Trinayani Today Episode గాయత్రీ పాప చేయిని తాకడం వల్లే తన తల్లికి షాక్ కొట్టిందని వల్లభ చెప్తాడు. నాయిల్ పాలీష్ ఫ్లేమబుల్ కాబట్టి పక్కనే హాసిని హారతి పల్లెం తిప్పడం వల్ల షాక్ కొట్టిందని నయని అంటుంది. ఇక వల్లభ ఏదైతే అది అయింది మరో సారి గాయత్రీ పాప చేయి పట్టుకోమని తల్లికి చెప్తాడు. దీంతో తిలోత్తమ తప ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని అంటుంది.


విక్రాంత్: మీ గురించి ఆలోచిస్తున్నారు కానీ చిన్న పిల్ల గురించి ఆలోచించడం లేదు.
సుమన: ఆ పిల్లకు ఏం కాలేదు లెండీ అత్తయ్యకే అయింది.  
విక్రాంత్: చిన్న మంటకే ఇలా అయిపోతున్నారు. గాయత్రీ పెద్దమ్మ చితి మీద ఉన్నప్పుడు గంధం చెక్కలతో పెట్టిన మంటకు పెద్దమ్మ ఎంత బాధ పడి ఉంటుంది. 
సుమన: చనిపోయిన తర్వాత కాలుస్తారు కదా కాలినట్లు తెలీదండి దానికి మీరు ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నారు.
విక్రాంత్: ఎందుకంటే పెద్దమ్మని..
విశాల్: రేయ్ విక్రాంత్ సమయం సందర్భం లేకుండా అమ్మ గురించి మాట్లాడి అందరి బుర్ర పాడు చేయకూడదురా. 


పావనా: హాసినమ్మా నీ సమయస్ఫూర్తికి హ్యాట్స్ ఆఫ్. లేదంటే తిలోత్తమ చేయి మొత్తానికి మంటలు వచ్చి గందరగోళం అయ్యేది.
హాసిని: చేతికి కాదు బాబాయ్ ఆవిడ చితికి రావాలి. మాటమాటికి చీరలు మార్చే ఆవిడకు గాయత్రీ అత్తయ్య చీరలే ఉరి కావాలి.
విశాల్: వదినా.. ఊరుకో ఎమోషనల్ అయి నువ్వు గట్టిగా మాట్లాడితే ఎవరైనా మాట్లాడుతారు.
నయని: ఇప్పుడు వరకు ముగ్గురు మాటలాడుకున్నారు నేను రాగానే ఆపేశారు.
హాసిని: ఏంటి చెల్లి కంగారుగా ఉన్నావ్.
నయని: ఇలా చూడు అక్క. గాయత్రీ పాప చేయి కాలినట్లు ఉంది. హాసిని అక్క హారతి పల్లెం పడేసినప్పుడు పాప అక్కడే ఉంది కదా తగిలింది ఏమో.
హాసిని: చిన్న మంట తగిలినా చిన్న పిల్లలు ఏడుస్తారు కదా..
పావనా: గాయత్రీ అక్కయ్య ఎందుకు ఏడుస్తుందమ్మా. 
నయని: ఏమన్నారు బాబాయ్ గాయత్రీ అక్కనా..
పావనా: అవునమ్మా గాయత్రీ అక్కనే. నువ్వు తీసుకొచ్చిన పల్లెం హాల్‌లో పడింది కదా. అక్కడ గాయత్రీ అక్కయ్య ఫొటో కూడా ఉంది కదా. అలాంటప్పుడు అక్కడే ఉన్న గాయత్రీ అక్క పసి పిల్ల మీద మంట పడనిస్తుందా..
హాసిని: బాగానే కవర్ చేశారు. 


మరోవైపు తిలోత్తమ చల్లని నీటిలో చేయి పెడుతుంది. వల్లభ వచ్చి తన తల్లికి గాయత్రీ పాప చేయి నీ చేతికి తగలడం వల్లే ఫైర్ వచ్చిందని అంటాడు. దీంతో తిలోత్తమ నమ్మదు. కళ్లారా చూశాను అని వల్లభ చెప్పినా తిలోత్తమ భ్రమ అని  వదిలేస్తుంది. ఎంత చెప్పినా తల్లి వినడం లేదు అని వల్లభ ఏకంగా గాయత్రీ పాపనే తీసుకొస్తాడు. మరోసారి నీ చేయి టచ్ చేయిస్తాను అంటాడు. కుడి చేయి టచ్ చేయమని అంటాడు.తిలోత్తమతో చేయి టచ్ చేయిస్తాడు. అయితే ఐస్ వాటర్‌లో చేయి ఉండటం వల్ల గాయత్రీ చేయి టచ్ చేసినా మంట రాదు. 


