Nindu Manasulu Serial Today Episode ఇందిర ఇంటికి వచ్చి ప్రేరణ ఎస్‌ఐ గణతో గొడవ పడినందుకు కోప్పడుతుంది. ఫ్రీ కోచింగ్ అంటూ ఓ అవకాశం నీకు వస్తే ఆ పోలీసోడితో గొడవ పడి వచ్చావ్ అని అంటుంది. ఇదంతా నీకు ఎలా తెలుసమ్మా అని ప్రేరణ అడుగుతుంది. ఇప్పుడు అదా ముఖ్యం అని ఇందిర అంటే అడిగిన దానికి సమాధానం చెప్పమ్మా.. ఇదంతా నీకు ఎలా తెలుసు.. ఎవరు చెప్పారు.. నిజం చెప్పమ్మా నువ్వు ఆ ఇంటికి వెళ్లావా అని ప్రేరణ అడుగుతుంది. 

ఇందిర, సుబ్బూ షాక్ అయిపోతారు. ఐశ్వర్య సుబ్బుతో మామయ్య అమ్మని నువ్వు తీసుకెళ్లావా అని అడుగుతుంది. నాకు అంత ధైర్యం లేదమ్మా అంత సాహసం నేను చేయనమ్మా  అని అంటాడు. దాంతో ఐశ్వర్య మరి అక్క గొడవ పడిన విషయం అమ్మకి ఎలా తెలిసింది అని అడుగుతుంది. ప్రేరణ మామయ్యతో మామయ్య మనం ఏం అనుకున్నాం అని అంటుంది. మీరేం అనుకున్నారు అని ఇందిర అడుగుతుంది. ఈ సారి ప్రేరణ, సుధాకర్ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఐశ్వర్య మళ్లీ ప్రశ్నించడంతో ఇక కవర్ చేయడానికి సుధాకర్ నేనే మీ అమ్మకి చెప్పానే నేను ఆ గణ దగ్గరే కదా పని చేస్తున్నా అని అంటాడు. ఆ రోజు ప్రేరణ అలా చేసింది ఈ రోజు మీ అమ్మ ఇలా చేసింది. నువ్వే బ్యాలెన్స్ నువ్వు ఏదో చేయమ్మా అని సుధాకర్ అంటే ప్రేరణ ఏం చేసింది అని ఇందిర అడిగితే అమ్మ ఏం చేసింది అని ప్రేరణ అడుగుతుంది. ఇద్దరూ ఏం చేశారని ఐశ్వర్య అడుగుతుంది. 

సుధాకర్ ఏం చేయాలో తెలీక  ఎవరైనా సరే ఆ గణతో పెట్టుకోవడం మంచిది కాదు అని చెప్తున్నా అంటాడు. దానికి ప్రేరణ ఇంకెన్నాళ్లు భయంతో బతికేది.. నేను వాడికి ఎదురెళ్తా.. ప్రేరణ ఐఏఎస్‌ డాటర్ ఆఫ్ రాజశేఖరం అని వాడితోనే అనిపిస్తా అని అంటుంది. ఇదేదో కొంప ముంచేలా ఉంది నన్ను మీరు బతకనివ్వరే అని సుధాకర్ తల పట్టుకుంటాడు. మరోవైపు సిద్ధూ, కుమార్ మంచి అవకాశం పోయిందని బాధ పడతారు. ఏం సాధించాలి అన్నా ఏం చేయాలి అన్నా ముందు డబ్బు కావాలిరా కుమార్ అని సిద్ధూ అని ఇక ఫ్రీగా ఎవరూ కోచింగ్ ఇవ్వరు అని అర్థమైంది..సీటు కోసం డబ్బు సంపాదించాలి అని అందుకే బైక్ రైడ్‌తో పాటు డోర్ డెలివరీలు కూడా చేస్తానని అంటాడు.

ఇందిర సుధాకర్ దగ్గర తన భర్తని ఎవరూ పట్టించుకోవడం లేదని ఏడుస్తుంది. కనీసం ఆయనకు ప్రాణం ఉందని ఎవరూ అనుకోవడంలేదు.. అలాంటి పరిస్థితిలో ఉన్న ఆయన్ను చాలా హీనంగా చూస్తున్నారు. ఆయన్ను అలా వదిలేస్తే ఆయన ఆరోగ్యం క్షణించిపోతుంది నా పిల్లలు దిక్కలేని వారు అయిపోతారురా.. నేను ఆ ఇంట్లోనే ఉండాలిరా అంటుంది. నీకు దండం పెడతా అక్క నాకు కొత్త కొత్త షాకులు ఇవ్వకే నన్ను ఇలా కూడా బతకనివ్వవే అని అంటాడు. ప్రాణం పోయినా సరే నేను వెళ్తానురా తమ్ముడు  అంటుంది. అసలు నువ్వు అక్కడికి ఎలా వెళ్తావే అని సుధాకర్ అడిగితే ఇప్పుడు అక్కడున్న పని మనిషిని తప్పిస్తే నేను వెళ్లొచ్చు అని ఇందిర అంటుంది. సుధాకర్ గుండె పట్టుకొని నేను ఎక్కువ రోజులు బతకను అక్కా అని అంటాడు.

గణ పోలీస్ స్టేషన్‌కి బయల్దేరుతుంటే ఈశ్వరి వచ్చి ఆ  అడ్రస్ లేనిది వచ్చి గొడవ చేసిందా.. అని అడుగుతుంది. నేను ఊహించలేదమ్మా దాన్ని వదలను నాలుగు రోజుల్లో దాని అంతు చూస్తా వాళ్ల బతుకుల్ని అతలాకుతలం చేస్తా అని అంటాడు. ఇంతలో గణకి పై అధికారి కాల్ చేసి గణ సస్పెండ్ అయినట్లు  చెప్తారు. గణ షాక్ అయిపోతాడు. మినిస్టర్, విజయానంద్‌తో ఎందుకు పెట్టుకున్నావు అంటారు. గణ కోపంగా సస్పెండ్ చేసింది మినిస్టర్ అయినా దానికి కారణం ఆ ప్రేరణే అంటాడు. ఒక ఆడపిల్ల నీ సస్పెండ్‌కి కారణం అయిందని ఈశ్వరి కొడుకుని రెచ్చగొడుతుంది.దాన్ని చంపేస్తా అని గణ ఆవేశపడతాడు. ఆవేశ పడుకుండా నీ వల్ల వచ్చే భయం  అంటే ఏంటో తెలియాలి అంటుంది. 

మరోవైపు కొంత మంది అధికారులు వృద్ధాశ్రమం తొలగిస్తుంటారు. ముసలి వాళ్లు అంతా తల బాదుకొని ఏడుస్తారు. ఇంతలో సిద్ధూ వస్తాడు. వాళ్లని సిద్ధూ ప్రశ్నించడంతో నువ్వు ఎవరు అని వాళ్లు అడిగితే మా దేవుడు అని ముసలి వాళ్లు చేతులు జోడించి దండం పెట్టి చెప్తారు. అధికారులు నోటీసులు చూపిస్తారు. నాకు కాస్త టైం ఇవ్వండి అని సిద్ధూ అడిగితే 24 గంటలు టైం ఇస్తారు. సిద్దూబాబు అని అందరూ ఏడుస్తారు. మీ అమ్మగారిది పెద్ద మనసు బాబు మా బాధ చూడలేక ఆ తల్లి ఇంటిని మాకు ఇచ్చి ఆశ్రయం ఇచ్చింది.. నువ్వు ఊహతెలిసిన నాటి నుంచి మాకు అండగా ఉన్నావు అంటారు. ఈ ఆస్తి మాది అయినా ఇది మీదే ఏం కాకుండా చూసుకుంటా అంటాడు.  మీ అమ్మది గొప్ప మనసు బాబు అని అంటారు. ఎవరూ కంగారు పడొద్దు అని సిద్ధూ చెప్తాడు. అందరూ దండం పెడతారు. దండలయ్యా దండలయ్యా అంటూ బాహుబలి సాంగ్ బ్యౌగ్రౌండ్‌తో సిద్ధూకి ఓ రేంజ్ ఎలివేషన్ ఉంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.