గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 17 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 October 17h Episod
ఇన్నాళ్లూ ఇంటి ఖర్చులు ఎవ్వరితోనూ చెప్పలేదు...ఇకపై లెక్కలేస్తానంటాడు సత్యం. ఇంటి ఖర్చులకు నెలకు ఇంటికి ఎంతిస్తావ్ అని మనోజ్ ని అడిగితే 8 వేలు అంటే.. పది వేలు అని బాలు, రవి అంటారు. మన దగ్గర అంత డబ్బు తీసుకుని అమ్మా నాన్నా ఏం చేస్తారని అడుగుతాడు మనోజ్. ఏమన్నావు రా అని ఫైర్ అవతాడు బాలు. మనోజ్ ని కొట్టేందుకు చేయెత్తుతాడు. రవి కూడా గడ్డి పెట్టడంతో ఆగుతాడు బాలు. మావయ్య దగ్గర మంచి మార్కులు కొట్టేసేందుకు ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారని సెటైర్ వేస్తుంది రోహిణి. నువ్వు ఆంటీకి 5 వేలు పాకెట్ మనీ ఇస్తున్నావ్..మరి దాన్ని ఏమంటారని క్వశ్చన్ చేస్తుంది శ్రుతి. రోహిణి షాక్ అవుతుంది.
గడిచిన ఎపిసోడ్ లో...
తాను అడ్డంగా బుక్కయ్యానని అర్థమైన రోహిణి... తన మేనమామ వీడియో కాల్ చేశాడంటూ ఇంట్లో అందరితో మాట్లాడిస్తుంది. మీరు ఉన్న సిటీ ఏంటి? అంటూ వరుస ప్రశ్నలు వేసిన బాలు..లొకేషన్ పంపించమని అడుగుతాడు. అడ్డంగా బుక్కయ్యాను అనుకుంటూ సిగ్నల్ లేదని చెప్పి కాల్ కట్ చేస్తాడు. హమ్మయ్య అనుకుంటుంది రోహిణి. నేను తొందరపడి ఉంటానని అనుకుంటుంది మీనా.. వాడు వీడియో కాల్ చేస్తే దుబాయ్ లో ఉన్నట్టా? నువ్వు చూసింది వాడినే..నీకు తెలిసింది నిజమే.. అవన్నీ గ్రాఫిక్స్ లో కవర్ చేయొచ్చు అని చెబుతాడు బాలు. వీళ్లు ఆడే నాటకాలు మామూలుగా ఉండవు.. నిన్న పార్లలమ్మతో చెప్పావ్ కదా మేకమామని చూసినట్టు..అందుకే నీకు అనుమానం రాకూడదని వాడితో ఇవాళ ఫోన్ చేయించింది. వీడియో కాల్ ఎందుకు? లొకేషన్ ఎందుకు పంపించలేదు? డౌటే లేదు...పార్లలమ్మ ఏదో దాస్తోంది..ఈ విషయం బయటపెట్టాలి అనుకుంటాడు బాలు.
మరోవైపు మనోజ్ కూడా మీ మేనమామ అలా మాట్లాడుతున్నాడేంటి అంటాడు. మనం కల్పన ఇచ్చిన డబ్బుతో బిజినెస్ చేస్తున్నాం కదా..ఆ విషయం బాలు నమ్మలేదు కదా అందుకే అలా చెప్పించాను అంటుంది. మీనాన్న ఎప్పుడొస్తాడు.. మలేషియాలోనూ మరో బ్రాంచ్ ఓపెన్ చేద్దాం అంటాడు మనోజ్. ముందు ఈ బిజినెస్ సరిగ్గా చేయి చాలని క్లాస్ వేసి వెళ్లిపోతుంది రోహిణి. నేరుగా విద్య దగ్గరకు వెళుతుంది. గ్రీన్ మ్యాట్ లో భలే మ్యానేజ్ చేశావ్ అంటూ విద్యను మెచ్చుకుంటుంది. ఇలా ఎంతకాలం మ్యానేజ్ చేస్తారు? ఇలా అబద్ధాలు ఆడుకుంటూ వెళితే ఏదో ఒకరోజు ఇరుక్కుపోతారని హెచ్చరించి వెళ్లిపోతాడు మాణిక్యం. అప్పుడు ఏం చేస్తావ్ అని విద్య అడిగితే.. ఈలోగా మనోజ్ ని పూర్తిగా నా వైపు తిప్పుకుంటాను..అందుకోసం పిల్లల్ని కనాలి..వాళ్లకోసం అయినా ఆలోచించి సర్దుకుపోతాడు అంటుంది.
ఓ రీల్ లో భార్యను భర్త మోసుకెళుతున్న వీడియో చూపించి తనను కూడా అలానే ఎత్తుకుని తీసుకెళ్లమని అంటుంది శ్రుతి. ఇంతలో బాలు వచ్చి డబ్బుడమ్మకి ఏమైందని అడుగుతాడు బాలు. ప్రేమ ఉందని నిరూపించుకునేందుకు మూడు రౌండ్లు తిరగమందని చెబుతాడు రవి. అయితే నేను కూడా తిప్పుతా అంటూ మీనాను ఎత్తుకుంటాడు బాలు. ఇంతలో మనోజ్ ని కూడా ఇరికిస్తారు... అప్పుడే లోపలకు వచ్చిన ప్రభావతి-సత్యం ఏంటిది అని అడుగుతారు.విషయం తెలిసి..మరి మీరు రుజువుచేసుకోరా అంటుంది ప్రభావతి. ఇది కూడా నీ ప్లానేనా అని ఫైర్ అవుతుంది ప్రభావతి. మీనా గట్టిగా ఇచ్చిపడేస్తుంది