Naga Panchami Serial November 14th Episode : మోక్ష: నాకు ఇప్పుడు ఎలాంటి భయాలు లేవు పంచమి. అన్నీ పటాపంచలైపోయాయి. నల్లగా కమ్ముకొని భయపెట్టిన మబ్బులు వర్షించి వెళ్లిపోయాయి. మెరుపులు, ఉరుములు లాంటి అలజడి తగ్గిపోయింది పంచమి. ఇప్పుడు నా మనసు ప్రశాంతమైపోయింది.


పంచమి: మనసులో.. నేనే ఆ పాము అన్న విషయం మోక్ష బాబుకు తెలిసు ఉంటే నన్ను ఇంత ప్రేమగా అక్కున చేర్చుకోలేదు. మరి ఎందుకు అలా ప్రవర్తించి ఉంటారు. 


మోక్ష: మన మధ్య ఇప్పుడిక ఎలాంటి అపార్థాలకు తావులేదు పంచమి. ప్రేమ ముందు భయం అనేది చాలా చిన్నది అనేది అని అర్థమైంది. అందుకే ప్రేమికులకు అంత ధైర్యం. ఒక్క క్షణం కలిసి బతికినా చాలు అనుకుంటారు. ఆ లెక్కన మనం చాలా అదృష్టవంతులు పంచమి. క్షణం ఓ యుగం అవసరం లేదు. ఒక్క రోజు లెక్క వేసుకున్నా నాకు చాలా ఆయుష్షు ఉన్నట్టే. ఇంకెప్పుడు నా చావు గురించి మాట్లాడను. ఆలోచించను పంచమి. పది జన్మలకు నెమరు వేసుకోవడానికి సరిపోయేలా నీతో గడిపిన ప్రతీ క్షణం నా మనసులో ముద్రించుకుంటూ గడిపేస్తాను. 


కరాళి: (పంచమి, మహాంకాళి మాటలు గుర్తుచేసుకుంటూ) ఓడిపోవడం కన్నా తల చిద్రం చేసుకొని చావడం మేలు. పంచమి తల పొగరు దించాలి. ఆ నాగమణిని దక్కించుకొని నాగలోకాన్ని చీకటి మయం చేసేయాలి. యువరాణిని అని విర్రవీగుతున్న పంచమి అటు నాగలోకం వెళ్లలేక ఎక్కడా ఇమడ లేక నా కాళ్ల దగ్గర పాక్కుంటూ పాములా పడుండాలి. అవసరం అయిన సమయంలో నేను నమ్ముకున్న మహాంకాళి మొండి చెయ్యి చూపించింది. నా గెలుపు మహాంకాళి కళ్లకు కట్టినట్లు చూపించాలి అంటే నా అన్నని బతికించాలి. ఎలాగైనా పంచమిని నా దారిలోకి తెచ్చుకోవాలి. అంటూ ఏదో మంత్రం చెప్తే కంత్రి, తంత్రి అనే ఇద్దరు పొట్టి వాళ్లు వస్తారు. వారిద్దరినీ మోక్ష దగ్గరకు వెళ్లమంటుంది. మోక్ష ఇంటిని వల్లకాడు చేయమంటుంది. ఆ ఇంటిని అల్లకల్లోలం చేయమంటుంది. అందరూ అందుకు కారణం పంచమి అనుకోవాలని అంటుంది. మోక్షతో సహా అందరూ పంచమిని తన్ని తరిమేసేలా చేయమంటుంది. 


పంచమి: (ఇంట్లో పూజ చేస్తూ దేవుడితో) మా ఇద్దరి లోకాలు వేరు కానీ మా మనసులు ఒక్కటే. మా ఇద్దరినీ కలిపి ఉంచే శక్తి నీకు తప్ప ఇంకా ఎవ్వరికీ లేదు స్వామి. నా భర్త ప్రాణాలు కాపాడితే చాలు స్వామి. నేను తన గుండెల్లో తనతో ఉన్నట్టే. ఇంతలో మోక్ష అక్కడికి వస్తాడు. మోక్ష కాళ్లకు పంచమి దండం పెడుతుంది. 


మోక్ష: ఏం మొక్కుకున్నావ్ పంచమి. నేను అయితే నువ్వు నా తోడుగా లేని రోజు నాకు జీవితమే ఉండకూడదు అని కోరుకున్నా పంచమి. 


వైదేహి హల్‌లో నుంచి పంచమిని గట్టిగా పిలుస్తుంది. భర్త ప్రేమగా పిలవమని చెప్పడంతో మెల్లగా పిలుస్తుంది.  ఎందుకు పిలిచావ్ అని మోక్ష అడిగితే.. జ్వాలా, చిత్ర కలగజేసుకొని పంచమిని ఇంట్లో నుంచి పంపేయడానికి అని అంటారు. ఇక ఇంట్లో వాళ్లంతా వాళ్లకి చీవాట్లు పెడతారు. 


వైదేహి: అమ్మా పంచమి నా కొడుకును నువ్వే కాపాడుకోవాలి. నాకు నా మోక్ష క్షేమంగా ఉండాలి. వాడి కోసం నీ చేతులు పట్టుకొని వేడుకుంటున్నాను. నాగగండం నుంచి నా కొడుకును నువ్వే గట్టించాలి.


పంచమి: ఆ మాట నాకు మీరు చెప్పాలా అత్తయ్య గారు. మోక్ష బాబుని కాపాడుకోవడం నా బాధ్యత కాదు. నా విధి. 


జ్వాలా: ఇందుకా ఇంత బిల్డప్.  


వైదేహి: ఈ రోజు నేనొక నిర్ణయానికి వచ్చాను. ఈ రోజు నుంచి ఈ ఇంటి పెత్తనం నీ చేతుల్లో పెడుతున్నా అమ్మా అంటూ తన తాళాల గుత్తిని తీసి పంచమికి ఇస్తుంది. ఇక చిత్ర, జ్వాలా అయితే పెద్ద గొడవ పెడతారు. అత్తయ్య మీరు మమల్ని మోసం చేశారు అంటూ విరుచుకు పడతారు. ఇక పంచమి ఆ బాధ్యతలు వద్దు అంటూ ఇంట్లో వాళ్లు అందరూ పంచమికి నచ్చచెబుతారు. ఇక వైదేహి అయితే ఇంట్లో అందరూ నిన్ను వెనకేసుకొస్తున్నారని నీకీ బాధ్యతలు ఇవ్వలేదు. నువ్వు తెలివైన దానివి అని ఇవ్వలేదు అంటుంది. ఇంతలో తన భర్త వైదేహి నువ్వు అనుకున్నది అయిపోయింది కదా అంటే ఇంకా అయిపోలేదు అండీ అంటుంది వైదేహి దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది.