Naga Panchami Serial November 16th Episode
వైదేహి: (జ్వాలా, చైత్ర డైనింగ్ టేబుల్ దగ్గర ప్లేట్లతో టైంపాస్ చేస్తుంటే) ఏంటి తీరిగ్గా ఆడుకుంటున్నారు మేమంతా వచ్చింది కనిపించడం లేదా లేచి వడ్డించండి. మీకే చెప్పేది వినిపించడం లేదా
చైత్ర: మాకు చెవుడు లేదు అత్తయ్య.. ఈ రోజు నుంచి మేం వడ్డించము ఎవరైనా వడ్డిస్తే మేము తింటాం
జ్వాలా: ఇక ఈ ఇంట్లో ఏ పని చేయం. ఇష్టం ఉంటే ఇంట్లో ఉంచండి లేదంటే పుట్టింటికి వెళ్లిపోతాం
చైత్ర: అందుకే ఈ రోజు మేము వంట కూడా చేయలేదు. ఎవరైనా వండి వడ్డిస్తే తింటాం లేదంటే ఆర్డర్ ఇచ్చినా పర్లేదు ఏదైనా త్వరగా చేయండి. ఆకలితో ఉన్నప్పుడే మా బాధ మీకు తెలుస్తుంది అని ఇప్పుడు చెప్పాం.
సుబ్బు: మీరేం కంగారు పడకండి ఈరోజు వంట నేను చేశాను. నాకు అన్ని పనులు తెలుసు. తిని రుచి ఎలా ఉందో మీరే చెప్పాలి.
జ్వాలా: అయితే ఈ రోజు మేము తిన్నట్టే
వైదేహి: ఇంటి పెత్తనం ఎవ్వరికి ఇవ్వాలి అనేది నా ఇష్టం ఇచ్చేశాను కూడా
జ్వాలా: అయితే ఇంటి పనులు కూడా మీ కోడలు మీ మహారాణికి చెప్పండి కోట్లకు కోట్లు కట్నం తెచ్చింది కదా
శబరి: ఇక మీరు నోరు మూయండి. పెత్తనం అంటే బలవంతంగా లాక్కునేది కాదు పంచమి లాగా సుతిమెత్తగా ఉంటే అదే చేతికి వస్తుంది. మీ నోటి దురుసు తనం తెలిసిన వారు ఎవరైనా సరే మీకు పెత్తనం ఇస్తారా చెప్పండి
పంచమి: బామ్మగారు నాకు ఎలాంటి పెత్తనం అవసరం లేదు. ఈ ఇంట్లో ఓ పనిమనిషిగా పడి ఉంటాను. నా కారణంగా ఈ ఇంట్లో గొడవలు రాకూడదు. నేను చెప్పేది అర్ధం చేసుకోండి
మోక్ష: ఈ ఇంట్లో మా అమ్మ మాట ఫైనల్. ఆకలి అవుతుంది ముందు తిందాం సుబ్బు ఎలా వండాడో ఏంటో
పంచమి: సుబ్బు నువ్వు ఎప్పుడూ ఇలాంటి పనులు చేయకు సుబ్బు రుచిగా లేకపోతే అందరూ తిడతారు. పైగా చిన్న పిల్లాడివి పైగా చేతులు కాలుతాయి.
పంచమి, మోక్ష, సుబ్బు వంటకాలు తెస్తారు. పంచమి అందరికీ వడ్డిస్తుంది. అందరూ ఫుడ్ చాలా బాగుంది అంటే జ్వాలా, చైత్రల భోజనం మాత్రం కారం, ఉప్పుగా ఉంటుంది. దీంతో వాళ్లు ఇబ్బంది పడతారు. మిగతా వాళ్లు సుబ్బుని తెగ పొగుడుతారు. తర్వాత జ్వాలా, చైత్రల ఫుడ్ చాలా రుచిగా మారిపోతుంది.
