ వల్ల ప్రమాదమని గురువుగారితో కరాళి చెప్పిస్తుంది. బిడ్డ ముఖం చూసిన వెంటనే తండ్రికి ప్రమాదం అని బిడ్డని ఉంచుకోవద్దు అని తొలగించమని ఆయన కరాళి ప్రయోగం వల్ల చెప్తాడు. ఇక తన వల్ల పొరపాటు జరిగింది అని ఆ బిడ్డ జాతకంలో ఎలాంటి తప్పు లేదు అని బిడ్డకు అపకారం తలపెట్టకు ముందే వెళ్లి నిజం చెప్పాలి అంటారు. నిజం చెప్తాను అని గురువుగారు బయల్దేరుతారు. 


ఇక జ్వాల, చిత్రలు పాములు తీసుకొచ్చామని భర్తలకు చెప్పడంతో వాళ్లు భార్యలను తిడతారు. పంచమి కంటే మీరే డేంజర్ అని తిడతారు. ఇక పాములు వాడికి పాములు ఇవ్వాలి అని లేదంటే పాతిక వేలు ఇవ్వాలని చెప్తారు. దీంతో భార్గవ్, వరుణ్‌లు భయపడతారు. ఇక చిత్ర బూర తెచ్చి ఊదుతాను అనగానే..జాగ్రత్తగా ఉండాలి అని భార్గవ్ వరుణ్‌లు కబోర్డ్‌లు ఎక్కి కూర్చొంటారు. చిత్ర బూర తీసుకొచ్చి ఊదుతుంది. అయినా పాములు రావు. దీంతో పాముల వాడు తన పాములు తనకు ఇమ్మని లేదంటే ఒక్కో పాముకి పాతిక వేలు ఇవ్వాలి అని చెప్తాడు. చిత్ర వాళ్లు ఇవ్వమని చెప్పడంతో పాములతో కాటు వేయించి చంపేస్తాను అని బెదిరిస్తాడు. ఇక పాముల వాడు ఇద్దరి దగ్గర రెండు రింగులు తీసుకొని వెళ్లిపోతాడు. మరోవైపు పంచమి వాళ్లు ఇంటికి వస్తారు.


వైదేహి: ఆగు మోక్ష మన గురువుగారు చెప్పింది విన్నావు కదా ఇక ఆలస్యం చేయకూడదు మోక్ష. 
మోక్ష: మేము అక్కడికి ఇష్టపడి రాలేదు. మీ కోసం అక్కడికి వచ్చాం. నాకు అలాంటి మాటల మీద నమ్మకం లేదు.
వైదేహి: అలా అంటే కుదరదు మోక్ష. పంచమి గర్భం తీయించుకోవాల్సిందే. మన గురువు గారు చాలా స్పష్టంగా చెప్పారండి. మోక్ష బిడ్డ వల్ల మోక్షకు ప్రమాదం అని.. ఆ బిడ్డ ముఖం మోక్ష చూసినా మోక్షకు ప్రాణ గండం అని. 
మోక్ష: నాకు నా బిడ్డ ముఖ్యం అమ్మ. ఆ బిడ్డ కోసం ఎంత దూరం అయినా వెళ్తాను.
రఘురాం: అమ్మా ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం ఉందో లేదో నువ్వు అడగలేదా..
వైదేహి: అలాంటి పరిష్కారం ఉండి ఉంటే ఆయనే చెప్పేవాళ్లు ఏం లేదు అని తిరిగి పంపించారు. 
జ్వాల: మేం మొదటి నుంచి చెప్తున్నాం అత్తయ్య గారు ఈ ఇంట్లో జరుగుతున్న చాలా విషయాలకు పంచమినే కారణం అని. ఇప్పుడు ఆ దోషాలు అన్నీ తన కడుపులో బిడ్డకు సంక్రమించి ఉంటాయి. 
చిత్ర: మీరు ఇంకేం ఆలోచించకండి అత్తయ్య మేం ఈ ఇంట్లో సంతోషంగా కాపురాలు చేసుకోవాలి అంటే ముందు ఆ దరిద్రాన్ని తీసేయండి. లేకపోతే ఆ ఎఫెక్ట్ మన అందరి మీద ఉంటుంది.
మోక్ష: మా బిడ్డ విషయంలో ఎవరి జోక్యాన్ని నేను ఒప్పుకోను. మంచో చెడో నేను నా భార్య భరిస్తాం. ఎవరు ఎన్ని చెప్పినా గర్భం తీయించడానికి నేను ఒప్పుకోను.
వైదేహి: ఒప్పుకొని తీరాలి మోక్ష. చూస్తూ చూస్తూ నిన్ను పోగొట్టుకోవడానికి నేను ఒప్పుకోను. ఒక్కరు చెప్తే ఏదో అనుకోవడానికి కానీ ఆ సోది ఆమె చెప్పింది. ఇప్పుడు మన గురువుగారు చెప్పారు. నమ్మకుండా ఎలా ఉంటాం.
మీనాక్షి: తొందర పడకు వదిన ఇప్పుడే వెళ్లొచ్చాం కదా కొంచెం టైం తీసుకుందాం.
వైదేహి: ఈ విషయంలో మీ అమ్మకు కడుపుకోత పెట్టకు మోక్ష. నా మాట విను.
మోక్ష: అమ్మా నీలాగే పంచమిది కూడా ఒక తల్లి హృదయం కదా అమ్మ. ఏదో జరుగుతుంది అని నువ్వు భయపడుతున్నావ్. కానీ తనకి తెలిసి తన కళ్ల ఎదుటే తన బిడ్డను చంపుకోవడానికి పంచమి ఎంత నరకయాతన అనుభవించాలో ఒకసారి ఆలోచించు అమ్మ.
వైదేహి: నువ్వు ఎన్ని చెప్పినా నాకు ఓదార్పు దొరకదు మోక్ష గర్భం తీయించాల్సిందే.. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: అత్తని అవమానించమని కూతురికి భైరవి సలహా.. పార్టీకి రమ్మని సత్యని బతిమాలిన క్రిష్!