Nindu Manasulu Serial Today Episode ప్రేరణని సిద్ధూ హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్తాడు. తర్వాత సారీ చెప్పి ఎమోషన్‌లో పట్టుకున్నా అని అంటాడు. ప్రేరణ తడబడుతూ పర్లేదు అని అంటుంది. నేను చెప్పడంతో మీ అమ్మ రాలేదు.. నీ మీద ప్రేమతో వచ్చిందని అంటుంది.
సిద్ధూ ప్రేరణతో మా అమ్మ నా కోసం ముందడుగు వేయదు.. అలా నా కోసం రావాలి అనుకున్నా కొన్ని శక్తులు ఆపేస్తాయని అంటాడు. తల్లి ప్రేమను ఏశక్తి ఆపలేదని ప్రేరణ అంటుంది. ఇక సిద్ధూ ప్రేరణని చూసి ఏంటి మీరు నాకు సరిగా కనిపించడం లేదు బ్లర్ అవుతున్నారు అని అంటాడు. కళ్ల నిండా నీరు ఉంటే బ్లరే అవుతాను కళ్లు తుడుచుకో మగవాళ్లు ఏడిస్తే బాగోదు అందులోనూ ఆరుడుగులు ఉన్న మీరు ఏడిస్తే బాగోదు అంటుంది. నేను ఏడ్వను ఇంత ఆనందంలో అస్సలు ఏడ్వను అని అంటుంది. ఇక ఇద్దరూ కేఫ్ గురించి మాట్లాడుకుంటారు. రేపటి నుంచి స్టడీ మీద ఫోకస్ చేయాలి అనుకుంటారు. ఇక సిద్ధూ ప్రేరణని అండీ.. మేడం అని పిలుస్తుంటే ఇక నుంచి అలా పిలొద్దని ప్రేరణ అని పిలవమని చెప్తుంది.
సిద్ధూ టైం చూసి 11:30 అయింది నాకు టైం అయింది నువ్వు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్లిపో నాకు పని ఉంది అంటాడు. ఏయ్ ఏయ్ నేను వెళ్లను అని ఇంత రాత్రి నేను వెళ్లను అని ప్రేరణ అంటే సరే నాతో రా అని సిద్ధూ ప్రేరణని తీసుకొని ఇంటికి వెళ్తాడు. దారిలో ప్రేరణ ఎన్ని ప్రశ్నలు వేసినా సిద్ధూ చెప్పడు. దారిలో కుమార్ కేక్ పట్టుకొని రెడీగా ఉంటాడు. సిద్ధూ ఇంటికి వెళ్లి సాహితికి కాల్ చేస్తాడు.
సాహితికి భర్త్‌డే విష్ చేస్తాడు. సాహితి అలిగిపోతుంది. ఫోన్‌లో చెప్పడం ఏంటి అని అంటుంది. ఇంతలో సిద్ధూ కిందకి రమ్మని సాహితికి చెప్తాడు. సాహితి కిందకి వచ్చి అన్నయ్యకి హగ్ చేసుకుంటుంది. ఇక సిద్ధూ బైక్ మీద కేక్ కట్ చేయిస్తుంటే అప్పుడే విజయానంద్, మంజుల వస్తారు. విజయానంద్ సాహితితో చేసుకోమ్మా భర్త్‌డే ఈ విజయానంద్ కూతురి భర్త్‌డే ఇలా రోడ్డుకెక్కించేశాడు. ఇంకా నయం డంపింగ్ యార్డ్‌లో చేయలేదు.. చూడు మంజు నిజంగా చేయాలి అనుకుంటే ఇంట్లో చేయాలి కదా నువ్వేం మాట్లాడవేంటి అని అంటాడు. మన పరువు వీధిలో పెట్టడం కాకుండా పరాయి వాళ్ల ముందు మన పరువు తీయడం అవసరమా అని ప్రేరణని ఉద్దేశించి అంటాడు.
