Nindu Noorella Savasam, October 17, ఈరోజు ఎపిసోడ్ లో భాగమతిని చూసిన ఆమె మేనమామ వాళ్ళ అక్కని పిలిచి భాగమతిని చూపిస్తాడు.
భాగమతి పిన్ని : హాస్టల్ మానేసి ఎక్కడికి వచ్చి ఉంటుందంటే ఏదో కథ ఉండే ఉంటుంది, పోయి కనుక్కోరా..
భాగమతి మామ వాచ్మెన్ దగ్గరికి వెళ్లి ఈ ఇల్లు ఎవరిది, ఎవరెవరు ఉంటారు అని అడుగుతాడు.
వాచ్మెన్ : ఈ ఇల్లు లెఫ్ట్నెంట్ గారిది ఇక్కడ ఆయన తల్లిదండ్రులు, ఆయన పిల్లలు ఉంటారు.
మిస్సమ్మ మామ:మరి ఆయన భార్య?
వాచ్మెన్ : ఈ మధ్యనే ఆవిడ కాలం చేశారు.
ఈ మాటలు అన్ని వాళ్ళ అక్కకి చెప్తాడు మిస్సమ్మ మామ.
మిస్సమ్మ పిన్ని : డబ్బు కోసం నేను రెండో పెళ్లి వాడిని చేసుకున్నట్టు అది కూడా వాడిని అలాగే చేసుకుందాం ఏదో కథ ఉంది పదా వెళ్లి తెలుసుకుందాం అనుకొని ఇద్దరు ఆ ఇంటి లోపలికి వెళ్ళబోతే వాచ్మెన్ అడ్డుకుంటాడు వాచ్మెన్ ని నెట్టేసి ఇంట్లోకి వెళ్తారు అక్క, తమ్ముళ్ళు. ఆ హడావుడికి మిస్సమ్మ, రాథోడ్ అమర్ అందరూ అక్కడికి వస్తారు.
అమర్: ఎవరు నువ్వు, ఇలా దూసుకుంటూ లోపలికి వచ్చేస్తున్నావేంటి?
మిస్సమ్మ మామ : నువ్వు ఎవరివి అడగటానికి?
ఆ మాటలకి కోపంతో రగిలిపోయిన అమర్ అతని చెంప పగలగొడతాడు. కిందపడిన తమ్ముణ్ణి లేవనెత్తుతుంది మిస్సమ్మ పిన్ని.
అమర్: ఇప్పుడు చెప్పండి ఎవరు మీరు?
అడుగుతున్నాడు కదా సమాధానం చెప్పచ్చు కదా అన్నట్టు మిస్సమ్మ కాసి చూస్తుంది ఆమె పిన్ని. కానీ ఆ సైగలని పట్టించుకోదు మిస్సమ్మ. పట్టించుకోవట్లేదు అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది. ముందు అదేంటో తెలుసుకొని అప్పుడు గొడవకి దిగాలి అని మనసులో అనుకొని పని కోసం వచ్చాం అని చెప్తుంది మిస్సమ్మ పిన్ని.
అమర్: ఇదేనా అడిగే విధానం అంటూ వాళ్ళని బయటికి పొమ్మంటాడు.
మిస్సమ్మ పిన్ని ఆమెని పొగరుగా చూస్తూ అక్కడినుంచి వెళ్ళిపోతారు. ఆమె అలా చూడటం నీల చూస్తుంది.
నీల : మనోహర్ దగ్గరికి వెళ్లి బయట జరిగిందంతా చెప్తుంది. వాళ్లు మిస్సమ్మకి తెలిసిన వాళ్ళు లాగా ఉన్నారు అంటుంది.
Also Read: అర్థరాత్రి రాజ్, కావ్య ఫన్ టైమ్ - రుద్రాణికి రివర్స్ గిఫ్ట్ ఇచ్చిన కనకం
మనోహరి : ఎఫ్ఎం లో పనిచేసే ఈమె అసలు కేర్ టేకింగ్ లోకి ఎందుకు వచ్చింది, వీళ్ళ కుటుంబం గురించి తెలుసుకుంటే ఆమె కథంతా బయటపడుతుంది మన వాళ్ళని మిస్సమ్మ మీద ఒక కన్నేసి ఉంచమని చెప్పు అని నీలకి చెప్తుంది.
