కావ్య ఇంటికి కనకం,కృష్ణమూర్తి వస్తారు. ఎందుకు వచ్చారని రుద్రాణి వెటకారంగా అడుగుతుంది. రుద్రాణి కడుపుకి మనుషులు తినే అన్నం పెట్టమని చెప్పాను కదా ఇంద్రాదేవి కౌంటర్ వేస్తుంది. దీంతో రుద్రాణి నోరు మూస్తుంది.


కృష్ణమూర్తి: స్వప్నకి ఏదో ప్రమాదం జరిగిందని తెలిసి.. రాకుండా ఆగలేకపోయాం.


రుద్రాణి: మా ముందే జరిగింది లేదంటే మెట్ల మీద నుంచి తోసేశామని కేసు పెట్టె వాళ్లు మీరు.


రాజ్: అత్తా చాలా సేపటి నుంచి నీ కొడుకు నిన్ను అడ్డుకుంటాడని చూస్తున్నా కానీ వాడు చవటలాగా కూర్చుని వినోదం చూస్తున్నాడు. కనీసం వాడి పెళ్ళానికైనా ఉండాలి అక్కడ కూర్చుని సూప్ తాగుతుంది. నా భార్య నయం. పుట్టింటి మీద ఈగ కూడా వాలనివ్వదు.


కనకం: మాకు ఇది అలవాటు అయిపోయింది.


Also Read: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన రిషి కుటుంబం - దేవయాని మీద శైలేంద్ర ఫైర్


స్వప్న వచ్చి తల్లిని కౌగలించుకుంటుంది. రుద్రాణి మాటలు పట్టించుకోవద్దని అందరూ వాళ్ళకి సర్ది చెప్తారు.


కనకం: మీరు అనుమతిస్తే స్వప్నని మా ఇంటికి తీసుకుని వెళ్లిపోతాం.


రుద్రాణి: ఆ పని చేయండి ఏం జరిగినా మీ ఇంట్లోనే జరుగుతుంది. తీసుకెళ్లండి మేం కొంచెం రిలాక్స్ గా ఉంటాం.


ఇంద్రాదేవి: సీమంతం చేయాలని కూడ తెలియదా? కనకం తొందర్లోనే తనకి సీమంతం చేయాలని అనుకుంటున్నాం. తర్వాత తనని తీసుకెళ్లి పురుడు పోసి బారసాల కూడ చేయవచ్చు. 


లేని కడుపుకి ఇంత ఆర్భాటాలు అవసరమా అని కావ్య మనసులో అనుకుంటుంది. ఈ అక్క నిజం ఎప్పుడు బయట పెడుతుందో అర్థం కావడం లేదు.


ఇంద్రాదేవి: స్వప్నని ఎంత జాగ్రత్తగా ఉండమన్నా పట్టించుకోవడం లేదు నర్స్ పెడతాను అన్నా ఒప్పుకోవడం లేదు. అందుకే కనకం నువ్వే ఇక్కడ ఉండి చూసుకోవచ్చు కదా


అపర్ణ: ఎవరికైనా జీతం ఇచ్చి కేర్ టేకర్ గా పెట్టుకుందాం.


కావ్య: అత్తయ్య చెప్పింది నిజమే కదా ఇలాంటి వాటికి ఆయాలు దొరుకుతారు.


సీతారామయ్య: స్వప్నని అమ్మ కంటే ఎవరూ బాగా చూసుకోలేరు.


కనకం: మీరు నా కూతురు క్షేమం కోసం ఆలోచిస్తుంటే ఎలా పట్టించుకోకుండ ఉంటాను?


అపర్ణ: మీరంతా ఇక నిర్ణయానికి వచ్చిన తర్వాత నేను చెప్పేది ఏముందని కోపంగా వెళ్ళిపోతుంది. ఇంట్లో పనులు చూసుకోమని కృష్ణమూర్తికి కనకం సవాలక్ష జాగ్రత్తలు చెప్తుంది.


అప్పు కళ్యాణ్ గిఫ్ట్ గా ఇచ్చిన చీర కట్టుకుని అద్దంలో చూసుకుంటుంది. ఏ కోణంలో కూడా అమ్మాయిలా కనిపిస్తుందా అంటూ కళ్యాణ్ అన్న మాటలు తలుచుకుని బాధపడుతుంది. అప్పుడే కళ్యాణ్ ఇంటికి వస్తాడు. కోపంగా చీర నేల మీద పడేస్తుంది.


