Nindu Noorella Saavasam October 4th: ఈరోజు ఎపిసోడ్ లో మిస్సమ్మని మేజర్ దగ్గరికి తీసుకు వస్తూ ఉంటాడు రాథోడ్. అది గమనించిన చిత్రగుప్తుడు అరుంధతిని నీ ఫోటో ఆ బాలిక చూడబోతుంది అంటూ హెచ్చరిస్తాడు. కంగారుపడిన అరుంధతి పరిగెత్తుకుంటూ మిస్సమ్మ దగ్గరికి వెళ్తుంది.


అరుంధతి: మిస్సమ్మని ఆపి మీతో మాట్లాడాలి అంటుంది.


 మిస్సమ్మ : ఏంటో చెప్పండి అంటుంది.


అరుంధతి: మీ నాన్నగారికి బాగోలేదు అన్నారు కదా దాని గురించే అంటుంది.


రాథోడ్: అక్కడే ఆగిపోయారు ఏమి అని మిస్సమ్మని అడుగుతాడు.


మిస్సమ్మ: మాట్లాడి వస్తాను అంటుంది.


సరే అని రాథోడ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మిస్సమ్మ అరుంధతితో చాలాసేపు మాట్లాడిన తర్వాత సార్ ని కలిసి మాట్లాడాలి అని అక్కడ నుంచి కొంచెం దూరం వెళ్లి అక్కడ మేజర్ ని చూసి షాక్ అవుతుంది.


Also Read: ఆర్య ఇంట్లోకి అడుగుపెట్టిన అను - అంజలీ, నీరజ్ పెళ్లి ఆపేస్తారా!


అరుంధతి: ఎందుకలా షాక్ అయ్యావ్ అని మిస్సమ్మని అడుగుతుంది.


మిస్సమ్మ : ఈయన ఏంటి ఇక్కడున్నారు అంటుంది.


అరుంధతి: ఈయనే మేజర్ నువ్వు ఈయన దగ్గరే పని చేయాలి ఈయన నీకు ముందే తెలుసా అని అడుగుతుంది.


మిస్సమ్మ: ఇన్నాళ్లు ఈయనతోనే గొడవపడి మళ్లీ ఈయన దగ్గరే పని చేయాలా అని కంగారు పడుతుంది. మేజర్ ని నేను ఇంతకు ముందే చూసాను ఆ కథంతా తర్వాత చెప్తాను అని అక్కడ నుంచి పారిపోతుంది మిస్సమ్మ.


ఆమె ప్రవర్తనకి కన్ఫ్యూజ్ అవుతుంది అరుంధతి. ఆ తర్వాత రాథోడ్ ని పిలిచిన మేజర్ ఇక్కడ పని అంతా అయిపోయింది కదా ఇంకా బయలుదేరుదాం అంటాడు.


రాథోడ్ : సరే సార్ మిమ్మల్ని కలవడానికి ఆ అమ్మాయి వచ్చింది అని వెనక్కి తిరిగేసరికి అక్కడ మిస్సమ్మ కనిపించదు.


మేజర్: ఎవరు అని అడిగితే రాథోడ్ అదే సార్ మిస్సమ్మా అని చెప్తే సరే ఆమెని తీసుకురా అంటాడు.


రాథోడ్ ఆమె దగ్గరికి వెళ్లి ఇక్కడే ఉండిపోయావేమి అని అడుగుతాడు.


 మిస్సమ్మ: ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయు.. నేను ఇప్పుడు మేజర్ కలవలేను అని రిక్వెస్ట్ చేస్తుంది.


అదే విషయం మేజర్ తో చెప్తాడు రాథోడ్.


Also Read: పెళ్లికి ఆర్య ప్లాన్ - అనుని కిడ్నాప్ చేసే ప్రయత్నంలో మాన్సీ!


మేజర్: సరే ఇంటిదగ్గర కలుస్తాను అని చెప్పి సామాన్లన్నీ బండిలో పెట్టించమని రాథోడ్ కి చెప్తాడు.


మనోహరి : మీరు వెళ్ళండి అన్నీ సర్దించి మేము తీసుకువస్తాం అంటుంది.


అప్పుడు మేజర్ తండ్రి పొద్దున లాగా చేయకు జాగ్రత్తగా తీసుకురా అని చెప్పి అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు.


మనోహరి : ఒక్కసారి అమర్ తో నా పెళ్లి అవ్వని అప్పుడు చెప్తాను వీళ్ళ పని అనుకుంటుంది.


ఆ మాటలు అరుంధతి వింటుంది కానీ భ్రమపడ్డాను అనుకుంటుంది. అదే విషయం చిత్రగుప్తుడుతో చెబుతుంది..అది నిజం అని చెప్పినా వినిపించుకోదు.


Also Read: అమ్మా లే అమ్మా లే అంటూ కదిలించేసిన రిషి, జగతిది హత్యే అని బయటపడుతుందా!


మనోహరి : అరుంధతి ఫోటో చూస్తూ నా గురించి నీకేమీ తెలియదు ఆరు.. ఈరోజుతో నా పగ ప్రతీకారం అన్ని చల్లారాయి.. నేను చేసుకోవలసిన పెళ్లి నువ్వు చేసుకున్నావు. నేను అమర్ కోసం చాలా త్యాగం చేశాను. ఇకమీదటైనా అమర్ ని ఎలాగైనా దక్కించుకోవాలి అని అరుంధతి ఫోటో కింద పడేసి కాలి తో తొక్కుతుంది.


అది చూసిన అరుంధతి తనది భ్రమకాదని తెలుసుకుని  మనోహరి ప్రవర్తనికి కన్నీరు పెట్టుకుంటుంది.



Join us on Telegram: https://t.me/abpdesamofficial