మరోవైపు మనోహరిని అపార్థం చేసుకున్నందుకు బాధపడుతూ ఉంటారు పిల్లలు, ఇకపై మనం మనోహరి ఆంటీ చెప్పినట్టు విందాం అని డిసైడ్ అవుతారు. ఇంతలో అక్కడికి మిస్సమ్మ వస్తుంది.
అంజు: సీరియస్ డిస్కషన్ చేసుకునేటప్పుడు నీ ఎంట్రీ ఏంటమ్మా, అయినా మేము ఈరోజు స్కూలుకి వెళ్లలేదు మా డాడీ అడిగితే ఏం చెప్తావు, మేము నిజం చెప్పాము కదా అప్పుడు డాడీ నిన్ను బయటికి గెంటేస్తారు అని నవ్వుతారు పిల్లలందరూ.
అప్పుడు మిస్సమ్మ కూడా నవ్వుతుంది.
అంజు: మా ప్లాన్ వర్క్ అవుట్ అయింది కాబట్టి మేము నవ్వుతున్నాం నువ్వు ఎందుకు నవ్వుతున్నావు.
మిస్సమ్మ : మీరు మానేయాలనుకుంటే స్కూలు మానేయలేదు నేను అనుకున్నాను కాబట్టి మీరు మానేశారు అని చెప్పి వాళ్ల చేతిలో హోంవర్క్ బుక్స్ పెట్టి గంటలో మొత్తం వర్క్స్ అన్ని కంప్లీట్ చేయమని ఆర్డర్ వేస్తుంది.
పిల్లలు: మేము చెయ్యం, మేము చెయ్యకపోతే డాడీ నిన్నే కోప్పడతారు అని ఆనందంగా చెప్తారు.
మిస్సమ్మ : ఇది ఈరోజు హోం వర్క్ మాత్రమే కాదు కదా మూడు రోజుల నుంచి హోంవర్క్ చేయలేదు అంటే నేను రాకముందు నుంచి మీరు చేయలేదన్నమాట, ఈ విషయం తెలిసిందంటే మీ డాడీ మిమ్మల్ని కోప్పడతారు కాబట్టి బుద్ధిగా వర్క్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి బయటికి వస్తుంది.
Also Read: కిచెన్లో ముచ్చట్లు, కాలేజీలో బాధ్యతలు - బలపడిన రిషిధార బంధం!
ఆ తర్వాత తన పిన్ని బాబాయిలతో మాట్లాడదామని బయటికి వెళుతుంది. అది అరుంధతి చూస్తుంది.
అరుంధతి: ఏంటి పిలిచినా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావ్..
మిస్సమ్మ : ఇందాక ఇద్దరు మనుషులు వచ్చారు కదా, వాళ్లు మా పిన్ని మావయ్య.
అరుంధతి: మరి నిజం చెప్పొచ్చు కదా చెప్తే సార్ వాళ్ళని కొట్టారు కదా అంటుంది.
మిస్సమ్మ : పిన్నికి నిజం తెలిస్తే సార్ కి చెప్పకుండా ఉండదు నేను కేర్ గా కాకుండా నా స్వార్థం కోసం ఎక్కడున్నాను అని తెలిస్తే సార్ ఇప్పుడే గెంటేస్తారు. నేను మా నాన్నని ఎలాగైనా రక్షించుకోవాలి.
అరుంధతి: సరే అయితే వెళ్ళు మీ పిన్ని వాళ్ళకి నాతో చెప్పు అర్థం చేసుకుంటారులే.
మిస్సమ్మ అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత నిన్న రాత్రి చిత్రగుప్తుడిని రాథోడ్ బయటికి పంపేసిన తర్వాత మళ్లీ కనిపించలేదు ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకుంటుంది అరుంధతి.
చిత్రగుప్తుడు రోడ్డు మీద ట్రాఫిక్ కి కంగారు పడుతూ అటు ఇటు నడుస్తూ ఉంటాడు. నా అంగుళీకము దొరికితే బాగుండు అనుకుంటాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.