Seethe Ramudi Katnam Today Episode  సీత తన చేతితో వంట చేసి అందరి కోసం భోజనం ఆఫీస్‌కు తీసుకెళ్తానని రేవతికి చెప్తుంది. అక్కడ  మహాతో పాటు అందరికీ చుక్కలు చూపిస్తాను అంటుంది. ఇక మహాలక్ష్మి ఆఫీస్‌లో మధు చేత దేవుడి ముందు దీపం పెట్టిమని అంటుంది. మధు దీపం వెలిగిస్తుంది.


మహాలక్ష్మి: ఈరోజు నుంచి నీ లైఫ్ మారిపోవాలి మధు. నీ గురించి నువ్వే నిర్ణయాలు తీసుకోవాలి. నిన్ను ఎవరూ శాసించకూడదు. నీ ఇష్టాలను కాదు అనకూడదు. నువ్వు స్వతంత్రంగా ఆలోచించి నీ మనసుకు ఏది మంచిది అనిపిస్తే అది చేయాలి. నీ జీవితం నీ చేతుల్లో ఉండాలి. మనల్ని కన్నారని తల్లిదండ్రులను, కలిసి పుట్టారని తోబుట్టువులను, కష్టాల్లో పాలు పంచుకున్నారని స్నేహితులను, కట్టుకున్నాడు అని భర్తను ప్రేమించాలి తప్పులేదు. కానీ అది ఎంత వరకు మన వ్యక్తత్వానికి భంగం కలగనంత వరకు మాత్రమే. మనల్ని అవమానించిన వారిని మనం ఎందుకు ప్రేమించాలి. మన క్యారెక్టర్‌ని కించపరిచిన వాళ్లని మనం ఎందుకు సహించాలి. మనల్ని వేలు ఎత్తి చూపించిన వాళ్ల ముందు ఎందుకు తల దించాలి. మనల్ని ద్వేషించిన వాళ్లని ఎందుకు ప్రేమించాలి. మనం బతికినన్నినాళ్లు మనకు నచ్చినట్లు ఆనందంగా సంతోషంగా జీవించాలి. నీకు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నీకు అంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. నీకు అంటూ ఇష్టాలు విలువలు ఉన్నాయి. గతాన్ని మర్చిపో ఏం చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావో అది చేయ్. ఏది నీ స్వేచ్ఛని బంధిస్తుందో దాన్ని తెంచుకో. ఆలోచించి నిర్ణయం తీసుకో. నీ అందమైన జీవితానికి అడ్డుగా.. నీ తల్లిదండ్రులు వచ్చినా, నీ చెల్లి వచ్చినా, ఆఖరికి నీ భర్త వచ్చినా అడ్డు తొలగించుకో. 
మధు: మహామాటలు బాగా ఆలోచించి.. సూర్యని తలచుకొని.. ఎస్ నా లైఫ్ నా ఇష్టం. అని మధు తన బ్యాగ్‌లో ఉన్న సూర్య తాను కలిసి ఉన్న ఫొటోని చింపేస్తుంది. అది మహా చాటుగా చూస్తుంది. నేను నిర్ణయించుకున్నా ఇక నేను ఫ్రీ బర్డ్‌ని.. 
మహాలక్ష్మి: ఇక మధునా కోడలే. సీతని ఇంట్లో నుంచి గెంటేయడం ఖాయం. 


మరోవైపు సీత అందరికీ సరిపడా అంత ఎక్కువ వంటలు చేసి క్యారేజీలో సర్దుతుంది. వాటిని ఆటోలో మహా ఆఫీస్‌కు తీసుకెళ్తుంది. మరోవైపు రామ్ మధులు కలిసి పని చేస్తుంటారు. వాళ్లని మహా బ్యాచ్‌ మొత్తం చూస్తారు. ఇక వాళ్లకోసం జ్యూస్ పంపిస్తుంది మహాలక్ష్మి. మధుకి బ్రైన్ వాష్ చేశానని సూర్య ఫొటో చింపేసిందని చెప్తుంది. మనకి గుడ్ టైం స్టార్ట్ అయిందని సీత బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని చెప్తుంది. రామ్ మధులను ఆఫీస్‌లోనే ఒకటి చేయాలని మహా చెప్తుంది. 


అర్చన: ఆఫీస్‌లో జరిగే విషయాలు సీతకు తెలుస్తాయేమో మహా.
మహాలక్ష్మి: ఎలా తెలుస్తాయి ఎవరు చెప్తారు.
గిరిధర్: చలపతి బావ చెప్తాడేమో వదిన. 
చలపతి: ఇదేంటి రామ్, మధులు పక్కపక్కన ఉన్నారు. ఈ విషయం  వెంటనే సీతకు చెప్పాలి. ఇక చలపతి సీతకు కాల్ చేసి చెప్తాడు. సీత వస్తున్నా అని చెప్తుంది. 


ఇక మహా అండ్ బ్యాచ్ రామ్, మధుమితల దగ్గరకు వెళ్తారు. మధు తనకు రామ్ బాగా అర్థమయ్యేలా చెప్పాడని మధు అంటుంది. ఇక లంచ్ టైం అయిందని అంటే రామ్ క్యాంటీన్‌కు వెళ్తానని అంటుంది. దీంతో మహా ఫుడ్ క్యాబిన్‌కే తీసుకొస్తా అంటుంది. మధు అడ్జస్ట్ అవుతా అంటే వద్దు అని మహా అంటుంది. 


మధు: నా గురించి మీ పిన్ని బాగా కేర్ తీసుకుంటున్నారు కదండి.
రామ్: అవును కానీ సీతకే ఆ విషయం అర్థం కాదు.
మధు: ఇప్పుడు ఇక్కడ సీత లేదు కదండి. రాదు కూడా. 


మహా ఫోన్ మాట్లాడుతూ.. సీసీ ఫుటేజ్‌లో సీత క్యారేజ్ తీసుకురావడం చూస్తుంది. సీత లోపలికి వస్తే రామ్, మధులను కలిసి భోజనం చేయనివ్వదు అని సీతని బయటే ఆపి ఇంటికి పంపించేయాలి అని అనుకుంటుంది. ఇక సెక్యూరిటీకీ కాల్ చేసి సీతని లోపలికి పంపించొద్దని అంటుంది. సెక్యూరిటీ లోపలికి వెళ్లొద్దని మహాలక్ష్మీ మేడం వద్దు అన్నారని అంటాడు. దీంతో సీత వెళ్లినట్లే సైడ్‌కి వెళ్తుంది. చలపతికి కాల్ చేసి రమ్మంటుంది. ఇక చలపతి సెక్యూరిటీని బయటకు పంపి సీతని లోపలకి పిలుస్తాడు.  దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: అత్తని అవమానించమని కూతురికి భైరవి సలహా.. పార్టీకి రమ్మని సత్యని బతిమాలిన క్రిష్!