కళ్యాణ్: ఏంటి బ్రో అలా వచ్చేశావ్ నువ్వు అలా వెళ్లిపోతే అనామిక ఎంత ఫీల్ అయ్యిందో. ఎందుకు అవాయిడ్ చేస్తున్నావ్?


అప్పు: ఇంతకీ విషయం ఏంటి?


కళ్యాణ్: ఇష్టం లేకుండా చీర తీసుకొచ్చావ్ కదా..


అప్పు: ఇష్టం లేదని ఎవరు చెప్పారు నాకు బాగా నచ్చింది అంటుంది. వెంటనే కింద పడి ఉన్న చీర తీసుకుని దాన్ని మడత పెడతాడు


కళ్యాణ్: ఇంట్లో నిశ్చితార్థం వద్దు నేరుగా పెళ్లి ముహూర్తం పెట్టుకుందామని అంటున్నారు. అది చెప్పడానికి వచ్చాను అనేసి చెప్పేసి వెళ్ళిపోతాడు.. అప్పు కింద కూలబడి కన్నీళ్ళు పెట్టుకుంటుంది.


అపర్ణ కోపంగా ఉంటే శుభాష్ ఏమైందని అడుగుతాడు. కనకంతో కలిసి భోజనం చేయడం ఇష్టం లేదని, ఆవిడతో నవ్వుతూ మాట్లాడటం తన వల్ల కాదని సీరియస్ అవుతుంది.


శుభాష్: అసలు కనకం అంటే ఎందుకు నీకు అంత చిన్న చూపు డబ్బు లేని వాళ్ళు అని చిన్న చూపా..


అపర్ణ: డబ్బు లేదని కాదు మోసం చేస్తుందని..


శుభాష్: అది ఎప్పుడో జరిగిపోయింది..


Also Read: కళ్యాణ్ మాటలకి ఫీలైన అప్పు- భర్త ప్రేమకి మురిసిన కావ్య


అపర్ణ: కావ్య కనిపించనప్పుడు ఎన్ని మాటలు అన్నది. ఇప్పుడు ఉండమనగానే ఉంది సిగ్గు లేదా?


శుభాష్: అంత జరిగినా ఉండటానికి ఒప్పుకుంది అంటే అందులో కూతురు మీద ప్రేమ కనిపించింది. అసలు రాజ్ అన్నీ మర్చిపోయి ఉంటే నీకేంటి ప్రాబ్లం. ఇలాంటి చిన్న చిన్న వాటికి గొడవలు పెట్టుకుంటే విలువ ఉండదు. ఎక్కువ ఆలోచించకు..


అందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తింటుంటే కనకాన్ని కూడ కూర్చుని తినమని కావ్య అంటుంది. చాప గదిలో ఉంది తీసుకొచ్చి వెయ్యి ప్రశాంతంగా కూర్చుని తింటుందని రుద్రాణి వెక్కిరింతగా మాట్లాడుతుంది.


రాజ్: వాళ్ళ ఇంట్లో కూడా డైనింగ్ టేబుల్ ఉంది అత్తా మరీ అంత పేదరికంలో బతకడం లేదు. చాలా మర్యాదగా చూసుకుంటారు.


కనకం డైనింగ్ టేబుల్ మీద కూర్చునే సరికి అపర్ణ చిరాకుగా మొహం పెడుతుంది. కానీ రాజ్ మాత్రం పట్టించుకోకుండ ఉంటాడు.


తరువాయి భాగంలో..


రాజ్ అంతరాత్మ మళ్ళీ ఎంట్రీ ఇస్తుంది. కళావతి మీద నీలో ఉన్న కోపం పోయింది. తన మీద ప్రేమ పెరిగిందని అంటాడు. కావ్య తనకి కిళ్ళీ తినాలని అనిపిస్తుందని చెప్తుంది. ఎలాగైనా పాన్ ఇప్పించకుండా ఇంటికి తిరిగి రానని చెప్పి రాజ్ కావ్యని బైక్ మీద ఎక్కించుకుని బయటకి వెళతాడు. భర్తని కౌగలించుకుని సంతోషంగా బైక్ మీద కూర్చుంటుంది.