సాహితి తండ్రితో ఇప్పుడు అవన్నీ ఎందుకు నా మీద ప్రేమతో అన్నయ్య వచ్చాడు అని అంటుంది. దానికి విజయానంద్ మీ అమ్మ నేను లేని నువ్వు ఎలా వచ్చావ్ అని అడుగుతాడు. నా సంగతి సరే కనీసం మీ అమ్మ కోసం నీ కోసం అయినా ఇంటికి రావాలి కదా అని అంటాడు. నేను ఎందుకు రావడం లేదో ఎందుకు నీకు తెలుసు కదా ఎన్నాళ్లు అయినా నువ్వు చేసింది మర్చిపోయేది కాదు నాకు నువ్వు చేసిన నష్టం మామూలుది కాదు నేను మర్చిపోను అంటే మీ నాన్న ఏం చేశాడురా అని మంజుల అరుస్తుంది. మా పరువు బజారుకి ఈడ్చింది చాలు పరాయి వాళ్ల మందు మా పరువు తీయకు.. చెల్లి మీద ప్రేమ ఉంటే కాదు.. ఆ చెల్లిని కన్న తల్లికి ఆ తల్లికి బతుకు అయిన తండ్రికి విలువ ఇవ్వడం నేర్చుకో అని అంటుంది.
సిద్ధూ తల్లి మాటలకు అడ్డు పడుతూ సాహితి ఇక్కడ కేక్ కట్ చేయడం నువ్వు అవమానంగా ఫీలవుతున్నావా అని అడుగుతాడు. లేదు అని సాహితి అనడంతో అయితే కేక్ కట్ చేయ్ అని అంటాడు. విజయానంద్, మంజుల షాక్ అయిపోతారు. వద్దు అని విజయానంద్ చెప్తే కట్ చేయమ్మా అని సిద్ధూ చెప్తాడు. వద్దు అని సాహితి చేయి పట్టుకుంటాడు. అమ్మ బాధ పడుతుంది వద్దమ్మా అని విజయానంద్ చెప్తే సాహితి కేక్ కట్ చేయ్ అని సిద్ధూ అంటాడు. విజయానంద్ కావాలనే కేక్ కిందకి తోసేస్తాడు. మన పరువు రోడ్డు పాలు చేసేశాడు అని విజయానంద్ అంటాడు. సిద్ధూ సాహితికి సారీ చెప్పి వెళ్లిపోతాడు.
విజయానంద్ అందరూ వెళ్లిపోయిన తర్వాత కింద పడిన కేక్ కట్ చేసి సంతోషపడతాడు. సాహితి లోపలికి వెళ్లి నాన్న ఎప్పుడూ ఇంతే ఆయన మారడు అని అనుకుంటుంది. మంజు వాళ్లు వెళ్లి విష్ చేస్తే మీరు నాతో మాట్లాడకు అని సాహితి అంటుంది. మీకు నచ్చనప్పుడు మీరు బయటకు రాకూడదు.. వస్తే వచ్చారు అన్నయ్యని ఎందుకు బాధ పెట్టారు అని అంటుంది. నాన్న అంటే చెడ్డ వాడు అని అన్నా చెల్లెల్లు అనుకున్నారా అని అంటాడు. నేను అన్నయ్యని ఇంటికి తీసుకురావాలి అనుకున్న ప్రతీ సారీ మీరు ఏదో ఒకటి చేస్తున్నారు.. అడ్డు పడుతున్నారు.. అని అంటుంది. పిచ్చిగా మాట్లాడకు అని మంజుల అంటుంది. ఏంటి అమ్మా తపన పడటం అంటే బాధ పెట్టడమా ఆరాటం అంటే ఇంటిని వెతుక్కుంటూ వచ్చిన అన్నయ్యని బాధ పెట్టడమా అని అడుగుతుంది. అన్నయ్యతో కలిసి నా భర్త్‌డే చేసుకోవాలి అనుకున్నా అన్నయ్య నాకోసం వస్తే డాడీ వల్ల అంతా వేస్ట్ అయిపోయింది నాకే అదృష్టం లేకుండా పోయింది అని సాహితి ఏడుస్తుంది.
విజయానంద్ సాహితితో రేపు మీ అన్నయ్య కేఫ్‌లో అందర్ని పిలిచి నీ భర్త్‌డే చేద్దాం అంటాడు. సాహితి చాలా సంతోషపడుతుంది. సాహితి ఒక కండీషన్ పెడుతుంది. మీరు కాల్ చేసి కెఫే ఆర్డర్ చేయకూడదు కేక్ కూడా ఆర్డర్ చేయకూడదు నువ్వు అమ్మ టైంకి వస్తే చాలు అని అంటుంది. వాడి కెఫేలో భర్త్‌డే అంటే మీరు రాకుండా ఎందుకు అని మంజు అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.