Naga Panchami Today Episode పంచమి డెలవరీ కోసం పుట్టింటికి వెళ్తుంటే జ్వాల రౌడీలను పురమాయించి పంచమిని చంపేయ్‌మని చెప్తుంది. దీంతో పంచమిని అడవిలో రౌడీలు అడ్డుకుంటారు. పంచమిని పొడవడానికి రౌడీ కత్తి తీయగానే నాగేశ్వరి పాము కాటేస్తుంది. దీంతో మిగతా ఇద్దరు రౌడీలు భయపడతారు. ఇక పంచమి కూడా పరుగెడుతుంది. ఇంతలో నాగేశ్వరి ఎదురు పడుతుంది.


నాగేశ్వరి: ఎందుకు ఇలాంటి పని చేశావు పంచమి. ఈ సమయంలో నువ్వు మీ ఊరికి రావడం మంచిది కాదు. భర్త దగ్గరే ఉండాలి.
పంచమి: నాకు నా బిడ్డే ముఖ్యం నాగేశ్వరి అక్కడ ఉంటే క్షేమం అనిపించలేదు. 
నాగేశ్వరి: నీ చుట్టూ చాలా మంది శత్రువులు ఉన్నారు పంచమి. ఆ కరాళి ఇంకా నిన్ను వెంటాడుతూనే ఉంది.
పంచమి: ఆ విషయం నాకు అర్థమవుతుంది. కానీ నువ్వు నన్ను కాపాడటం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడికి నువ్వు ఎలా వచ్చావ్. 
నాగేశ్వరి: నేను ఎక్కడికైనా వెళ్తే కదా రావడానికి. ఇక్కడే ఉన్నాను పంచమి. నిన్ను నీ బిడ్డను కంటికి రెప్పలా కాపాడమని నాగదేవత ఆజ్ఞాపించింది.
పంచమి: ఎందుకు నాగేశ్వరి నాకు నాగలోకానికి రుణం తీరిపోయింది. నేను ఇప్పుడు యువరాణిని కాదు. నాగలోకానికి రాను. నువ్వు నాతో ఉంటే మళ్లీ నాకు ఆ జ్ఞాపకాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. 
నాగేశ్వరి: నువ్వు తెంచుకుంటే తెగిపోయేది కాదు పంచమి నీ బంధం. నువ్వు నాగలోకానికి వస్తాను అని రాలేదు. ఇప్పుడు రాణి లేని లోటు నాగలోకానికి ఉంది. దాన్ని సరి చేయాల్సిన కర్తవ్యం నాగదేవతకు ఉంది. అందులో భాగంగానే నేను నీకు రక్షణగా ఉన్నాను.
పంచమి: నాకు నువ్వు రక్షణగా ఉంటే నాగలోకానికి రాణి వస్తుందా నాగేశ్వరి. ఇక నేను నాగలోకం రాలేను కదా. అదీ కాక నువ్వు నాతో ఉంటే నాకు చాలా కష్టం. మరోసారి నువ్వు మా ఇంట్లో ఎవరి కంట అయినా పడితే నన్ను తరిమేస్తారు. దయచేసి వెళ్లిపో నాగేశ్వరి. నాగలోకం నాకు జ్ఞాపకాల్లో కూడా ఉండకూడదు. ఇంకెప్పుడు నాకు కనిపించకు.
నాగేశ్వరి: నువ్వు ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నావ్. నా రక్షణ నీకు చాలా అవసరం.
పంచమి: అక్కర్లేదు నాగేశ్వరి. నవ్వు ఇక్కడి నుంచి వెళ్లకపోతే నేను ఇప్పుడే తల పగలగొట్టుకొని చనిపోతా. నీకు చెప్తే అర్థం కాదు అని పంచమి తల కొట్టుకుంటుంది. 
నాగేశ్వరి: ఆగు పంచమి నేను వెళ్లలేను. ఎందుకంటే నేను రక్షణగా ఉంది నీకు కాదు. నీ కడుపులో పెరుగుతున్న మా మహారాణికి. మహారాణి నాగదేవతకు మాటిచ్చింది. అని జరిగిందంతా చెప్తుంది. నాగలోకానికి నువ్వు చేయాల్సిన ధర్మం నీ తల్లి  చేయబోతుంది. నీ కడుపున పుట్టి నాగ లోకానికి రాణిగా రాబోతుంది. నీ కడుపున పుట్టబోయేది నీ తల్లి విశాలాక్షినే కానీ నాగలోక మహారాణి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నాగలోకం తీసుకెళ్లిపోతాను.
పంచమి: అబద్ధం ఇదంతా అబద్ధం అలా జరగనివ్వను. నేను నా బిడ్డను ఎవరికీ ఇవ్వను. 
నాగేశ్వరి: ఆవేశపడకు పంచమి. జరగబోయేది అదే. నువ్వు బిడ్డను కన్న తర్వాత నీ ప్రమేయం ఉండదు. నాగశక్తితో ఆ బిడ్డ నాగలోకం చేరుతుంది. 
పంచమి: అంతా మోసం దగ, మీరంతా కలిసి నన్ను మోసం చేస్తున్నారు. నా బిడ్డను నేను ఇవ్వను. 