మరోవైపు ఉదయం అందరూ హాల్‌లో ఉండగా విశాలాక్షి వచ్చిందని ఎద్దులయ్య, డమ్మక్కలు చెప్తారు. విశాలాక్షి ఊరికే రావడం లేదని ఎద్దులయ్య అనడంతో మొన్న పండక్కి ఆ గుడిలో ఈ గుడిలో పెట్టిన ప్రసాదం పట్టుకొని వస్తుందా అని తిలోత్తమ అంటుంది. దానికి వల్లభ వెటకారంగా నవ్వుతాడు. ఇక విక్రాంత్ నేను వెళ్లి విశాలాక్షిని తీసుకురావాలా అని అడుగుతాడు. దానికి సుమన అడ్డుకుంటుంది.


డమ్మక్క: ఆ బరువు మగవాళ్లు మోసేదికాదులే..
ఎద్దులయ్య: ఆడవాళ్లే మోయగలరు.
దురంధర: ఏంటో అది..
పావనా: సోదరిని చూస్తే కానీ తెలిసేలా లేదు..


ఇంతలో విశాలాక్షి రావడం చూసిన హాసిని అమ్మవారిలా విశాలాక్షి అడుగుపెట్టిందని అంటుంది. ఇక నయని విశాలాక్షితో నిన్ను చూస్తే రెండు చేతులెత్తి దండం పెట్టాలి అనిపిస్తుందని అంటుంది. 


వల్లభ: చీర కట్టుకొని వచ్చిన విశాలాక్షి ఏం మూటకట్టుకొని వచ్చిందో చూడాలి కదా ముందు. 
తిలోత్తమ: మూట ఎక్కడ ఉందిరా ఖాళీ చేతులే కనిపిస్తున్నాయి.
విశాలాక్షి: చూపిస్తే తప్ప కనిపించదు. నా దగ్గరే ఉంది బయట పెట్టాను అంతే.
నయని: నీ దగ్గర ఉంది అంటున్నావ్ బయట పెట్టాను అంటున్నావ్ అర్థంకాలేదమ్మా.
సుమన: ఏం తెచ్చావో చూపించు.
ఎద్దులయ్య: అమ్మ మెడలో ఉంది కదా చిట్టిమాట.
సుమన: ఏముంది నెక్లెస్, పసుపు తాడు ఉంది అంతే..


ఇక చూడగలరా అంటూ విశాలాక్షి వజ్రాలు తొడిగిన మంగళ సూత్రాలు బయటకు తీస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. పెళ్లి అయిన వాళ్లు వేసుకున్నా ఇంత సూత్రాలు వేసుకోరు అని నయని అంటే ఇవి ఏ గుడిలోనో అమ్మవారికి వేసిన సూత్రాల్లా ఉన్నాయని సుమన అంటుంది. 


విశాలాక్షి: అవును సుమన.. అందుకే కదా వీటిని చూడగానే నాన్న, మీ పెద్ద బావగారు, తిలోత్తమ ఎవరూ మాట్లాడటం లేదు. 
హాసిని: ఈ ముగ్గురే ఎందుకు మాట్లాడటం లేదు కారణం ఏంటో తెలుసుకోవచ్చా అత్తయ్య.
తిలోత్తమ: ఆ తాళి.. 
సుమన: మీరు చెప్పండి విశాల్ బావగారు.
విశాల్: అది మా అమ్మది.. 
దురంధర: అదేంటి విష్ గాయత్రీ వదిన ఇంత పెద్ద తాళి వేసుకున్నట్లు లేదే. నువ్వేంటి మీ అమ్మది అంటున్నావు. 
విక్రాంత్: పెద్దమ్మది విశాలాక్షి ఎలా తీసుకుంటుంది. బ్రో..
తిలోత్తమ: ఆ తాళి గాయత్రీ అక్క వేసుకోలేదు. అప్పట్లోనే 60 లక్షలు పెట్టి  ఈ మంగళ సూత్రాలు చేయించింది. అమ్మవారికి కానుకగా ఇస్తాను అని చెప్పి చేయించిన ఈ వజ్రాల మంగళ సూత్రాలు ఇప్పుడు విశాలాక్షి మెడలో ఉన్నాయి. 
హాసిని: వావ్ పెద్దత్తయ్య చేయించిన తాళి మళ్లీ మన ఇంటికి చేరిందా..
సుమన: దొంగతనం చేశావా అని విశాలాక్షిని అడగడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: ఏడేళ్లు ఒకే గదిలో బంధించి అత్యాచారం, అక్కడే బిడ్డకు ప్రసవం - కన్నీళ్లు పెట్టించే సర్వైవల్ డ్రామా