మోక్ష: పంచమి బెడ్ మీద పడుకో
పంచమి: నేను కింద పడుకుంటా బాబు
మోక్ష: అసలు నీ ఉద్దేశం ఏంటి పంచమి. నా విషయంలో నువ్వు ఏం కోరుకుంటున్నావు పంచమి. ఎందుకు నాకు దూరంగా ఉండాలి అనుకుంటున్నావు. వీడికి ఎలాగూ నాగ గండం ఉంది. రేపో మాపో చనిపోతాడు. వీడికి ఎందుకు దగ్గర అవ్వాలి అనే ఆలోచన నీలో ఉంటే చెప్పు పంచమి. నిన్ను బాధ పెట్టాలని ఇలా మాట్లాడటం లేదు పంచమి. భార్యా భర్తలు అన్నాక ఒకరి మనసు మరొకరికి తెలియాలి
పంచమి: నా మనసు ఎప్పుడూ తేటతెల్లమే మోక్ష బాబు. మిమ్మల్ని ఆ గండం నుంచి ఎలా కాపాడుకోవాలనే ఆలోచన తప్ప మరేమీ ఉండదు
మోక్ష: నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావ్ పంచమి కానీ అది సఫలం కాకపోవచ్చు. ఆ పాము నన్ను కాటేసి చంపేయొచ్చు అప్పుడు నీ పరిస్థితి ఏంటి
పంచమి: అలా జరగదు. జరగనివ్వను మోక్షా బాబు
మోక్ష: అది నీచేతిలో నా చేతిలో లేదని మనిద్దరికీ తెలుసు పంచమి. ఏమైనా జరగొచ్చు. అలాంటప్పుడు నువ్వేం చేస్తావు. మీ అమ్మగారి ఇంటికి వెళ్లిపోతావా
పంచమి: అలా జరుగుతుందంటే నేను ఈ లోకం లోనే ఉండను మోక్షాబాబు. కాపాడుకోగలననే నమ్మకం ఉంది కాబట్టే నేను ఈ లోకంలో ఉన్నాను.
మోక్ష: లేదు పంచమి నేను ఎంత దగ్గర అవ్వాలని చూసినా నువ్వు దూరం దూరంగానే ఉంటున్నావు. బలవంతంగా నువ్వు నా దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. నీ మార్గం నువ్వు చూసుకో
పంచమి: అలా వెళ్లిపోవాలి అనుకుంటే నన్ను ఎవ్వరూ ఆపలేరు. మిమ్మల్ని కాపాడుకోవడానికి మృత్యువుతో పోరాడి కూడా ఇక్కడ ఉంటున్నాను. ఆ పోరాటంలో నేను గెలవడం అంతే మీరు ప్రాణాలతో ఉండడమే. అందుకు నేను మానసికంగా సిద్ధంగా ఉండాలి. శారీరకంగా కొన్ని నియమాలు పాటించాలి. అందుకు మీ సహకారం పూర్తిగా కావాలి బాబు.
మోక్ష: అలా భయం భయంగా బతకాలి అని నాకు లేదు పంచమి. ఉన్న కొన్ని క్షణాలు అయినా సంతోషంగా గడపాలి అనే నా ఆలోచన. నిన్ను మిస్ అవుతాను అనే బాధ తప్ప నాకు నేను పోతున్నాను అనే భయం లేదు పంచమి. దయచేసి నాకు దూరంగా ఉండాలని చూడకు ప్లీజ్ అని మోక్ష చెప్పి పంచమిని హగ్ చేసుకుంటాడు. ఇంతలో ఏసీ మీద ఫణేంద్ర పాము రూపంలో ఉంటాడు. దాన్ని చూసిన పంచమి మోక్షను పక్కకు నెట్టేస్తుంది. మోక్ష ఏమైంది అని అడిగితే ప్రతీక్షణం జాగ్రత్తగా ఉండాలి అని పంచమి చెప్తుంది. ప్రతీక్షణం తనకు సపోర్ట్ చేయమని తనని అర్థం చేసుకోమని చెప్పి మోక్షని దూరం పెడుతుంది.
మరోవైపు తంత్రీ, కంత్రీలు పంచమి ఇంట్లో బీరువా లాగి డబ్బు, నగలు తీసేసి ఇళ్లంతా చిందరవందరగా పడేస్తారు. ఇక చైత్ర అటువైపునకు వచ్చి డబ్బు రూం అంతా పడిఉండడాన్ని చూసి షాక్ అవుతుంది. ఇలా ఎవరు చేశారని జ్వాలను పిలుస్తుంది. జ్వాలా కూడా షాక్ అవుతుంది.ఇక పంచమిని ఇరికించేయాలి అని వాళ్లు అనుకుంటారు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: శివాజీకి ఎదురు మాట్లాడిన పల్లవి ప్రశాంత్ - శోభాశెట్టిపై ఫైర్, ఓటమికి వాళ్లే కారణమా?