స్వప్నని చూసుకోవడం కోసం కనకాన్ని ఇంద్రాదేవి ఇంట్లోనే ఉండమని చెప్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర కనకం నిలబడి ఉంటే అవమానించేలా రుద్రాణి మాట్లాడుతుంది. ఇక తను ఎక్కడ పడుకోవాలని మాట్లాడుకుంటారు. అందరూ జంటలుగా ఉన్నారు ఎక్కడ పడుకుంటుందని గిల్లుతుంది. దీంతో ధాన్యలక్ష్మి రుద్రాణినే ఇరికిస్తుంది. దీంతో చేసేది లేక తన గదిలోనే పడుకోవచ్చని అంటుంది.
Also Read: కిచెన్లో ముచ్చట్లు, కాలేజీలో బాధ్యతలు - బలపడిన రిషిధార బంధం!
అప్పు తన బాధని అన్నపూర్ణతో పంచుకుంటుంది.
అప్పు: నేను ఎప్పుడు వాడిని ప్రేమించాలని అనుకోలేదు కనీసం ఆ ఆలోచనతో కూడ చూడలేదు కానీ జరిగిపోయింది
అన్నపూర్ణ: మనసు అంతే చివరికి బాధ మిగులుస్తుంది
అప్పు: వాడికి నా మనసు ఎందుకు అర్థం కాలేదు. అందరిలాగా వాడు కూడ నా ప్యాంట్ షర్ట్ మీద కామెంట్ చేస్తున్నాడు. నేనేమైనా కావాలని ఇలా ఉన్నానా? ఎన్ని మాటలు అన్నాడో తెలుసా? నాకు ప్రేమ అంటే తెలియదంట. నాతో ఉంటే నన్ను అర్థం చేసుకున్నాడు అనుకున్నా కానీ అందరిలాగే బయట మనిషి అయిపోయాడని ఏడుస్తుంది
రాజ్ గదిలోకి వచ్చేసరికి బెడ్ మీద తన అంతరాత్మ ఉంటుంది. ప్రేమలో పడ్డా అంటూ పాట పాడతాడు.
రాజ్: పిచ్చి వాళ్ళు ప్రేమలో పడిపోతారు
అంతరాత్మ: నీ పిచ్చి ముదిరి చాలా రోజులు అయ్యింది. నీ మనసులో ఉన్న ప్రేమ గురించి నాకు తెలియదా
రాజ్: నేను ప్రేమలో పడినట్టు ఏంటి ఆధారాలు
అంతరాత్మ: నువ్వు కళావతిని ఇంప్రెస్ చేయడం కోసం మీ అత్తకి మర్యాదలు బాగానే చేస్తున్నావ్
రాజ్: ఈ ఇంట్లో ఎవరికి అవమానం జరిగినా చూస్తూ ఊరుకోనని తెలుసు కదా
అంతరాత్మ: నీలో కోపం పోయింది కళావతి మీద ప్రేమ పెరిగింది. ప్రేమ లేకపోతే ఊరంతా పిచ్చివాడిలా ఎందుకు తిరిగావ్
రాజ్: ఒక ఆడపిల్ల కనిపించకపోతే ఎలా ఊరుకుంటారు. ఇదంతా మానవత్వం. నేను ఒక గడువు పెట్టుకున్నా తాతయ్య క్షేమంగా ఉంటే చాలు. మూడు నెలలు కళావతిని భరిస్తాను తర్వాత తన దారి తనది నా దారి నాది అనేసరికి అంతరాత్మ బాధగా మాయమైపోతుంది
కనకం అంటేనే చిరాకు ఇప్పుడు తను నా గదిలో పడుకుంటుందా ఏదో ఒకటి చేయాలని రుద్రాణి అనుకుంటుంది. వెంటనే చాప కింద వేసి కనకాన్ని పడుకోమని అంటే తనకి బెడ్ మీద పడుకునే అలవాటని అంటుంది. కృష్ణమూర్తికి ఫోన్ చేసి గట్టిగా అరుస్తూ మాట్లాడుతుంది. ఏసీ గది ఇచ్చారు అని చెప్తుంది. ఏసీ పడదు కదా ఎలా ఉంటావ్ అంటే సర్దుకుపోతానులే అంటుంది. ఏసీ బాగా పెట్టి కనకాన్ని గదిలో నుంచి పారిపోయేలా చేయాలని కావాలని టెంపరేచర్ పెట్టి రుద్రాణి దుప్పటి ముసుగు వేసుకుంటుంది.
Also Read: ఊహించని ట్విస్ట్.. చావుబతుకుల్లో కృష్ణ, మురారీ.. ఎంట్రీ ఇచ్చిన కొత్త క్యారెక్టర్
రాజ్ వర్క్ చేసుకుంటూ ఉండగా కావ్య వస్తుంది. తనని పట్టించుకోకుండా రాజ్ సైలెంట్ గా పని చేసుకుంటుంటే కావ్య కౌంటర్ వేస్తుంది. దొరికిపోతానేమో అనుకుని రాజ్ మొహాన రాని నవ్వుని అతికించుకుని మాట్లాడతాడు. తనని పట్టించుకోవడం లేదని దెప్పి పొడుస్తుంది. అనుమానం పోవాలంటే ఏం చేయాలని అంటాడు. తనకి కిళ్ళీ తినాలని ఉందని చెప్తుంది.
రాజ్: కారులో తీసుకెళ్ళి రేపు తినిపిస్తాలే
కావ్య: రేపు కాదు ఇప్పుడే కావాలి
రాజ్: ఆన్ లైన్ లో ఆర్డర్ ఇస్తే ఇప్పుడే ఇంటి ముందు ఉంటుందని చూస్తాడు. కానీ ఆన్ లైన్ లో అన్నీ క్లోజ్ అయి ఉంటాయి
కావ్య: పెళ్ళైన ఇన్నాళ్లకి మొదటి సారి నోరు తెరిచి అడిగితే ఇవ్వలేకపోయారని అంటుంది. దీంతో రాజ్ పక్క గల్లీలో షాపు ఉంటుంది తీసుకెళ్తానని అంటాడు. బైక్ మీద వెళ్దామని పక్కనే కదా ఫోన్ వద్దులే అనేసి వెళ్లిపోతారు. కనకం రుద్రాణి పెట్టిన టెంపరేచర్ తట్టుకోలేక అల్లాడిపోతుంది. కప్పుకుందామంటే దుప్పటి కనిపించక రుద్రాణి చీరలు మొత్తం చుట్టేసుకుని కనకం పడుకుంటుంది. రాజ్ అర్థరాత్రి మెల్లగా ఎవరూ గమనించకుండా దొంగలాగా మెల్లగా కిందకు వస్తాడు.
తరువాయి భాగంలో..
రాజ్, కావ్య పాన్ షాపు దగ్గరకి వెళతారు. అది క్లోజ్ చేసి ఉండటంతో వీళ్ళు డోర్ ఓపెన్ చేసి కిళ్ళీ తయారు చేసుకుంటారు. కావ్య రాజ్ కోసం స్పెషల్ కా కిళ్ళీ చేసి పెడుతుంది. ఇద్దరూ డాన్స్ వేస్తూ సరదగా ఉంటారు.