ఖుషిని చూడటానికి మాళవిక యష్ గదికి వస్తుంది. ఈ ప్రేమ ఇంతకముందు ఏమైందని నిలదీస్తాడు. అందుకు ఈరోజు జరిగిందే సాక్ష్యం. అందరం ఖుషి కోసం పోలీస్ కంప్లైంట్ అని తిరుగుతుంటే వేద మాత్రం ప్రాణాలకు తెగించి కాపాడింది. వేద మాకు అదృష్టం. మమ్మల్ని చూసి కుళ్ళుకోకుండా ఉంటే చాలని చెప్తాడు. వేద ఎంత నచ్చజెప్పినా కూడా యష్ మాత్రం తనని మాటలు అంటాడు. ఖుషిని చూడటానికి వస్తే ఇన్ని మాటలు అనాలా అంటే తను ఎందుకు వచ్చిందో నాకు తెలుసని చెప్తాడు. అభిమన్యు చిత్రకి ఫోన్ చేస్తాడు. అప్పుడే వసంత్ కూడా ఇంటికి వస్తాడు. నీ మొగుడికి ధైర్యం ఎక్కువేమో నాకు బలం ఎక్కువ. ఇదే ఫైనల్ వార్నింగ్ మీకు. ఏదో ఒక రోజు మీ ఇంట్లో డైనమేట్ పేలుతుంది. నా ధాటికి నువ్వు నీ భర్త మాత్రమే కాదు కుటుంబం మొత్తం చెల్లాచెదురు అవుతుందని బెదిరిస్తాడు. ఏం చేయబోతున్నాడని చిత్ర కంగారుపడుతుండగా అప్పుడే స్టవ్ మీద ఉం కుక్కర్ పేలిపోతుంది. దీంతో భయపడిపోతుంది.
Also Read: కీలక మలుపు, కృష్ణని మురారీ జీవితంలో నుంచి వెళ్లిపొమ్మన్న ముకుంద
అభిమన్యు మాటలకి చిత్ర వణికిపోతుంది. సులోచన ఇంట్లో పరిస్థితులు బాగోలేవని చెప్పి పంతుల్ని పిలిపిస్తుంది. మాలిని తన మనసులో ఉన్న భయాన్ని బయట పెడుతుంది. తన మనవడు, మనవరాలు క్షేమంగా ఉండేందుకు ఏదైనా చేయమని అడుగుతుంది. పిల్లల జాతకాలు సులోచన ఇచ్చిందని చిన్న చిన్న దోషాలు ఉన్నాయని శాంతి హోమం జరిపిస్తే సరిపోతుందని పంతులు చెప్తాడు. హోమం చేసేందుకు యష్ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. అంటే ఈ హోమం జరిపిస్తే పిల్లలకు ఏమి జరగకుండా ఆగిపోతుందా అని మాళవిక వెటకారంగా అడుగుతుంది. కాదు తాగేసి రోడ్డు పక్కన పడిపోకుండా ఉంటే బాగుంటుందని దెప్పి పొడుస్తాడు. కిడ్నాపర్ ని పట్టుకుంటే బాగుంటుందని మాళవిక సలహా ఇస్తుంది. కానీ తన మాట ఎవరూ పట్టించుకోరు.
Also Read: తప్పు తెలుసుకుని రిషి కాళ్ళ మీద పడిన కేడీ బ్యాచ్- కాలేజ్ లో మహేంద్రని చూసి దాక్కున్న వసు
నేను దుష్ట శక్తినా, శాంతి హోమం జరిపిస్తారా? మీరు చేయాల్సింది మీరు చేయండి నేను చేయాల్సింది నేను చేస్తానని మాళవిక మనసులో అనుకుంటుంది. వేదని కలవడానికి యష్ ముసలోడి గెటప్ వేసి క్లినిక్ కి వస్తాడు. గుండెల్లో నొప్పిగా ఉందని అనేసరికి వేద చెక్ చేస్తుంది. అప్పుడే తనకి అతని మీద డౌట్ వస్తుంది. వచ్చింది యష్ అని వేద అర్థం చేసుకుంటుంది. మీరా ఇలాంటి పిచ్చి వేషాలు ఎవరు వేస్తారా అనుకున్నా చెప్తా మీ సంగతి అని మనసులో అనుకుంటుంది. వెంటనే నర్స్ ని పిలిచి ఆపరేషన్ కి ఏర్పాటు చేయమని చెప్తుంది. ఆ మాటకి యష్ టెన్షన్ పడిపోతాడు. ఇంట్లో వేసే వేషాలు చాలవని ఇక్కడ కూడా వేస్తారా? అని అనేసరికి యష్ కి అర్థం అయిపోతుంది. ఇంట్లో కుదరడం లేదు అందుకే వచ్చానని అంటాడు. భర్తకి ప్రేమగా ముద్దు పెడుతుంది. మాళవిక రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే పక్కనే అభిమన్యు కారులో వెళ్తూ తనని చూసి పలకరిస్తాడు.