ఎన్నో రోజులుగా తన ప్రేమని బయట పెట్టాలని ముకుంద చేసిన విశ్వప్రయత్నాలకి తెర పడిపోయింది. కృష్ణ ద్వారా ఆదర్శ్ గురించి ముకుంద చెప్పించిన అబద్ధం భవానీ దేవికి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో కృష్ణ తన మనసులో ప్రేమని భర్తకి వ్యక్తపరిచే ఆనంద క్షణంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు.


కృష, మురారీ కారులో వెళ్తూ ఉంటారు. కానీ మురారీ ఎందుకో టెన్షన్ గా కనిపిస్తాడు. నేను నా ఆనందాన్ని, మీరు నేను భార్యాభర్తలం అనే అనుభూతిని ఇన్నాళ్ళూ అనుభవించింది వేరు ఇప్పుడు వేరు. ఇన్ని రోజుల పాటు నా మనసులో ఉన్న విషయాలన్నీ బయట పెట్టేస్తున్నానని కృష్ణ సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే మురారీ వాళ్ళ కారుని వెనుక ఒక లారీ ఫాలో అవడం చూపిస్తారు. సరిగ్గా కృష్ణ.. మురారీకి ఐలవ్యూ అని చెప్పిన కాసేపటికి లారీ వచ్చి మురారీ వాళ్ళ కారుని ఢీ కొడుతుంది. దీంతో ఇద్దరికీ దెబ్బలు తగిలి కారులో నుంచి రాళ్ళ గుట్టలో పడిపోతారు. కృష్ణ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది. అటు మురారీ మొహం రాళ్ళ మధ్యలో పడి చిధ్రమైనట్టు చూపించారు. అప్పుడే అంబులెన్స్ లో వచ్చిన కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తాడు. సీరియల్ లో ఇప్పటి వరకు విలన్ లేడు ఇప్పుడు ఎంట్రీ ఇచ్చాడు. ముకుంద అవుతుందని అనుకున్నారు కానీ అది జరిగినట్టుగా ప్రోమో చూస్తే అర్థం అవుతుంది.


Also Read: కావ్యతో బైక్ మీద రాజ్ షికార్లు - కళ్యాణ్ పెళ్లి వార్తతో కన్నీళ్లు పెట్టుకున్న అప్పు


శనివారం నాటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..


దొంగ మేజర్ గా నటించిన వ్యక్తిని మధుకర్ ఎట్టకేలకు పట్టుకుని ఇంటికి తీసుకొస్తాడు. అతడిని చూసి ముకుంద టెన్షన్ పడుతుంది. దొంగ మేజర్ గా నటించిన వ్యక్తి నేరుగా వెళ్ళి భవానీ కాళ్ళ మీద పడతాడు. ఆదర్శ్ గురించి మురారీ వాళ్ళతో అబద్ధం చెప్పిన వ్యక్తి ఇతడేనని కృష్ణ చెప్పడంతో భవానీ షాక్ అవుతుంది. ముకుంద డబ్బులు ఇచ్చి అలా చెప్పించిందని అతడు నిజం బయట పెడతాడు. దీంతో భవానీ కోపంగా వెళ్ళి ఎందుకు ఇలా చేశావంటూ ముకుంద చెంప పగలగొడుతుంది. ఆదర్శ్ అంటే ఇష్టం లేక అలా చేశానని చెప్పడంతో భవానీ షాక్ అవుతుంది. అలాంటప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నావని నిలదీస్తుంది.


ముకుంద: నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా చేశారు. నా నోరు నొక్కేశారు. నా ప్రేమ బతికే ఉంటుందని చేసుకున్నాను.


భవానీ: పెళ్లి అయిన తర్వాత ప్రేమ ఏంటి ఈ చండాలం భరించడం నా వల్ల కాదు వెంటనే శ్రీనివాసరావుకి ఫోన్ చేసి తన కూతుర్ని తీసుకుని వెళ్ళమని చెప్పు రేవతి.


ముకుంద: అలా నన్ను అసహ్యంగా చూడొద్దు అత్తయ్య. నా మనసులో బాధ విన్న తర్వాత నేను చేసింది తప్పని తెలిస్తే అప్పుడు పంపించేయండి.


భవానీ: ఏంటి చండాలం వినేది. నీ కంటే చిన్నదైన కృష్ణని చూసి నేర్చుకో. కుటుంబ పరువు కాపాడటం కోసం తను ఎంత కష్టపడుతుందో చూడు.


Also Read: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన రిషి కుటుంబం - దేవయాని మీద శైలేంద్ర ఫైర్


ముకుంద: ఏంటి వాళ్ళని చూసి నేర్చుకునేది. నేను ఇన్ని రోజులు వీళ్ళకు దూరంగా ఒంటరిగా ఎందుకు ఉంటున్నానో తెలుసా.. వీళ్ళ చండాలం చూడలేక. అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకుని అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత విడిపోవాలని కాపురం చేస్తున్నారు. నేను ప్రేమించిన వాడు నా ఎదురుగా పరాయి ఆడదానితో ఉంటుంటే నా మనసు ఎంతగా గాయపడిందో తెలుసా..? ఈ ఇంట్లో అందరూ మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీకు పెద్దరికం అనే ముసుగు వేసి వీళ్ళు చండాలపు పనులు చేస్తున్నారు. నేను మురారీ పెళ్ళికి ముందు ప్రేమించుకున్నాం. కానీ మురారీ కుటుంబానికి విలువ ఇచ్చి తన ప్రేమని త్యాగం చేసి నన్ను ఆదర్శ్ తో పెళ్ళికి ఒప్పించాడు అని చెప్పేస్తుంది.