పంచమి పారిపోవాలి అని ప్రయత్నిస్తే నాగేశ్వరి అడ్డుకుంటుంది. దీంతో పంచమి కర్ర అందుకొని నాగేశ్వరిని కొడతా అంటుంది. దీంతో నాగేశ్వరి వెళ్లిపోతుంది. పంచమి కడుపు మీద చేయి వేసుకొని ఏడుస్తుంది.


మరోవైపు మోక్ష ఇంటికి వస్తాడు. శబరి ఏడుస్తూ కూర్చొంటే మోక్ష ఏం జరిగిందని అడుగుతాడు. దాంతో శబరి జరిగింది చెప్తుంది. దీంతో మోక్ష తల్లిదండ్రులను పిలుస్తాడు. 


మోక్ష: పంచమిని పంపించి చాలా పెద్ద తప్పు చేశారు. 
వైదేహి: తను వెళ్తాను అంది మోక్ష. కారు ఇచ్చి పంపించాం. 
మోక్ష: ఎలా అయినా పంచమిని ఈ ఇంటి నుంచి పంపేయాలి అదే కదా మీ ప్లాన్. 
రఘురాం: అదే లేదురా మోక్ష.
మోక్ష: ఇంకేం చెప్పకండి నాన్న. తను ప్రెగ్నెంట్ మెడికల్ కేర్ అవసరం. ఆ పల్లెటూరిలో ఎలా దొరుకుతుంది అనుకున్నారు. కరెక్ట్‌గా నేను లేని టైం చూసి అంతా కావాలనే ప్లాన్ చేశారు. పంచమి అన్న తన కడుపులో బిడ్డ అన్నా మీకు ఎవరికీ ఇష్టం లేదు. చాలా బాగా ప్లాన్ చేసి పంపారు. ఎవర్ని నమ్మాలో ఎవర్నీ నమ్మకూడదో కూడా తెలీదు. నా కంటికి మీరంతా శత్రువుల్లా కనిపిస్తున్నారు. నా పంచమికి ఏమైనా జరిగితే అందుకు పర్యావశానం అందరూ అనుభవిస్తారు. ఒక పసి బిడ్డను భూమ్మీదకు రానివ్వకుండా మీరంతా చేస్తున్న పన్నాగాలు చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. మీ కంటే ఆ రాక్షసులే నయం అనిపిస్తుంది. 
రఘురాం: మోక్ష మమల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావ్.  
మోక్ష: ఎలా అయితేనేం మీ అందరి పంతం నెగ్గించుకున్నారు. పంచమిని పంపేశారు. పర్వాలేదు మీరంతా ఇలాగే ఉండండి నా భార్యని నేను చూసుకోగలను. మీ కళ్ల ముందే పంచమి బిడ్డను కంటుంది. మేం హ్యాపీగా ఉంటే చూసి మీరే కుళ్లుకుంటారు. మీకో దండం.
రఘురాం: ఏడుస్తూ.. నా కొడుకు చేత ఇన్ని మాటలు పడాల్సి వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు వైదేహి. ఒక భార్యగా నువ్వు నాకు చేసిన మంచి ఇదే పంచమి. తండ్రి ఏడుపు చూసి భార్గవ్, వరుణ్‌లతో పాటు శబరి కూడా ఏడుస్తుంది. 


మరోవైపు జ్వాల పంచమి చచ్చిపోయింటుందని చిత్రతో చెప్తుంది. ఇంతలో మరో రౌడీ కాల్ చేసి జరిగింది చెప్తాడు. దాంతో జ్వాల షాక్ అయిపోతుంది. 


ఇక పంచమి నాగులావరంలోని శివాలయానికి వెళ్తుంది. శివుడి ముందు నందిని చూసి ఎమోషనల్ అవుతుంది. చిన్నప్పుడు తను ఆ గుడిలో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహాలక్ష్మి దుర్మార్గురాలని సుమతితో చెప్పిన శివకృష్ణ.. సుమతి వాయిస్ మెసేజ్‌కు అదిరపడ్డ మహా!