Trinayani June 27th: పావనమూర్తి.. రేపు తిలోత్తమా గాయత్రి అక్క గారి వర్ధంతి చేయటానికి ఏర్పాట్లు చేస్తుందని అనటంతో నయని, విశాల్ షాక్ అవుతారు. అలా ఎలా నిర్ణయం తీసుకుంటారు అని.. అయినా గాయత్రి అమ్మగారు మళ్లీ పునర్జన్మలో సజీవంగా ఉన్నారు కదా అంటుంది. విశాల్ కూడా అదే మాట అంటాడు. ఎలాగనే ఈ కార్యక్రమాన్ని జరిపించకూడదు అని అనుకుంటారు.


మరోవైపు సుమన దగ్గరికి వెళ్లిన విక్రాంత్.. నువ్వు కూడా మమ్మీ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నవ్ ఏంటి తినడంతో అత్త ఏది చెప్తే అదే వినాలి కదా అంటుంది సుమన. ఏ విషయం గురించి అంటున్నారు అని ప్రశ్నించడంతో.. రేపు పెద్దమ్మ గారి వర్ధంతి గురించి అంటాడు. అందులో తప్పేముంది అన్నట్లుగా సుమన్ అనటంతో మళ్లీ పెద్దమ్మ అన్నయ్య కడుపులో పుట్టింది కదా అది అంటుంటాడు. సుమన అవేవీ పట్టించుకోకుండా మాట్లాడేస్తూ ఉంటుంది.


ఆ తర్వాత విశాల్ గురువు దగ్గరికి వెళ్లి తిలోత్తమా తీసుకున్న వర్ధంతి నిర్ణయం గురించి చెబుతాడు. దాంతో గురువుగారు ఏది జరగాలంటే అదే జరుగుతుంది అన్నట్టుగా చెబుతాడు. ఇక విశాల్ జరిపించొద్దని.. అమ్మ బతికే ఉందని చెబుతాను అనటంతో.. అప్పుడే హాసిని చూపించమని అడుగుతుంది అని అంటుంది.


తను ఊరుకునే రకం కాదని చూపించమంటే గాయత్రి పాపను అమ్మగా చూపిస్తావా అనటంతో నీకు ఈ విషయం ఎలా తెలుసు వదిన అంటాడు. దాంతో హాసిని నాకు ఈ విషయం తెలుసని గురువు గారికి కూడా తెలుసు అని చెబుతుంది. ఇంతకాలం ఎందుకు అనలేదని అడగటంతో ఎవరికి చెప్పకుండా నేనే దాచాను అని కాసేపు మాట్లాడుతూ ఉంటుంది.


మరోవైపు సుమన రెడీ అవుతుండగా.. అప్పుడే అక్కడికి తిలోత్తమా వచ్చి నగలు ఇస్తుంది. ఈరోజు గాయత్రి వర్ధంతి కాబట్టి వేసుకోమని చెబుతుంది. సుమన కూడా ఓకే అని నగలు తీసుకుంటుండగా.. అప్పుడే నయని వచ్చి వద్దు అని అంటుంది. గతంలో అమ్మ దగ్గర తీసుకున్నందుకు అమ్మ దూరం అయింది అని అనటంతో అప్పుడు తను కుళ్ళు తో ఇచ్చింది అని అంటుంది.


అత్తయ్య ప్రేమతో ఇస్తుంది అని అంటుంది. ఇక నయని ఎంత చెప్పినా కూడా వినకుండా ఆ నగలు తీసుకుంటుంది సుమన. తిలోత్తమా కింద ఏర్పాట్లు చేయాలి అని వెళుతుంది. ఆ తర్వాత నయని ఏం జరగబోతుందో అని మళ్ళీ కళ్ళు మూసుకొని చూడటంతో.. తిలోత్తమా రక్తం మడుగుల తో కిందపడి ప్రాణాలు పోతున్నట్లుగా కనిపిస్తుంది.


దాంతో నయని భయపడి.. అంటే గాయత్రి అమ్మగారు చనిపోయిన రోజు తిలోత్తమా అత్తయ్య కూడా చనిపోతుందా అని భయపడుతుంది. ఇక కింద వల్లభ గాయత్రి ఫోటో దగ్గర అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతాడు. అప్పుడే అక్కడికి పావన మూర్తి ఇంట్లో వాళ్లకు నచ్చకుండా ఇలా ఎందుకు చేస్తున్నావు అనటంతో.. అప్పుడే తిలోత్తమా వచ్చి కొన్ని కొన్ని సార్లు రివర్స్ వెళితేనే మంచి జరుగుతుంది అని అంటుంది.


అప్పుడే గురువు మంచి కోసమైతే జరిపించొచ్చు అనటంతో.. శ్రేయోభిలాషులుగా మీరు ఉండగా చెడు జరగనిస్తారా అని అంటుంది. వెంటనే విక్రాంత్ పెద్దమ్మ పునర్జన్మల సజీవంగా ఉందని తెలిసినప్పుడు మళ్ళీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని అంటాడు. దాంతో తిలోత్తమా గాయత్రి పునర్జన్మ ఎత్తింది అని విని వదిలేసాను అని అంటుంది.


అప్పుడే సుమన నగలు వేసుకుని తయారై రావడంతో ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఇక విక్రాంత్ సుమన పై అరుస్తాడు. ఇక విశాల్ తను అలా రెడీ అవ్వటం వల్ల ఎటువంటి నష్టం లేదు కదా అనడంతో.. వెంటనే గురువు నష్టం ఎవరికి ఉందో తెలుసుకున్నావా నయని అంటాడు. తెలుసుకున్నాను జరిగే నష్టం తిలోత్తమా అత్తయ్యకు అని అంటుంది.


దాంతో తిలోత్తమా వెటకారంగా.. నాకేం నష్టం అంటూ.. ఈ వర్ధంతికి కొంత ఖర్చు మాత్రమే పెట్టాను అని కాస్త వెటకారంగా మాట్లాడుతుంది. అప్పుడే వల్లభ విశాల్ ను కొబ్బరికాయ కొట్టి దండ వేయమని అంటాడు. దాంతో విశాల్ ఒప్పుకోడు. వెంటనే సుమన గాయత్రి అత్తగారు బతికే ఉన్నారు అని అలా చేయటానికి ఇష్టపడడం లేదు అని అంటుంది. నిజంగానే బతికే ఉన్నారు.. మళ్లీ పునర్జన్మ ఎత్తటానికి ఇక్కడే ఉన్నారు అని హాసిని అనడంతో.. వెంటనే తినోత్తమా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది అని వదిలేస్తుంది.


Also Read: Karthika Deepam 2: ‘కార్తీక దీపం’ సీక్వెల్‌పై డాక్టర్ బాబు క్లారిటీ, మళ్లీ వంటలక్కతో జతకట్టనున్నాడా?